S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/06/2017 - 19:41

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనం అయిన తరువాత బెల్లం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులు, శ్వాసనాళలు, ఆహారనాళలు చక్కగా పనిచేస్తాయి. రక్తం వృద్ధి అవుతుంది. వేసవి కాలంలో వేడి నీటిలో బెల్లం కరిగించి తాగితే శరీరానికి చలువ చేస్తోంది. సహజమైన తీపి వున్న బెల్లం శరీర శక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది.

12/02/2017 - 18:22

మహిళలు ఇంటి పని, వంట పని ఇలా అన్నీ ముగించుకుని ఆఫీసుకు వెళ్లినప్పటికీ నిస్సత్తువుగా ఉంటారు. ఏ పనిచేయలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగం చేసే ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య ఇది. పోషకాహారం తీసుకోకపోవటం వల్ల వచ్చే సమస్య కాదు. శరీరానికి కావల్సిన వ్యాయామం లేకపోవటం వల్ల కూడా ఇది జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

12/01/2017 - 19:38

కరివేపాకును శుభ్రంగా కడిగి దాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఒక కప్పు, ఆల్‌మండ్ ఆయిల్ ఒక చెంచాడు వేసి బాగా కలిపి తలకు ప్యాక్‌లా పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చటి నీటితో దాన్ని కడిగేసుకోవాలి. జుట్టును బట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ ప్యాక్‌ను పెట్టుకోవడం వల్ల జుట్టులోని తెల్ల వెంట్రుకలు తగ్గడమే కాకుండా జుట్టు నిగారింపును పెంచుతుంది

12/01/2017 - 19:36

మీరు జంతుప్రేమికులైతే పెట్‌ను ఇంటికి తెచ్చుకునేటపుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
* కుక్కయినా, పిల్లి అయినా చంటిపాపాను సాకినట్లు సాకాలి. అలాగే మీరు మాట్లాడే భాష దానికి అర్థమయ్యేలా దాంతో ముచ్చటిస్తూ ఉండాలి. కుక్క కాస్త క్రూరంగా వ్యవహరిస్తున్నట్లు గమనించితే.. వెనువెంటనే వదలిపెట్టేయండి.

11/30/2017 - 21:16

చలికాలంలో దోమలు విజృంభించే కాలం. అవి మనం విడిచిపెట్టే కార్బన్ డై ఆక్సైడ్‌కు ఆకర్షితమవుతాయట. అందుకని వాటిని పట్టుకోవాలంటే ఐస్ గడ్డలను ఓ కంటెయినర్‌లో ఉంచి ఇంట్లో అక్కడక్కడ ఉంచాలి. దోమలు వీటి దగ్గరకు చేరతాయి. అప్పుడు దోమలను ఎలక్ట్రిక్ బ్యాట్‌తో పూర్తిగా చంపవచ్చు.

11/28/2017 - 18:50

చలికాలంలో కురులు బిరుసుగా మారుతుంటాయి. కాబట్టి వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే మంచిది. తల స్నానం చేసే ముందు గోరువెచ్చటి నూనె రాసుకుని తలంటుకుంటే వెంట్రుకలు మెత్తగా ఉంటాయి.
తలకు రెండుసార్లు మాత్రమే హెన్నా పెట్టుకోవాలి. హెన్నా పెట్టుకునే ముందు కూడా తలకు నూనె రాసుకుంటే మంచిది. హెన్నాకు నిమ్మరసం చేర్చితే చుండ్రు సమస్య నివారించబడుతుంది.

11/28/2017 - 18:49

అసలు రోజువారీ ఆహారంలో అదనంగా చక్కెరను తీసుకోవడమే అనర్థాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. యాడెడ్ షుగర్‌లో ఎలాంటి పోషకాలు కేవలం తక్షణం శక్తినిచ్చే కేలరీలు మాత్రమే ఉన్నాయి. పైగా పళ్లకు హానికరం. ఎందుకంటే తీపి పదార్థాలు పళ్ల దగ్గర ఆగడంవల్ల ఆ సుకోజ్ చుట్టూ బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో పళ్లు పుచ్చిపోతాయి. అందుకే ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు పుక్కిలించి వదలమని చెబుతుంటారు.

11/25/2017 - 20:05

పసిబిడ్డలకు సోయా పాలు మంచి అనువైన ఆహారం. పిల్లలు డెయిరీ పాలల్లో వుండే లాక్టోజును గ్రహించి జీర్ణం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. ఫలితంగా అనేక రకాల ఉదర సంబంధ రుగ్మతలకు గురవుతున్నారన్నది ఒక అధ్యయనం. వయసుమీదపడే కొలది ఎముకల్లో శక్తి సన్నగిల్లుతూ కణ నిర్మాణం సడలుతుండటాన్ని శాస్ర్తియంగా ఆస్టయోపోరోసిస్ లక్షణాలుగా గుర్తిస్తారు. దీనివల్ల తొంటి ఎముకలు విరగడం, కీళ్ళ సంబంధ బాధలు పెరుగుతాయ.

11/24/2017 - 19:25

చిన్నారులనుండి పెద్దలవరకూ ఇష్టపడే జామకాయలో పోషక విలువలు మెండుగా వున్నాయి. ఇపుడు మార్కెట్లో విరివిగా దొరుకుతాయ. విటమిన్ సి, ఇనుము జామలో అధికంగా వున్నాయి. దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు రావు. విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చికాయలో విటమిన్ల శాతం అధికంగా వున్నాయి. పచ్చి జామ జ్యూస్ త్రాగడం చాలా మంచిది. రోజుకు ఒక జామకాయ తింటే ఆరోగ్యం, ఆయుష్షు మెరుగుపడుతుందని ఆయుర్వేదంలోనూ వివరించారు.

11/23/2017 - 18:25

ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మట్టిని ఇది పూర్తిగా తొలగించేస్తోంది. కాబట్టి ముల్తానీ మట్టిని రోజ్‌వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప్యాక్‌లా వేసుకుంటే నల్లదనం తగ్గిపోతుంది. వారానికోసారి ఇలా చేస్తే చాలు. ముల్తానీ మట్టిలో ఉన్న మినరల్స్ చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించటంతో ఉపయోగపడతాయి.

Pages