S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/08/2016 - 08:45

పొన్నగంటికూర రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీరానికి చలువనిస్తుంది. గుండెకి మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా వుంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్ర వ్యాధులవను నివారిస్తుంది. పొన్నగంటి ప్రొటీన్ల పుట్ట అని సామెత. విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబొఫ్లావిన్, పొటాసిం, ఇనుము, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగావుంటాయి. గోధుమపిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే 30 శాతం అధికంగా ప్రొటీన్లు దీనిలో వున్నాయి.

12/01/2016 - 01:16

మన దేశంలో కుక్కల బెడద ఆ సేతుహిమవన్నగమూ వున్నది. ఇక వానర మూకల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. కనబడితే కాల్చిపారేయమన్నారు కోతుల్ని సిమ్లాలో! ‘కుక్కల్ని హింసిస్తే నేరం’ అంటూ వున్న కేరళ రాష్ట్రంలో మోతుబరులూ, పెద్దలూ అయిన వాళ్ళే- ‘తట్టుకోలేం, వీటిని చంపేస్తాం’’ అంటూ చందాలు వేసుకుని మరీ రంగంలోకి దిగారు.

11/29/2016 - 22:41

వారానికి రెండుసార్లు చొప్పున నెలరోజుల పాటు పది మందారపూలు, 20 కరివేపాకులు, కొద్దిగా పాలు కలిపి రుబ్బి, మూడు స్పూన్ల తేనె, ఒక గుడ్డుసొన కలిపి తలకు పట్టించి 40 నిమిషాలాగి తలస్నానం చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది.
రెండు టీ స్పూన్లు ఆముదం, ఒక స్పూన్ గ్లిజరిన్, గుడ్డులోని తెల్లసొన కలిపి ఈ మిశ్రమాన్ని తడిజుట్టుకు మసాజ్ చేసి కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.

11/25/2016 - 04:08

మహిళలపట్ల వివక్షను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను వారి ముంగిట నిలిపాయి. చట్టాల, పథకాల అమలులో కొంతవరకు లోపాలున్నా.. ఉన్నత ఆశయాలకు, ఆదర్శాలకు ఇవి అద్దంపడుతూనే వున్నాయి.
అభయహస్తం

11/23/2016 - 21:11

చలికాలంలో సౌందర్యం ఇనుమడించేలా ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగన స్నానం ఆచరించక తప్పదు. అభ్యంగన స్నానం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమే. అయినా, ఆసక్తి తరిగిపోవడానికి కారణం సమయం సరిపోడకనో! నివాస స్థలంలో వీలు పడకనో! చర్మ సౌందర్యానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న కాస్మొటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ చేతులారా కొనితెచ్చుకునే బదులు సహజమైన అభ్యంగనస్నానం చేయడం మంచిది.

11/18/2016 - 22:07

కాబేజీ గుజ్జు తలకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పెసర పిండి మాడుకు, జుట్టుకు పట్టిస్తే జుట్టు పెరుగుతుంది.
కలబంద ఆకుల రసం జుట్టుకు, మాడుకు పట్టించడం
ఆలివ్ ఆయిల్‌లో గుడ్డు తెల్లసొన కలిపి తలకు రాసుకోవాలి. తదుపరి స్నానం చెయ్యాలి.

11/17/2016 - 00:19

ఉన్నంతలో కాస్తంత సొగసుగా..స్టైల్‌గా..మెరిసే చర్మంతో మెరవాలని ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. కాకపోతే అందం విషయం వచ్చే సరికి అమ్మాయిలే తహతహలాడతారు అని అనుకుంటారు. కాని అమ్మాయిల కంటే అబ్బాయిలే అబ్బాయిలే నేడు మెరుపులద్దటానికి తపించిపోతున్నారు. నయా ట్రెండ్స్ సృష్టించేస్తున్నారు. సౌందర్య సలహాల కోసం వెతకని వెబ్‌సైట్ లేదంటే అతిశయోక్తి కాదు. ఫ్యాషన్ బ్లాగులకూ కొదవలేదు.

11/12/2016 - 05:19

ఇంగువను నీళ్లలో అరగదీయగా వచ్చిన ద్రవాన్ని పార్శ్వపునొప్పి ఉన్న వైపు ముక్కులో రెండు చుక్కలు వెయ్యాలి.
తమలపాకులకు నూనెరాసి బాగా వెచ్చచేసి కణతలపై ఉంచితే తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి.
రోజుకు మూడుసార్లు కొబ్బరి నీరు త్రాగితే పార్శ్వపు నొప్పులు వాంతులు తగ్గుతాయి.
శొంఠిని అరగదీసి కణతలకు, నుదుటికి పట్టించాలి.
సముద్ర పాల వేరు పొడిని గంజితో కలిపి తీసుకోవాలి.

11/11/2016 - 00:20

సూర్యుని లేత కిరణాల ద్వారా శరీరానికి డి విటమిన్ అందుతుంది. పల్లెటూళ్లలో ఆరుబయట పనులను చేయడంవల్ల సూర్య కిరణాలు శరీరం మీద ప్రసరిస్తాయి. దాని నుంచి లభించే శక్తివల్ల శరీరం చురుకుగానూ, ఉత్సాహంగానూ వుంటుంది. ఇప్పటికీ పెద్దవారైన స్ర్తి పురుషులు సూర్యనమస్కారాలు చేయడం గమనించవచ్చు. కొంతమందికి సూర్యుని దర్శించనిదే పూజ చేయకూడదన్న దీక్ష ఉంటుంది.

11/08/2016 - 22:54

ఫ్లా ట్‌లో ఒంటరిగా వున్న వృద్ధురాలు సీతారావమ్మపై అపరిచిత వ్యక్తి చేయి చేసుకుని ఆమె ఒంటిమీద వున్న నాలుగు కాసుల బంగారు గొలుసు, చేతులకు ఉన్న ఆరు గాజులను లాక్కు ని పరారయ్యాడు. సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Pages