S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/20/2018 - 22:38

ఈమధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటి కనిపిస్తుంది. ఆహారం తిన్నవెంటనే కడుపులో, ఛాతీలో మంట అంటుంటారు. అసలీ మంట ఎందుకు వస్తుందంటే ఆహారం జీర్ణం కావడానికి విడుదలయ్యే ఆమ్లాలు, రసాలూ జీర్ణాశయంలో అవసరానికి మించి విడుదల అవుతుంటాయి. దీనితో తిన్న ఆహారం ఆ అమ్లాలు కలసి పైకి ఎగతన్ని గుండెలో మంట వేధిస్తుంది. ఇంకొందరికి నోట్లో పుల్లని నీళ్లు వస్తుంటాయి. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది.

08/17/2018 - 19:44

* ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. మిఠాయిలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌పాస్ట్ ‘పళ్లు’ తినడంతో ప్రారంభించాలి. మజ్జిగ అన్నం మంచిది (ఉప్పు తక్కువ) లేదా పెరుగు అన్నంలో అల్లం ముక్కలు... కరివేపాకు కలుపుకొని తినాలి.
* మధ్యాహ్నం డైట్‌లో గింజలు, పప్పులు, విత్తనాలు, కొవ్వు తక్కువ వుండే నూనెలుతో ఆహారం తినాలి. తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు చేప, గుడ్లు, మాంసం...

08/16/2018 - 20:15

* ఎముకల బలానికి, దగ్గు, ఆయాసం తగ్గడానికి గోంగూర దివ్యౌషధం
* ప్రతిరోజు రెండు రెమ్మల కరివేపాకును పరగడుపున తింటే కంటి చూపు మెరుగు అవుతుంది. బానపొట్ట తగ్గుతుంది.
* జలుబు, దగ్గు, ఆయాసం శరీరంలో వేడి వీటి అన్నింటినీ ధనియాల కషాయం దూరం చేస్తుంది.
* చర్మం నిగారింపు కోసం మెంతికూరను ఆహారంలో రోజు తీసుకోండి.
* శరీరంలోని కొలెస్ట్రాల్‌ను బార్లీ గింజలు తగ్గిస్తాయి.

08/10/2018 - 21:22

1. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకొంటే ఇన్సులిన్ వృద్ధి అవుతుంది.
2. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ను దరికి రానివ్వదు.
3. బీట్‌రూట్ రసం బి.పీని నియంత్రిస్తుంది.
4. క్యారెట్ జ్ఞాపక శక్తిని ఇస్తుంది. వూబకాయం నుంచి రక్షిస్తుంది.
5. మొక్కజొన్న మలబద్దక నివారణి.
6. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. బాన పొట్టను కరిగిస్తుంది.
7. అల్లం ఎక్కిళ్లను దూరం చేస్తాయ.

08/09/2018 - 21:20

ప్రతిరోజు పండ్ల తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగాలు వచ్చాక వాటిని తగ్గించుకోవడం కాక అసలు రోగాలే రాకుండా చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా. అందుకే ప్రతిరోజు ఆహారంతో పాటుగా పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేరేడు పండ్లు తింటే బొజ్జలో వెంట్రుక ఉంటే కరిగిపోతుంది.
నేరేడులోని గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

08/08/2018 - 19:47

ఎదుటివారిని ఆకర్షించేది మనిషి ముఖమే అయినా అందులోకూడా పెదాలు మొట్ట మొదట కనిపిస్తాయి.మాట వల్లే స్నేహం ఏర్పడుతుంది. మాటను వెలువరించేది నోరే కనుక ఆ నోటికి తలుపుల్లాంటివి పెదవులు. వీటిని కొందరు అతిగా పట్టించుకుంటే మరికొందరు నిర్లక్షం చేస్తుంటారు.
ఇందులో ఏది చేసినా ముప్పేర్పడుతుంది.
ఆ ముప్పు తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

08/07/2018 - 19:06

చాలామంది అందమైన ముఖానికి కారణం పలువరుసే అంటారు. వీటిని ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం తోపాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే పంటి వలన వచ్చే వ్యాధులనుంచి దూరంగా ఉండవచ్చు. నోటి పరిశుభ్రత లేకపోవుట వలనగానీ, గార శుభ్రం చేయకపోవుటవలన గాని, ఆహార పదార్థములు ఎక్కువగా చిగుళ్ళ మధ్యలో ఇరుక్కోవటం వలన గాని, కొన్ని తరహా సూక్ష్మక్రిముల వలనగాని పంటినొప్పి, పళ్లు పుచ్చడం లాంటివి వస్తాయ. ఒక్కోసారి చిగుళ్లు వాపు వస్తాయ.

08/07/2018 - 19:00

* పని ఒత్తిడి కలిగినప్పుడో లేక,చదువుకుంటూ ఉన్నప్పుడూ టీ తాగాలనిపిస్తే అరగ్లాసు వేడినీళ్లు తాగండి. అటు జీర్ణశక్తి తోపాటు పనిలో ఏకాగ్రత కుదురుతుంది.
* కూరలు చేసేటపుడు ఘాటైన వాసన ఇల్లంతా అలుముకుంటే వెనిగర్‌ను స్ప్రే చేయండి.
* ఈ వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి కర్పూరం వెలిగించకుండా అక్కడక్కడా పెట్టి ఉంచండి.

08/05/2018 - 21:52

* ఇంట్లో సాంబ్రాణి పొగ అప్పుడప్పుడూ వేసినా మంచి సువాసనతోను, పురుగులు దూరంగాను ఉంటుంది.
* సాంబారు చేసేటపుడు మరీ పలుచగా అయిపోతే ఒక చెంచా బియ్యపుపిండిని కలపండి.
* ఉప్పు ఎక్కువైన కూరల్లో పచ్చిమిరప కలపండి.
* ఉల్లిపాయలు వేపేటపుడు చిటికెడు చక్కెర కలిపితే మంచి బ్రౌన్‌కలర్ వస్తాయి. మంచి రుచి రంగు వస్తుంది.

07/30/2018 - 19:13

ఎవరికైనా నేటి కాలంలో వ్యాయామం తప్పనిసరి. కాకపోతే మోనోపాజ్ కు చేరువ అవుతున్న మహిళలుమాత్రం వ్యాయామానికి మరింత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందే. లేనట్టయితే గుండెజబ్బులు, కండరాలు పట్టుకోవడాలు, మధుమేహం, ఇంకా ఇంకా అనేకానేక జబ్బులు వస్తుంటాయి. అట్లాకాక 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్టుగానే ఉండాలి అంటే తప్పనిసరిగా పొద్దునే్న వాకింగ్ కి వెళ్లాలి. కనీసం అర్థగంట మీకోసం మీరు ఏర్పాటు చేసుకోవాలి.

Pages