S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

07/09/2018 - 22:26

వాతావరణం మారుతోంది. క్రమంగా మండే ఎండలు పోయి చల్లబడుతోంది. మేఘావృతమై చల్లని గాలులు, అడపా దడపా వర్షాలు పలుకరిస్తున్నాయి. నిన్నటి దాకా వేసవి సెలవుల్లో గడిపిన విద్యార్థులు మెల్లగా స్కూలు మెట్లు ఎక్కుతున్నారు. వారి చదువుల బాట పట్టడం ఇటు వర్షాకాలం ఆరంభమవడం మొదలై పోయింది.

07/06/2018 - 21:07

అల్లం: అల్లం చిన్న పిల్లలు, పెద్దవారిలో కాని పైత్యం లాంటి వాటికి విరుగుడుగా పనిచేస్తుంది. అల్లాన్ని టీలోకానీ, లేదా అల్లం రసంగాని తీసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో ఏర్పడే నులిపురుగులను దూరం చేయవచ్చు. అల్లం రసాన్ని జలుబు చేసినపుడు తగు మోతాదులో తీసుకుంటే జలుబు మటుమాయం అవుతుంది. చిన్న కణుపు వున్న అల్లం ముక్కను మట్టిలో పాతితే ఒక వారంరోజుల్లోనే మళ్లీ అది పిలకవేస్తుంది.

07/02/2018 - 21:56

వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. అలాకాకుండా ముఖం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఈ వానాకాలంలో పెసరపిండి వాడాలి. పెసరపిండి వాడటం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో అందంగా ఉంటుంది.

06/28/2018 - 22:00

* ఉదయానే్న గోరు వెచ్చటి నీటిలో కాసింత నిమ్మరసం వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నెయ్యి, నూనె పదార్థాల ద్వారా శరీరంలో చేరిన కొవ్వును ఘనీభవించేలా చల్లటి నీరు పనిచేస్తుంది. గనుక గోరువెచ్చటి నీరు తాగితే కొవ్వు కరగిపోయే వీలుంటుంది.
* ఉదయానే్న పరగడుపున గోరు వెచ్చటి నీటిని తాగితే మలబద్ధకం సమస్య తీరుతుంది.

06/28/2018 - 00:12

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.

06/26/2018 - 22:09

కాలంతో సంబంధం లేకుండా కొందరికి నిత్యం పెదాలు రంగు మారడం, పొడి బారడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆస్పత్రులకు వెళ్లి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి పెదాలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
* ఆలివ్ నూనెలో కాస్త పంచదార వేసి పెదాలకు మృదువుగా రాసుకుంటే పొడి బారడం క్రమంగా తగ్గుతుంది.

06/26/2018 - 21:53

వంట చేస్తున్నపుడు, వడ్డన సమయంలో దుస్తులపై ఆహార పదార్థాలు పడడం సహజం. దుస్తులపై టీ పడినచోట పాలలో ముంచిన దూది లేదా స్పాంజితో తుడిస్తే మరకలు పోతాయి. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్దితే దుస్తులపై నూనె మరకలు తొలగిపోతాయి. బాగా ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కలను బట్టలపై రుద్దితే ఎలాంటి మరకలైనా అదృశ్యం అవుతాయి. దుస్తులపై తుప్పు మరకలున్న భాగాన్ని వెనిగర్‌లో ముంచితే ఫలితం కనిపిస్తుంది.

06/25/2018 - 22:14

మధురమైన రుచిని అందించే మామిడి పండంటే ఇష్టపడని వారుండరు. అరుచి సమస్యను పొగొట్టే ఈ ఫలం జీర్ణానికి దివ్యౌషధంలా పనిచేస్తూ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులోని విటమిన్-ఎ పసివారికి, ఎదిగే పిల్లలకు, గర్భిణులకు మేలు చేస్తుంది. వీటిని తరచూ తింటే రేచీకటికి దూరంగా వుంటారు. చిన్నారులకు ప్రీతికరమైన మ్యాంగో జ్యూస్ ఊపిరితిత్తుల రోగాలను, ఎలర్జీలను నిరోధిస్తుంది.

06/22/2018 - 03:10

మనం ఎంత బిజీగా ఉన్నా, శరీరమనే యంత్రంలోని అన్ని అవయవాలూ మనకు సహకరించాలంటే తప్పక ఆహారం తీసుకోవాలి. దానిని సరైన పాళ్లలో, సరైన సమయంలో తీసుకోవాలి. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కన్నా కీడే ఎక్కువ. తగిన ఆహార నియమాలను పాటిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చు.

06/17/2018 - 21:42

ఆ గొంతు సమస్యలతో బాధపడేవారు రోజూ నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆ గొంతు నొప్పితో బాధపడుతుంటే గ్లాసు వేడి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
ఆ కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవుతుంది. దానితో పాటు గొంతు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

Pages