S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/14/2019 - 23:33

కొలంబో, మే 14: శ్రీ లంకలో చెలరేగిన ముస్లిం వ్యతిరేక ఘర్షణలు చిలికిచిలికి గాలి వానగా చందంగా మారాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా అల్లర్లు ఆగలేదు, ఉద్రిక్తత, హింస కొనసాగుతున్నది. హింసాయుత ఘటనలతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం వేర్వేరు ఘటనల్లో 24 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెజారిటీ వర్గమైన సింహాళీయుల అల్లరి మూకలు ముస్లింలకు చెందిన దుకాణాలకు, వాహనాలకు నిప్పంటించారు.

05/14/2019 - 23:20

వాషింగ్టన్, మే 14: రంజాన్ చాలా ప్రత్యేకమయిన నెల అని, ఈ నెలలో ప్రజలు సహనాన్ని, శాంతిని కోరుకుంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రంజాన్ నెలను పురస్కరించుకొని తాను అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చానని ఆయన తెలిపారు. న్యూజిలాండ్, శ్రీలంకలో భయంకరమయిన ఉగ్రవాద దాడులు జరగడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

05/14/2019 - 02:20

కొలంబో, మే 13: శ్రీ లంక అంతఃకలహాలతో అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ముస్లింలకు చెందిన దుకాణాలపై, మసీదులపై దాడులు జరుగుతుండడంతో ప్రభుత్వం సోమవారం కర్ప్యూ విధించింది. హింసాకాండ కొత్త ప్రాంతాలకు వ్యాపించిన నేపథ్యంలో సామాజిక మీడియాను కట్టడి చేసింది.

05/13/2019 - 03:00

హనోయి, మే 12: భారత్, వియత్నాంలు రక్షణ, భద్రత, శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన వినియోగం, అంతరిక్షం, చమురు- సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకారానికి వచ్చాయి. భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నా యుడు తన నాలుగు రోజుల వియత్నాం పర్యటనను ఆదివారం ముగించుకున్నారు.

05/13/2019 - 02:56

షాంఘై, మే 12: సంగీతానికి ఎల్లలు లేవు. దేశాల మధ్య శత్రుత్వాన్ని, ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు సంగీతం కూడా ఓ సాధనమే. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఉభయ కొరియాలకు చెందిన ఇద్దరు కళాకారులు చైనా వేదికగా ఆరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చగడ్డి లేకుండానే భగ్గుమనే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు.

05/13/2019 - 02:54

లండన్, మే 12: బ్రిటన్ సంపన్నుల జాబితాలో భారతీయ సంతతికి చెందిన సోదరులు ఆధిక్యత ప్రదర్శించారు. 22 బిలియన్ పౌండ్లతో హిందుజా సోదరులు నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించగా.. ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు 18.66 బిలియన్ పౌండ్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకొన్నారు.

05/13/2019 - 02:54

ఇస్లామాబాద్, మే 12: పాకిస్తాన్‌లోని గ్వాడార్ నగరంలో గల ఒక విలాసవంతమయిన హోటల్‌పై జరిగిన దాడిని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఖండించారు. దేశ అభివృద్ధి ప్రాజెక్టులను, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ విద్రోహ చర్యకు ఒడిగట్టారని ఆయన పేర్కొన్నారు.

05/13/2019 - 02:53

ఐక్యరాజ్య సమితి, మే 12: ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిర్ణయాత్మకమయిన, ముఖ్యమయిన సమస్య వాతావరణ మార్పు అని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై చరిత్రాత్మక పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చిన మూడేళ్ల తరువాత తిరిగి వాతావరణ మార్పు అంశం ఐరాసలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే దిశగా సాగుతోంది.

05/12/2019 - 02:24

కరాచి, మే 16: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్వాదర్‌లోని పెరల్ కాంటినెంటల్ ఫైవ్ స్టార్ హోటల్‌లోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. దీంతో ఉగ్రవాద నిరోధక పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు హోటల్‌ను చుట్టుముట్టినట్లు గ్వాదర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అస్లం బంగూల్జాయి తెలిపారు.

05/12/2019 - 02:58

జెనీవా: ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక న్యాయసమ్మతమయిన చరిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా మినహా ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) పర్యావరణ విభాగం అధికారులు ఈ విషయం వెల్లడించారు.

Pages