S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

01/13/2016 - 05:08

పేదవాడికి కూడా అందుబాటులో వుండే ఆరోగ్య ప్రదాయిని అరటిపండు. ఇందులోని మినరల్స్, విటమిన్లు, పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటలోనూ, శరీరం బరువును అదుపులో ఉంచటంలోను, రక్తంలో కొవ్వును తగ్గించటంలోనూ దోహదపడతాయి. మార్కెట్‌లో చౌకగా లభిస్తున్నాయని, పేరంటాల్లో, వివాహాల్లో ఉచితంగా లభిస్తున్నాయని అరటిపండ్లను చులకనగా చూడకూడదు.

01/12/2016 - 03:31

నానబెట్టిన పచ్చి శెనగల్ని రోజూ ఉదయం పూట క్రమం తప్పకుండా తింటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది. శెనగల్లోని పొటాషియం, ఐరన్, జింకు వంటి పోషక పదార్థాలు శారీరక బరువును తగ్గించేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు దోహదం చేస్తాయి. కొవ్వు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయం వేళ అల్పాహారంగా నానబెట్టిన లేదా ఉడికించిన శెనగలను తినడం ఉత్తమం. వీటిలోని పీచు, ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుముఖం పడుతుంది.

01/09/2016 - 22:44

దాహార్తిని తీర్చడానికి, శరీరానికి చలువ చేయడానికే కాదు.. కొబ్బరి నీళ్లలో గర్భిణులకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కేరళలోని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సిడిబి)కి చెందిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, గర్భిణులు విరివిగా కొబ్బరి నీళ్లను తాగితే వారికి అవసరమైన ఫ్లూయిడ్స్, ఎలొక్ట్రలైట్స్ అందుతాయని పేర్కొంటున్నారు.

01/08/2016 - 22:40

జీర్ణవ్యవస్థ మెరుగయ్యేందుకు భోజనానికి ముందు చాలామంది పలురకాల సూప్‌లు తీసుకుంటారు. చలికాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు, ఫ్లూ జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండేందుకు తులసి ఆకులు, టమాటాలతో చేసే సూప్ తాగడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

01/06/2016 - 22:37

రికార్డులు ఎన్నో..
అతి చిన్న పతంగి ఎగిరే ఎత్తు 5 మిల్లీ మీటర్లేనట. ఒకే దారానికి అత్యధిక గాలిపటాలు (11,284) అమర్చి ఎగరేసిన ఘనత జపానీయుడికి దక్కింది.

01/05/2016 - 21:08

ఏదైనా పండగ, శుభకార్యం సందర్భంగా నచ్చిన వంటలు వండుకుని ఇంటిల్లిపాదీ విందు ఆరగించి సంతోషంగా గడపడం అందరూ చేసేదే. ఇందుకు భిన్నంగా అన్నార్తుల కడుపు నింపాలని ఆమె భావించింది. ‘పొరుగువారి ఆకలి తీర్చాలి’ అన్న నినాదంతో ఆమె ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఇపుడు అనూహ్యంగా విస్తరించింది.

01/05/2016 - 04:05

సునంద చక్కటి రూపురేఖలతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ, తన మెడభాగం మాత్రం నల్లగా వుంటుందని ఆమె ఎప్పుడూ ఆందోళన చెందుతుంటుంది. ఇలాంటివారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం నెల రోజుల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చు. శెనగపిండి లేదా బార్లీ పిండిలో కాస్త పెరుగు కలిపి మెడ భాగం వద్ద బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. స్నానం చేయడానికి అరగంట ముందు నిమ్మకాయ ముక్కలతో మెడ చుట్టూ మృదువుగా రాసుకోవాలి.

01/03/2016 - 00:10

ఎంతో రుచికరంగా అనిపించే ఖర్జూరం చర్మ సంరక్షణకు దోహదపడుతుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. పలురకాల విటమిన్లు, ఖనిజాలు, పీచు, సుగర్ వీటిలో పుష్కలంగా లభిస్తాయి. వీటిలోని కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింకు వంటి ఖనిజాలు శక్తిమంతమైన పోషకాలుగా పనిచేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు, శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు విరివిగా ఖర్జూరం తీసుకోవాలి.

01/01/2016 - 22:09

చలిగాలుల తీవ్రత ఫలితంగా చర్మసంబంధ సమస్యలను ఎదుర్కొనేవారు పలురకాల మసాజ్ పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. చర్మ సంరక్షణకు, మంచి నిగారింపు కోసం మసాజ్ చేసుకోవడం మంచిదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను పాటించడం అవసరం. ఆయిల్ మసాజ్‌కు సాధారణంగా నువ్వుల నూనెను వాడతారు. ఆయల్ మసాజ్‌తో చర్మ సౌందర్యం బాగుంటుంది, శరీరానికి వెచ్చదనమూ కలుగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా నేడు కొందరు ఉపయోగిస్తున్నారు.

12/28/2015 - 21:36

పొట్ట్భాగంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయంతో బాధపడేవారు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే కచ్చితమైన మార్పును చూస్తారని వ్యాయామ నిపుణులు అంటున్నారు. రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదంటే- సరైన పద్ధతులు పాటించలేదని భావించాల్సి ఉంటుంది.

Pages