S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

05/24/2016 - 22:07

ఈ కాలంలో నేరేడుపండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. డయాబెటీస్‌తో పోరాడతాయి. సుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చేస్తాయి. తప్పనిసరిగా ఈ పండ్లను సీజన్‌లో తీసుకోవటం మంచిదని పెద్దలు సైతం చెబుతుంటారు.

05/20/2016 - 21:44

ఎండలో తిరిగొచ్చేసరికి ముఖం పై మురికి పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. ముఖంపై పట్టిన ఈ మురికిని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు. టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది.

05/19/2016 - 04:01

మెనోపాజ్ స్థితికి చేరుకున్న మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ కారణంగా, అటువంటి స్ర్తిలలో మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. శరీరంలో వెచ్చని ఆవిర్లు రావడం, చెమట పట్టడం, ఎముకల పటిష్టత తగ్గిపోయి ఆస్టియో పోరోసిస్ అనే ఎముకల వ్యాధికి గురవటం లాంటి ఇబ్బందులు శారీరకమయితే, అశాంతి, కోపం, చికాకు, డిప్రెషన్, మూడ్స్ మారిపోతూండటం లాంటి లక్షణాలు మానసికమయినవి.

05/17/2016 - 21:19

మహిళలు చిన్న చిట్కాలు పాటించి గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేస్తుంటారు. వారి తెలివితేటలకు అద్దం పట్టే రుూ చిట్కాలు మీరూ ఆచరించండి. వంట ఏం చేయాలో నిర్ణయించుకొని అందుకు అవసరమయ్యే వంట సామగ్రిని సిద్ధంగా వుంచుకొని ముందు చిన్న బర్నర్‌తో వంట చేయటం వలన పెద్ద బర్నర్ మీద వండే పదార్థాలకయ్యే గ్యాస్‌కన్నా పది శాతం తక్కువ ఖర్చుఅవుతుంది.

05/13/2016 - 22:17

ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండే వేపాకులు పలు అనారోగ్యాలను అరికట్టేందుకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యంలో విశిష్ఠస్థానం ఉన్న వేపాకులు చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. విటమిన్-సి పుష్కలంగా ఉన్నందున వేపాకులను ముద్దగా చేసుకుని శరీరానికి రాసుకుంటే చర్మంపై నల్లమచ్చలు, ముడతలు వంటివి సమసిపోతాయి. చర్మం మృదుతాన్ని సంతరించుకుని కాంతులీనుతుంది.

05/12/2016 - 22:16

ఆకుకూరల్లో అందరూ ఇష్టపడేది, ఆహార పదార్థాల్లో తరచూ చేర్చేది తోటకూర. దీనితో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను తయారుచేస్తారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. తోటకూరలో ఎన్నో రకాలున్నాయి. పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర, ముళ్ల తోటకూర వంటివి మార్కెట్‌లో లభిస్తాయ. చాలామంది పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూరను వంటకాల్లో వాడతారు.

05/11/2016 - 21:39

పూజల సందర్భంగా హారతి ఇచ్చేందుకే కాదు, కర్పూరాన్ని ఔషధపరంగానూ ఉపయోగిస్తుంటారు. దీనికి ఆయుర్వేద వైద్యంలో విశిష్ట స్థానం ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలకు కర్పూరం వాడితే
ఉపశమనం లభిస్తుంది.
నాలుకపై పేరుకున్న జిగురును పోగొట్టి, అరుచిని తొలగిస్తుంది.
పిప్పి పన్ను మీద కర్పూరాన్ని కాసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది.
జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది.

05/06/2016 - 21:43

మనం ఆహారంలో పీచు పదార్థం తగినంతగా లేకపోవడంవల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దపేగు కాన్సర్, మధుమేహం, సిహెచ్.డి., పురీషనాళం వద్ద రుగ్మతలు తదితర పేగు సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో సరిపడినంత పీచు పదార్థం వుండేలా చూసుకోవాలి. సోయా ఉత్పత్తులు మనకు కావలసినంత పీచు పదార్థం సమకూరుస్తాయి. జీర్ణ ప్రక్రియ త్వరగా సులువుగా పూర్తయ్యేందుకు సహకరిస్తాయి.

05/05/2016 - 22:18

తాజా క్యారెట్ ఎర్రగా నిగనిగలాడుతూ
వుంటుంది.
క్యారెట్‌లో విటమిన్ ‘ఏ’ పుష్కలంగా వుంది.
క్యారెట్‌ను రోజుకోసారి పచ్చిదైనా సరే కాస్త తింటే పంటికి మంచిది. ఒంటికి మంచిది.
క్యారెట్‌లో కరెటిన్ అనే పదార్థం వుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం క్యారెట్‌కు వుంది.
రోజూ క్యారెట్ తినడంవలన కంటికి ఎంతో ప్రయోజనం.

05/04/2016 - 22:26

జాపత్రి అన్నది సుగంధ ద్రవ్యాల జాతికి చెందినది. ఇది సుగంధ ద్రవ్యంగానే కాక, వైద్య పరంగా కూడా ఉపయోగిస్తుంది. తాంబూలంలో జాపత్రిని వేసుకుంటారు. జాపత్రి రుచికి కారంగా ఉన్నప్పటికీ పరిమళ భరితంగా ఉంటుంది.
జాపత్రి జీర్ణక్రియను పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది.
కఫాన్ని కరిగిస్తుంది.
నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

Pages