S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/11/2018 - 01:34

ఇస్లామాబాద్, ఆగస్టు 10: ఎన్నికల్లో ఓటు వేసేందుకు పాటించాల్సిన గోప్యత నిబంధనను ఉల్లంఘించి, బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్ ఎలక్షన్ కమిషన్‌కు బేషరతుగా రాతపూర్వక క్షమాపణ చెప్పారు. వచ్చే వారంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌కు ఈ వివాదం అవరోధంగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించారు.

08/11/2018 - 00:59

తంపా (అమెరికా), ఆగస్టు 10: నాసా అంతరిక్ష ప్రయోగశాల నుంచి 1.5 బిలియన్ డాలర్లతో రూపొందించిన అంతరిక్ష నౌకను సూర్యగ్రహం వాతావరణ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ అంతరిక్ష నౌకను ఆదివారం ప్రయోగించనున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కెనెరవాల్‌నుంచి డెల్టా హెవీ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. స్థానిక కాలమాన ప్రకారం 3.33 గంటలకు ప్రయోగిస్తామని నాసా పేర్కొంది.

08/10/2018 - 01:41

న్యూయార్క్, ఆగస్టు 9: భారతీయ కళలు, సంస్కృతి, సారస్వతాలు, సాహితీ సంపద ఔన్నత్యాన్ని తెలుపుతూ అమెరికాలో ఓ కార్యక్రమం చేపడుతున్నారు. యుఎస్‌లోని ఓ ప్రముఖ సాంస్కృతిక సంస్థ దీనికి నడుం బిగించింది. భారతీయ సంస్కృతీ సౌరభాలు, వాణిజ్యం, విధానాలు వివిధ కోణాల్లో ఆవిష్కృతం కానున్నాయి. ‘సీజన్ ఆఫ్ ఇండియా’పేరుతో ప్రదర్శనలు, సాహితీ పండుగలు ఏర్పాటు చేస్తున్నారు.

08/10/2018 - 01:39

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 9: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ హై కమిషనర్‌గా చీలీ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు మైఖే ల్ బాచీలెట్ నియమితులుకానున్నారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గెటిర్రెస్ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జోర్డాన్‌కు చెందిన రాయబారి జైడ్ రాడ్ ఆల్ హుస్సేన్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు.

08/10/2018 - 01:37

ఖాట్మాండు, ఆగస్టు 9: వాతావరణ పరిస్థితులు మెరుగవ్వడంతో నేపాల్ నుంచి పలువురు భారత్ యాత్రికులు కైలాష్-మానససరోవర్ యాత్ర నిమిత్తం సిమిల్‌కోట్‌కు పది విమానాల్లో బయలుదేరారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండటంతో సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌ల మధ్య నిన్నటి నుంచి విమానాలు యథావిధిగా తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

08/10/2018 - 01:36

ఇస్లామాబాద్, ఆగస్టు 9: పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ను సోమవారం కోర్టులో హాజరుపర్చాల్సిందేనని పాకిస్తాన్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్షపడి రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌పై మరో రెండు కేసుల విచారణకు సంబంధించి అతను సోమవారం కోర్టుకు హాజరు కావాలని జడ్జి మాలిక్ ఆదేశించారు.

08/10/2018 - 01:35

ఇస్లామాబాద్, ఆగస్టు 9: కాబోయే ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల నియమావళిని ఉలంఘించినందుకు రాతపూర్వకంగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని పాకిస్తాన్ ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు తాఖీదులు జారీ చేసింది. గత నెల 25వ తేదీన పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.

08/09/2018 - 02:18

ఇస్లామాబాద్, ఆగస్టు 8: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో జాతీయ అసెంబ్లీని సమావేశపరిచే అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం అధ్యక్షుడికి నివేదిక సమర్పించింది. ఈ విషయాన్ని న్యాయ, సమాచార శాఖ మంత్రి అలీ జాఫర్ ధ్రువీకరిస్తూ జాతీయ అసెంబ్లీని ఈ నెల 12 నుంచి 14వ తేదీ మధ్య సమావేశపరచి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

08/09/2018 - 02:13

ముజఫర్‌పూర్/పాట్నా, ఆగస్టు 8: ముజఫర్‌పూర్ షెల్టర్‌హోమ్ సెక్స్‌కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మంత్రి మంజు వర్మ ఎట్టకేలకు పదవి రాజీనామా చేశారు. మంత్రి భర్త చందేశ్వర్ వర్మ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చిన మంత్రి మంజు వర్మ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనకు తలొగ్గారు.

08/09/2018 - 02:10

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఒకే సమస్యపై వివిధ న్యాయస్థానాల్లో సమాంతర విచారణ చేపట్టడం సముచితం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పేర్కొంది. దక్షిణ ఢిల్లీలోని కాలనీల్లో చెట్ల కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషన్‌ను ఎన్‌జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జావద్ రహీమ్, ఎస్పీ వాంగిడిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

Pages