S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

07/27/2016 - 21:34

అదో చిత్రమయిన ఆకాశ హోటలు. స్విట్జర్లాండులో ఆల్ఫ్స్ పర్వత శ్రేణి మధ్యనున్న గ్రావుబుండేన్ (దీనికి రకరకాల ఉచ్ఛారణలున్నాయి, ఆ దేశాల్ని బట్టి) కొండ ఎత్తు 6463 అడుగులు (ఎంత నిఖారుగా కొలిచారో!). దానిమీద నెల్‌స్టర్న్ హోటలు గ్రూపువారు ‘జీరో స్టార్ హోటల్’ పేరిట ఒక ఆరుబయటి హోటల్ని నిర్మించారు.

07/26/2016 - 21:27

దోమల నివారణ ప్రపంచవ్యాప్త సవాలు. దోమలవల్ల మలేరియా, చికన్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పెద్ద కంపెనీలు తయారుచేస్తున్న కాయిల్స్, ఇతర పరికరాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. పెప్పర్‌మింట్ ఆయిల్ ద్వారా దోమలను సమూలంగా నిర్మూలించవచ్చని ఢిల్లీకి చెందిన శాస్తవ్రేత్త పద్మావాసుదేవన్ కనుగొన్నారు.

07/21/2016 - 23:35

తలారా స్నానం చేసిన తర్వాత తలను తడిగా ఉంచుకోవద్దు. దీనివల్ల చుండ్రు ఏర్పడుతోంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్‌తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి.
- తలకు రోజూ నూనె రాసుకోవటం (వారానికి రెండుసార్లయినా) అన్నది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది. జుట్టు జిడ్డుగా ఉన్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.

07/20/2016 - 22:35

విందు భోజనం తర్వాత తమలపాకు కిళ్ళీ వేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. పండుగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో తమలపాకు తప్పనిసరిగా వుండాల్సిందే. రాజు, పేద తేడాలేకుండా అందరినీ రంజింపజేసే తమలపాకు పుట్టిల్లు మలేషియా. రెండువేల సంవత్సరాల క్రితమే ఇది ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది.

,
07/14/2016 - 21:45

పొట్టకు విరామం లేకుండా మహిళ కిచెన్‌లో టిఫిన్లు, భోజనాలు, ఆరగా ఆరగా కాఫీలు, టీలు అందించే గృహిణికి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే ఆస్కారం లేదు. ఇంట్లో దొరికేవాటితోనే ముఖం కాంతిగా వుండేందుకు చిట్కాలు ఇవి.
బచ్చలి ఆకులను పేస్టులా చే సి ముఖానికి రాసుకుంటే ము ఖం కాంతివంతంగా ఉండటమే కాక మొటిమలు రాకుండా ప్రివెంటివ్‌గా వుం టుంది.

07/08/2016 - 21:25

గినె్న అంచులకి గ్లిసరిన్ రాస్తే పాలు పొంగవు.
నువ్వుల పప్పు వేయించేటప్పుడు మూకుడులో రెండు చెంచాల నీరు కూడా పోసి వేయించితే పొడి కొట్టినపుడు ముద్ద అవదు.
వంటగదిలో ఈగల బాధ అధికంగా వుంటే పుదీనా ఆకుల్ని బాగా నలిపి కిచెన్ రూంలో నాలుగైదు చోట్ల వుంచండి. ఈగలు దూరంగా పోతాయి.
వాష్‌బేసిన్‌లో చిన్న కర్పూరం ముక్క వేస్తే బొద్దింకల్లాంటి పురుగులు దరిచేరవు.

07/07/2016 - 21:54

పార్టీకెళ్లాలి. చిటికెలో తాజాగా అరవిరిసిన గులాబీ వలే కనబడాలంటే ఎలా అని ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలుపుకోవాలి. దానికి చెంచా తేనె, చెంచా గంధం పొడి, చెంచా ముల్తానీ మట్టి జతచేసి అవసరాన్ని బట్టి పాలతో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా కనపిస్తోంది.

07/06/2016 - 23:27

పసిబిడ్డలకు గజ్జి, తామరలాంటివి శరీరంపై కనిపిస్తే ఆ ప్రాంతంలో శుభ్రం చేయటానికి తల్లులు భయపడతారు. కాని ఇలాంటి చర్మవ్యాధులు ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేయించమని అంటున్నారు. ఇలా రోజూ స్నానం చేయించటం వల్లనే వారికి ఆ వ్యాధులు త్వరగా మానిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి చర్మంపై తేమ ఎక్కువగా ఉన్నా, డైపర్స్ సరి గా మార్చకపోతే ఆయా ప్రాం తాల్లో తామర వస్తోంది. అక్కడ తాకితే చాలు మంటగా ఉంటుంది.

07/05/2016 - 21:23

ఆధునిక మానవుడు దైనందిన జీవితంలో వత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన వైవిధ్యం లేకపోవడం వంటి కారణాలవల్ల అస్వస్థతకు గురవుతున్నాడు. మనిషిని పట్టిపీడించే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్లవల్లే వస్తాయని కార్నిగే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లేర్‌షా తన పరిశోధనల్లో నిర్ధారించారు.

07/03/2016 - 00:26

కంటికి జబ్బులు నుంచి దూరం చేసే కాయగూరలు, పండ్లు మీద ఇటీవల ఎయిమ్స్ వైద్యుల బృందం విస్తత్ర పరిశోధనలు చేసింది. పేదవాడి యాపిల్‌గా పిలువబడే జామ కంటికి ఎంతో మేలు చేస్తుందని ఆలిండియా మెడికల్ సైన్స్ వైద్యులు చెబుతున్నారు. అలాగే నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతుకూర కూడా దృష్టిలోపాలను నివారిస్తుందని వీరి పరిశోధనలలో వెల్లడైంది.

Pages