S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/30/2018 - 04:25

టోక్యో, అక్టోబర్ 29: భారత్‌లో అందుబాటులో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని జపాన్ వ్యాపార, వాణిజ్య వేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ అన్ని విధాలుగా సానుకూల అవకాశాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

10/30/2018 - 05:43

ఢాకా: మరో అవినీతి కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు ఏడుసంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒక చారిటబుల్ ట్రస్టు నుంచి తన భర్త పేరున మిలియన్ డాలర్లు వసూలు చేశారన్న ఆరోపణ రుజువు కావడంతో ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఇప్పటికే అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు అవినీతి కేసులో శిక్ష పడటం ఈ ఏడేళ్లలో ఇది రెండోసారి.

10/30/2018 - 04:17

కొలంబో, అక్టోబర్ 29: ఓ పక్క దేశ ప్రధానిగా తన నియామక వ్యవహారం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏ క్షణంలోనైనా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. లంక పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

10/30/2018 - 04:17

కొలంబో, అక్టోబర్ 29: శ్రీలంక పార్లమెంట్‌లో ఇప్పటికీ తనకు మెజారిటీ ఉందని, ఇటీవల అధ్యక్షుడి చేతిలో తొలగింపునకు గురైన ప్రధాని రానిల్ విక్రమ్ సింఘే అన్నారు. ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ (యూపీఎఫ్‌ఏ) విక్రమ్‌సింఘే నేతృత్వంలోని యూఎన్‌పి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంలో మైనారిటీలో పడింది.

10/30/2018 - 04:12

టోక్యో, అక్టోబర్ 29: ముంబయి పటాన్‌కోట్ ఉగ్రదాడులకు పాల్పడ్డ వారిని తగిన విధంగా దండించాలని భారత్, జపాన్‌లు పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేశాయి. శిఖరాగ్ర భేటీలో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు ఉగ్రవాద కార్యకలాపాలను గర్హించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని ప్రతిఘటించాల్సిందేనని పిలుపునిచ్చారు.

10/30/2018 - 00:51

జకార్తా, అక్టోబర్ 29: ఇండోనేసియాలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 189 మంది దుర్మరణం చెందారు. జకార్తా నుంచి బెలిటంగ్ టూరిస్టు కేంద్రానికి బయలు దేరిన బోయింగ్-737 మాక్స్ విమానం 13 నిముషాల్లోనే రాడార్ పరిధి నుంచి అదృశ్యమై జావా సముద్రంలో కుప్పకూలిపోవడంతో ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భారత పైలటే దీన్ని నడుపుతున్నట్టుగా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

10/29/2018 - 03:35

యమనాషి (జపాన్), అక్టోబర్ 28: భారత్, జపాన్ మధ్య స్నేహ సంబంధాలు చారిత్రాత్మకమైనవని, ఇరుదేశాలు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పర సహకారంతో ముందడుగు వేస్తాయని జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇక్కడకు చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వౌండ్ ఫూజీలోని అందమైన రిసార్ట్‌లో మోదీ బస చేశారు.

10/29/2018 - 03:33

వాషింగ్టన్, అక్టోబర్ 28: ఒక శే్వతజాతీయుడు జరిపిన కాల్పుల్లో 11 మంది భక్తులు మృతి చెందిన సంఘటన అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శనివారం చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో యూదులపై జరిగిన దాడిలో అతి విషాదకరమైనదిగా దీనిని భావిస్తున్నారు.

10/29/2018 - 03:28

కొలంబో, అక్టోబర్ 28: శ్రీలంక రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రధాని పదవి నుంచి విక్రమ్‌సింఘేను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న దేశ అధ్యక్షుడు సిరిసేన నిర్ణయానికి విరుద్ధంగా పార్లమెంట్ స్పీకర్ విక్రమ్‌సింఘేనే ప్రధానిమంత్రిగా ప్రకటించడం సర్వత్రా అక్కడి పరిణామాల పట్ల ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంతకూ విక్రమ్‌సింఘే పదవిలో ఉన్నాడా, లేడా అన్నది సందిగ్ధంగానే కన్పిస్తోంది.

10/28/2018 - 05:08

కొలంబో:శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘేను తొలగించిన దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం నవంబర్ 16వరకూ పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Pages