S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/18/2018 - 02:06

వాలెట్టా, సెప్టెంబర్ 17: భారత్-మాల్టాలు కీలకమైన మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నౌకా వాణిజ్యానికి సంబంధించి, ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. దీనికి సంబధించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాల్టా అధ్యక్షురాలు మారియా లూసే కొలెయిరో పెర్కా మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాలు మూడు ఎంఓయూలపై సంతకాలు చేశాయి. మారిటైమ్ కో-ఆపరేషన్, టూరిజం, డిప్లోమాటిక్ స్టడీస్‌పై ఈ ఒప్పందాలు జరిగాయి.

09/18/2018 - 02:02

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు లగ్జరీ కార్లను వేలానికి పెట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెకించడానికి ఇమ్రాన్ ప్రభుత్వం పలు పొదుపుచర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద ఉన్న లగ్జరీ కార్లను సోమవారం వేలం వేశారు. 34 కార్లను విక్రయించారు. మొత్తం 102 కార్లను వేలానికి పెట్టారు.

09/18/2018 - 01:59

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడు ఆరిఫ్ అలీ సోమవారం నిర్వహించిన పార్లమెంటు సంయుక్త సమావేశంలో కాశ్మీర్ అంశంపై ప్రస్తావించారు. అంతర్జాతీయపరంగా సహాయం పొందేందుకు స్వీయ నిర్ణయం తీసుకునేందుకు కాశ్మీరీలకు హక్కు ఉందని ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి సమావేశంలో వ్యాఖ్యానించారు.

09/17/2018 - 05:09

బెల్‌గ్రేడ్, సెప్టెంబర్ 16: ఎన్నోఏళ్ల క్రితం మన భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ చారిత్రక ప్రసంగం చేశారని అది మనకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని భారత్ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. సెర్బియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి నెహ్రూ చేసిన ప్రసంగంలో స్వతంత్రత, చర్చ, న్యాయపాలన వంటి అంశాలు అంతర్గతీకరించడం ద్వారా రాజ్యపాలన పద్ధతులు మరింత పటిష్టం కావాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించారన్నారు.

09/16/2018 - 04:38

* వాణిజ్య, రక్షణ రంగాల్లో *ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం

09/16/2018 - 01:30

ఐక్యరాజ్య సమితి (న్యూయార్క్), సెప్టెంబర్ 15: ప్రాణాంతకమైన క్షయ (టీబీ) వ్యాధిని ప్రపంచ దేశాల నుంచి శాశ్వతంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తీర్మానించింది. ఈనెల 26న జరిగే అంతర్జాతీయ టీబీ శిఖరాగ్ర సమావేశానికి ముందే ఒక అవగాహనకు రావలన్న ఉద్దేశంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది.

09/16/2018 - 01:26

శాన్‌ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 15: పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని, ఇందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని పర్యావరణంపై ఇక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. ‘మనం మారితీరాలి’ అని సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు స్పష్టం చేశారు.

09/16/2018 - 06:14

విల్మింగ్టన్: అమెరికా తూర్పు ప్రాంతంలో కరోలినా తదితర చోట్ల భారీ వర్షాలు, తుపానులు,వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఫ్లోరెన్స్‌లో తుపాను తాకిడికి ఒక తల్లీ కూతురు మరణించారు. పెనుతుపాను తాకిడికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం వస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

09/15/2018 - 05:17

ఇండోర్, సెప్టెంబర్ 14: భారత సంస్కృతిలో వసుధైక కుటుంబం భాగమని, బోహ్రా ముస్లింలు ఈ భావనను అందిపుచ్చుకుని అమలు చేస్తున్నారని ప్రధాన నరేంద్రమోదీ ప్రశంసించారు. వసుధైక కుటుంబం అనే భావన ప్రాచీన భారతీతత్వానికి నిదర్శనమన్నారు. శాంతి, సహజీవనం అనే ఉదాత్తమైన సందేశాలను ప్రపంచానికి బోహ్రా ముస్లింలు చాటుతున్నారని ఆయన అన్నారు.

09/15/2018 - 01:09

మాస్కో, సెప్టెంబర్ 14: వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను భారత్, రష్యా సమీక్షించాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం రష్యా ఉప ప్రధాని యురీ బొరిసొవ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులతోపాటు శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతికాది రం గాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగవృద్ధిపై చర్చించారు.

Pages