S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/29/2018 - 02:05

ఇస్లామాబాద్, జూలై 28: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి కొద్దిరోజుల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించింది. దేశంలోని మొత్తం 270 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ నెల 25న సాధారణ ఎన్నికలు నిర్వహించారు.

07/29/2018 - 02:00

ఖాట్మండ్, జూలై 28: నేపాల్-ఇండియా దేశాల తొలి మేధో సదస్సు ఈనెల 31న ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోడంపై నిర్వహించే సదస్సును నేపాల్ మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మాజీ చైర్మన్ ప్రచండ ప్రారంభించనున్నారు.

07/29/2018 - 01:56

లాస్‌ఏంజిల్స్, జూలై 28: అస్సామీ చిత్రం ‘జొహిహోబొటే ధెమాలైట్’ (రెయిన్‌బో ఫీల్డ్స్) మూడు టాప్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న 3వ లవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఉత్తమ మూవీగా సైతం ఎంపికైంది. ఉత్తమ నటిగా దీపన్నితా శర్మ, ఉత్తమ సంగీతంలో అనురాగ్ సైకియా ఎంపికయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచంలోని దాదాపు 36 దేశాల నుంచి 150 చిత్రాలకు పైగా ఎంట్రీలో పాల్గొన్నాయి.

07/29/2018 - 01:44

వాషింగ్టన్, జూలై 28: యోగా, ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రపంచ దేశాల్లో విశేష ప్రచారం పొందిన రాందేవ్ బాబా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని, వీరిద్దరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను పోల్చుతూ న్యూయార్కు టైమ్స్‌లో ఆసక్తికర వ్యాసం ప్రచురితమైంది. రాందేవ్ బాబా ఒకరోజు భారత్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ఈ పత్రిక పేర్కొంది.

07/29/2018 - 02:31

శుక్రవారం రాత్రి ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన సంపూర్ణ చంద్ర గ్రహణం స్పానిష్ ఐలాండ్‌లోని లా ప్యుంట్ పట్టణలో ఈ విధింగా కనిపించింది.

07/28/2018 - 02:17

జోహెన్స్‌బర్గ్, జూలై 27: డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను స్వీకరించి అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రధానామంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. డిజిటల్ టెక్నాలజీ కోసం ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, అనలిటిక్స్ విభాగాల పటిష్టతకు దృష్టిని సారించాలన్నారు. వీటి వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

07/28/2018 - 02:06

కరాచీ, జూలై 27: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకాలు అంతంత మాత్రమే. దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్లు ఓటమి పాలయ్యారు.

07/28/2018 - 02:04

టోక్యో, జూలై 27: జపాన్‌లోని పశ్చిమ ప్రాంతానికి తీవ్రమైన తుపాను తాకే ప్రమాదముందని ఆ దేశ అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. 200 కిలోమీటర్ల గాలుల వేగంతో ఈ తుపాను రేపటి రాత్రికి జపాన్ ప్రధాన ద్వీపాన్ని తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా జపాన్‌లో తుపానులు ఈశాన్య దిశగా పయనిస్తాయని, ఇప్పుడు వచ్చే తుపాను వాయువ్యదిశగా వస్తోందని అధికారులు చెప్పారు.

07/28/2018 - 01:52

జోహెనె్నస్‌బర్గ్‌లో శుక్రవారం జరిగిన బ్రిక్స్ సమావేశం అనంతరం వివిధ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ

07/28/2018 - 01:27

జోహానె్నస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశానికి హాజరైన రష్యా అధ్యక్ష డు పుతిన్‌తో
సమావేశమైన భారత ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించారు.

Pages