S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

04/29/2018 - 21:16

* బిస్కెట్లు ప్యాకెట్‌ల్లో కింద అపుడపుడు బిస్కెట్ పొడి వస్తుంటుంది. దీన్ని కట్‌లెట్ పైనవేసుకొంటే ప్రత్యేక రుచి వస్తుంది. లేకుంటే చపాతీల పిండిలో కలిపితే చపాతీలకు అదనపు రుచి వస్తుంది.
* టమోటా పచ్చడికోసం టమేటాలను ముక్కలను చేసి వాడ్చడం వల్ల త్వరగా వాడి గ్యాస్ ఆదా అవుతుంది.
* కేకు తయారీలో బేకింగ్ పౌడరు చేర్చితే కేకు గుల్లగా వస్తుంది.

04/18/2018 - 22:32

వేసవికాలం వచ్చేసింది. పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. సమ్మర్ క్యాంప్స్ అంటూ స్కూల్స్ అన్నీ సందడి చేస్తున్నాయి. కాని కొందరు పిల్లలు మళ్లీ సమ్మర్ క్యాంపుకుపోవడం ఇష్టపడడం లేదు. మేము ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాం అని మారాం చేస్తున్నారు.

04/12/2018 - 22:28

నేటితరం అమ్మాయిలు పోషకాహారం అంటూనే అవకాడో, ఓట్‌మీల్, క్వినోవా, మయోనైజ్‌డ్, డార్క్ చాక్లెట్స్, నట్స్, డ్రైట్ కోక్స్ వంటివాటిని ఎక్కువగా తింటూ శరీరంలో కేలరీలను పెంచేసుకుంటున్నారు. ఇవన్నీ బరువుపెంచే ఆహారాలే.. సమయాను కూలంగా, వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆహారాన్ని ఎంచుకోవాలి.

04/10/2018 - 21:03

వేసవి వచ్చిందంటే ఎండ వేడిమి తట్టుకోలేరు. ఉద్యోగినులు సరేసరి. మామూలు వ్యక్తులకి కూడా బజారు పనులు తప్పవు. తప్పక చిట్కాలు పాటిస్తే కొంత ఉపశమనము. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1. కళ్ళజోడు - గొడుగు తప్పనిసరి, వెహికల్ అయితే, చున్నీలు, హెల్మెట్‌లు వాడి ఎండ వేడిమి తప్పించుకోవాలి.
2. కాటన్ దుస్తులు, కొంచెం తేలికపాటి బట్టలు ధరించడం మంచిది.

04/06/2018 - 21:22

పగిలిన మడమల సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. కొన్నిసార్లు ఈ పగుళ్ళు చాలాలోతుగా తయారై నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. పాదాలను నిర్లక్ష్యం చేయడం, ఎక్కువ సేపు నిల్చోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల పగుళ్ళు ఏర్పడతాయి. ఎగ్జిమా, సోరియాసిస్, థైరాయిడ్, మదుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా కాళ్ళు పగులుతాయి. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల పాదాలు పగుళ్ళు తగ్గి అందంగా తయారవుతాయి.

04/02/2018 - 21:24

భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. పరగడుపున కాసిన్ని ఉసిరికాయ ముక్కలు నోట్లో వేసుకుని, మజ్జిగ తాగితే భోజనం ఆలస్యమైనా శరీరానికి శక్తి లభిస్తుంది. ఇందులోని విటమిన్-సి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే మూత్రకోశంలో మంట, నొప్పి తగ్గి మూత్రవిసర్జన సక్రమంగా అవుతుంది. ఉసిరితో ఆవకాయ, తొక్కుడుపచ్చడి వంటివి చేసుకోవచ్చు.

03/29/2018 - 21:36

టీనేజీ నుంచి మధ్యవయస్సు అమ్మాయిల వరకూ దాదాపుగా అందరూ ఎదుర్కొనే చర్మ సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య మొటిమలు. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్య దరిచేరకుండా చేయవచ్చు. మొటిమలను తగ్గించనూవచ్చు.
* రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో కడగాలి. మరో నాలుగైదుసార్లు ముఖంపై చల్లటి నీటిని చిలకరించుకుంటూ ఉంటే ముఖం శుభ్రపడి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

03/22/2018 - 20:35

తగిన పోషకాహారం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచడం సాధ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలతో పాటు కొవ్వు తక్కువగా ఉండే పాలను మధుమేహరోగులు తీసుకోవడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్‌కు మాత్రం వీలైనంత మేరకు దూరంగా ఉండాలి. గింజలు, మొలకలు వంటివి తీసుకోవచ్చు.

03/14/2018 - 22:23

* బరువు తగ్గాలనుకుంటే రోజూ రెండు సపోటాలు తినడం మంచిది. యోగా, వ్యాయామం చేశాక సపోటా తింటే అలసట మరచిపోయి మానసికోల్లాసం కలుగుతుంది.
* సపోటాలో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల నేత్ర సంబంధ సమస్యలు దూరమవుతాయి. నీరసంగా ఉన్నపుడు వీటిని తింటే వెంటనే శరీరం ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచేందుకు, మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు వీటిని తినడం ఉత్తమం.

03/12/2018 - 23:15

* ముల్లంగి ముక్కలను నానబెట్టిన నీటిలో యాలకుల ముద్ద వేసి తింటే గొంతులో వాపు తగ్గుతుంది.
* భోజనం ముగిశాక ఒకటి, రెండు యాలకులు తీసుకుంటే నోరంతా సువాసనతో గుబాళిస్తుంది.
* గొంతులో మంటతో, దగ్గుతో మాట బొంగురుపోతుంటే ఉదయానే్న రెండు, మూడు యాలకులను నమలి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Pages