S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/24/2019 - 03:22

జెరూసలెం, మే 23: సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అఖండ విజయం సాధించడం పట్ల ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతాన్యహు హర్షం వ్యక్తం చేశారు. ‘మీరు సాధించిన ఈ అద్భుత విజయంతో మన స్నేహం మరింత బలపడుతుందనీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పడాలని’ని ఆకాంక్షిస్తున్నానని చెబుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసించారు.

05/24/2019 - 03:17

లాస్ ఏంజిల్స్, మే 23: మహిళల పనితీరుపై అక్కడ నెలకొని ఉన్న ఉష్ణోగ్రత ప్రభావం చూపిస్తుందని, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మహిళల పనితీరు మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జర్నల్ ప్లోస్ వన్‌లో ప్రచురితమయిన ఈ అధ్యయనం ప్రకారం ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మహిళల పనితీరు మెరుగుపడింది. పురుషుల విషయంలో ఇది విరుద్ధంగా ఉంది.

05/24/2019 - 03:15

వాషింగ్టన్, మే 23: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై ప్రతిపక్షాల నిరసన హోరు కొనసాగుతుండగా, ఈవీఎంలను తారు-మారు (ట్యాంపరింగ్) చేయడం, పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడడం అంత తేలికైన విషయమేమీ కాదని అమెరికా నిపుణుడు ఒకరు తెలిపారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలను తారు-మారు చేయడం జరిగిందని పలు ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు.

05/24/2019 - 03:13

ఖాట్మండు, మే 23: అంజలి ఎస్ కులకర్ణి అనే భారతీయ మహిళా పర్వతారోహకురాలు బుధవారం ఎవరెస్టు శిఖరంపై నుంచి కిందికి దిగుతూ మృతి చెందారు. దీంతో నేపాల్‌లో ఈ సీజన్‌లో పర్వతారోహణ సాహస యాత్రకు వెళ్లి మృతి చెందిన వారి సంఖ్య 13కు పెరిగిందని గురువారం వెలువడిన ఒక మీడియా కథనం వివరించింది. ముంబయికి చెందిన 54 ఏళ్ల అంజలి క్యాంప్-4కు పైన మృతి చెందారు.

05/23/2019 - 04:17

బిష్కెక్, మే 22: గత ఏడాది ఊహాన్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాల అమలుపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూతో చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాల బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై ఆమె వాంగ్‌తో మాట్లాడారు. బుధవారం సుష్మా చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు.

05/22/2019 - 23:08

చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బబీస్, కొత్త న్యాయ శాఖ మంత్రి బెనెసోవకు వ్యతిరేకంగా ప్రేగ్‌లో భారీ ప్రదర్శనకు దిగిన ప్రజలు. వీరిద్దరూ ప్రభుత్వ నిధులను మళ్లించారని, భారీ కుంభ కోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

05/23/2019 - 05:03

వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన ఒక శాస్తజ్ఞ్రుడు ఆలోచనలతో రోబోలను నియంత్రించే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఒక సంస్థ కోసం ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 20 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకున్నారు. తన బృందంతో కలిసి ఆయన ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు.

05/22/2019 - 22:48

గర్భస్రావాలపై ట్రంప్ సర్కార్ విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ వాషింగ్టన్‌లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో మాట్లాడుతున్న డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండెట్ అమి క్లోబచర్ డి మిన్

05/22/2019 - 22:30

బిష్కెక్, మే 22: భారత పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ వచ్చే నెలాఖరుకల్లా రష్యన్ ఇంటర్‌ఫేస్‌లో చోటుచేసుకుంటుంది. అలాగే రష్యన్ భాషలో ‘24 ఇంటు 7’ హెల్ప్‌లైన్ సైతం ఏర్పాటవుతుంది. షాంఘయ్ సహకార సంస్థ (ఎస్‌సీఓ) పరిధిలోని దేశాల నుంచి రష్యా పర్యటనకు వెళ్లేవారికి ఈ సదుపాయం తోడ్పాటునందిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం నాడిక్కడ తెలిపారు.

05/22/2019 - 22:20

బీజింగ్, మే 22: చైనా, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. గత 68 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య సమాచార, సహకార రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాయి. ద్వైపాక్షిక సంబంధాల అంశంలో ఇరు దేశాలు సంతృప్తికరంగా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి లుకాంగ్ చెప్పారు. బీజింగ్‌లో ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 68 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన సంబరాల్లో లుకాంగ్ మాట్లాడారు.

Pages