S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/27/2018 - 01:55

వీడ్కోలు 2018

12/27/2018 - 01:45

వాషింగ్టన్, డిసెంబర్ 26: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణలోని నల్లగొండకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. టెనె్నస్సే రాష్ట్రంలోని మెంఫిస్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతులు నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందినవారు. క్రిస్మస్ సందర్భంగా ఇంటికి అలంకరణ చేస్తుండగా సాత్విక్ నాయక్ (16), సుహాస్ నాయక్ (14), జయసుచిత్ (13) ప్రమాదానికి గురయ్యారు.

12/26/2018 - 01:58

వాషింగ్టన్, డిసెంబర్ 25: ప్రపంచంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ పండగను వేడుకగా జరుపుకుంటుంటే, శే్వతసౌదాధిపతి, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మాత్రం వైట్‌హౌస్‌లో ఏకాకిగా గడిపారు. అత్యంత సంపన్న దేశం అమెరికా అధినేత ట్రంప్ ఇలా ఒంటరిగా తన కార్యాలయానికి పరిమితమై ఉండడానికి కారణముంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎక్కడికి వెళ్లకుండా అన్ని కార్యక్రమాలను ట్రంప్ రద్దు చేసుకున్నారు.

12/26/2018 - 01:56

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక్కడి సెయింట్ పీటర్స్‌బాసిలికా చర్చిలో సోమవారం రాత్రి జరిగిన వేడుకలకు వేలాది మంది హాజరు కాగా, పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.3 బిలియన్‌ల కాథలిక్‌లకు ఉద్దేశించి తన సందేశాన్ని అందజేశారు.

12/26/2018 - 01:53

కాబూల్, డిసెంబర్ 25: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ప్రభుత్వ ప్రహరీ గోడను దూసుకుని లోపలికెళ్లి నరమేధం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 43 మంది మరణించారు. ఇది అత్యంత కిరాతకమైన మారణహోమం సృష్టించిన దాడి అని అఫ్గనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనతో ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా అప్రమత్తం ప్రకటించారు.

12/26/2018 - 01:51

జకార్తా (ఇండోనేషియా), డిసెంబర్ 25: అగ్నిపర్వతం పేలి సంభవించిన సునామీ రాకాసి అలలతో ఇండోనేషియా కోస్తా తీరం కార్తియా పట్టణం కకావికలమైంది. సునామీ బాధితులకు కనీస అవసరాలు అందకపోవడంతో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. తాగేందుకు పరిశుద్ధమైన నీటి లభ్యత లేదు. రోగాలబారినపడిన వారికి మందులు లేవు. వేలాది మందికి ఆశ్రమం కల్పించినా, అక్కడ కనీస సదుపాయాలు కొరవడ్డాయి.

12/25/2018 - 02:25

పెను సునామీకి ధ్వంసమైన ఇండోనేషియాలోని ఓ గ్రామ దృశ్యం ఇది.
సునామీ తీవ్రతకు గ్రామానికి గ్రామమే కొట్టుకుపోయింది. సోమవారం శిథిలాల మధ్య జనం

12/25/2018 - 02:23

కెరిటా (ఇండోనేషియా), డిసెంబర్ 24: ఆకస్మాత్తుగా రాత్రికి రాత్రి విరుచుకుపడి విలయాన్ని సృష్టించిన సునామీ వల్ల ఇండోనేషియాలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సునామీ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 222 ఉండగా, సోమవారానికి అది 281కు పెరిగింది. ఇది ఇంకా పెరగవచ్చునని ఆ దేశ అధికారులు ప్రకటించారు. కాగా సునామీ వల్ల వెయ్యి మందికి పైగా గాయపడగా, వేలాది ఇళ్లు, వాణిజ్యా సంస్థలు నేలకూలాయి.

12/25/2018 - 03:35

ఇస్లామాబాద్: పనామా పేపర్స్ కుంభకోణంలోని మరో కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష, 2.5 మిలియన్ యూఎస్ డాలర్ల జరిమానా విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు (జవాబుదారీ న్యాయస్థానం) సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే కోర్టు మరో కేసులో ఆయనను నిర్దోషిగా పేర్కొంది. పనామా కుంభకోణంకు సంబంధించి షరీఫ్‌పై మూడు కేసులు నమోదు కాగా, ఒక దానిలో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడింది.

12/25/2018 - 02:19

కెరిటా (ఇండోనేషియా), డిసెంబర్ 24: హఠాత్తుగా శనివారం రాత్రి పెద్ద శబ్దం చేస్తూ విరుచుకుపడిన సునామీ ధాటికి సర్వం కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ రోజు రాత్రి హుష్ మంటూ పెద్ద శబ్దం వచ్చింది.. మొదట నేను అది హోరు గాలి అనుకున్నా.. తీరా చూస్తే కొద్దికొద్దిగా నీరు మా గ్రామంలోకి చేరుకుంది. చూస్తుండగానే పెద్దమొత్తంలో వచ్చి మా గ్రామాన్ని ముంచెత్తింది..

Pages