S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

09/17/2018 - 19:49

ఆయా కాలాల్లో లభించే పలురకాల పండ్లను తింటే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చని పోషకాహర నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో ఎంతో విశిష్టమైనది నేరేడు. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంలా పనిచేస్తాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు రోజుకు ఎనిమిది నేరేడు పండ్లు తింటే ఉపశమనం పొందవచ్చు.

09/07/2018 - 20:15

కొంతమంది బాగా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుంటారు. చక్కగా నిద్రపోతారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం వారికే అర్థం కాదు. డాక్టర్లకు కూడా కొన్నిసార్లు ఈ విషయం అర్థం కాదు. అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

09/06/2018 - 19:47

వానాకాలంలో జుట్టు తడవడం, తల జిడ్డుగా, అట్టకట్టినట్లు కనిపించడం మామూలే.. అలాగని రోజూ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని అప్పుడప్పుడూ జుట్టుకు హెయిర్ ప్యాక్స్ వేస్తూవుండాలి. అప్పుడే జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెత్తగా పట్టుకుచ్చులా కనిపిస్తుంది.

09/05/2018 - 18:41

చాలామందికి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాని వాసనా, రుచీ నచ్చదని చెబుతుంటారు. కానీ ఆకుపచ్చని కూరగాయల జాబితాలో క్యాబేజీని సూపర్ వెజిటబుల్‌గా చెప్పవచ్చు. క్యాబేజీలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని విటమిన్లకు నెలవుగా చెప్పవచ్చు.

09/02/2018 - 23:13

వానాకాలంలో జుట్టు తడవడం, తల జిడ్డుగా, అట్టకట్టినట్లు కనిపించడం మామూలే.. అలాగని రోజూ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని అప్పుడప్పుడూ జుట్టుకు హెయిర్ ప్యాక్స్ వేస్తూవుండాలి. అప్పుడే జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెత్తగా పట్టుకుచ్చులా కనిపిస్తుంది.

08/29/2018 - 19:00

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో చింతచిగురు ఒకటి. చింతచిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా ఉంటాయి. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసులవారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు. లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చడి చేస్తారు.

08/28/2018 - 20:06

మొలకెత్తిన గింజల్లో బఠానీలు మరింత మంచి బలవర్థకాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. వీటిల్లో 14.5 కార్బోహైడ్రేట్స్, 5.7 పీచు పదార్థాలు, 5.4 ప్రోటీన్స్, ఉంటాయి. అంతేకాదు 1.5.మి.గ్రా ఐరన్, 1.2 మి.గ్రా.జింక్ విటమిన్ సి 40 మి.గ్రా. ఉన్నాయి. వీటి అన్నింటి వల్ల శరీరానికి మంచి పోషక శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకొన్నవారు కూడా ఈ బఠానీలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

08/26/2018 - 21:55

బరువు తగ్గడానికి చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తిండిమానేయడం, అర్ధరాత్రి వరకు నిద్రమానేయడం, ఒక్కరోజులోనే సన్నగైపోవాలని విపరీతమైన వర్కవుట్స్ చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య కూడా బరువును పెంచుతుంది తెలుసా! నిద్రలేమి సమస్య వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

08/22/2018 - 20:04

వ్యాయామం చేసేటపుడు చికాకుగా అనిపించి జుట్టును గట్టి ముడివేస్తుంటాం కదా. కానీ ఇలా గట్టిముడి వేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతాయి. పైగా చెమట పట్టడం వల్ల జుట్టు ఊడిపోవడం లేదా ఎండుగడ్డిలాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాకాకుండా ఉండాలంటే జుట్టుకు వ్యాయామానికి ముందు కండీషనర్ రాయాలి. ఆ తరువాత ముడి కూడా జారుగా ఉండే ముడే వేసుకోవాలి.

08/21/2018 - 20:41

శ్రావణంలో మంగళ , శుక్ర, శని, సోమ ఇలా అన్ని వారాలు ముఖ్యమైనవే. ముతె్తైదువులకు తాంబూలాలు అంటూ ఇస్తుంటారు. వీటిల్లో నానబెట్టిన శనగలు తప్పనిసరిగా ఇస్తారు. వీటిని పచ్చివే కాక వంటకాల్లోను ఉపయోగించి రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. నానబెట్టిన శనగలు ప్రతిరోజు తీసుకొంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మొలకెత్తిన గింజలు ఒక్క శనగలే కాదు ఏ తృణధాన్యమైనా ఆరోగ్యానికి మంచిదే.

Pages