S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/30/2019 - 22:40

రియాద్, అక్టోబర్ 30: ‘అభివృద్ధి పథాన కలిసి పయనిద్ధాం..’ అని భారత్-సౌదీ అరేబియా దేశా లు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. చమురు, సహాజ వాయువు, రక్షణ, విమాన రంగం వంటి డజనుకు పైగా కీలక అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన సత్పలితాలను ఇస్తున్నది.

10/30/2019 - 22:32

ఇస్లామాబాద్, అక్టోబర్ 30: గురునానక్ 550 జయంతి సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఓ స్మారక నాణెం విడుదల చేసింది. సిక్కుమత స్థాపకుడు గురునానక్ జయంతి నవంబర్ 12న జరుగుతోంది. బుధవారం స్మారక నాణెం విడుదల చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఫేస్‌బుక్‌లో నాణెం గుర్తును పెట్టారు. ‘గురనానక్ దేవ్‌జీ 550 జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణెం మేం విడుదల చేశాం’అని ప్రధాని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

10/30/2019 - 04:36

రియద్, అక్టోబర్ 29: భారత్, సౌదీ అరేబియాలు తమ చుట్టుపక్కల నుంచి భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని, అయితే కౌంటర్ టెర్రరిజం సహా భద్రతా అంశాలలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం బాగా వృద్ధి చెందుతోందని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

10/29/2019 - 23:25

రియాద్, అక్టోబర్ 29: వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై భారత్- సౌదీ అరేబియా మధ్య మంగళవారం ఇక్కడ విస్తృత చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాకు చెందిన అనేకమంది సీనియర్ మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని పరస్పర సహకారాన్ని ఏవిధంగా పెంపొందించుకోవాలన్న దానిపై మంతనాలు సాగించారు. ఇంధనం, వ్యవసాయం, జల టెక్నాలజీపై ఈ ద్వైపాక్షిక చర్చలు సాగాయి.

10/29/2019 - 22:55

జెనీవా, అక్టోబర్ 29: జమ్మూకాశ్మీర్‌లో తాజా పరిస్థితి పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్‌లోయ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మానవ హక్కులే అందకుండా పోతున్నాయని, వాటిని తక్షణమే పునరుద్ధరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

10/29/2019 - 04:16

లాహోర్, అక్టోబర్ 28: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ప్రభుత్వపరంగా సాధ్యమైనంత వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే, ఎవరి జీవితంపై వారికే ఎలాంటి హామీ లేని పరిస్థితిలో ఇంకొకరి జీవితం గురించి ఎలా గ్యారంటీ ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. శరీరంలో రక్తకణాల సంఖ్య 20వేలకు పడిపోవడంతో 69 సంవత్సరాల షరీఫ్ పరిస్థితి విషమించింది.

10/29/2019 - 01:44

వాషింగ్టన్: ఐసిస్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా దళాలు అంతం చేయడానికి దారితీసిన పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తన చర్యల ద్వారా అమెరికా సహా అనేక దేశాలను వణికించిన బాగ్దాదీ ఎక్కడ ఉన్నాడన్నది కొన్ని నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని విషయమే. కానీ, ఆ ఇంటి గుట్టును ఆయన భార్యల్లో ఒకరు అమెరికా గూఢచారికి సంస్థకు అందించినట్టుగా తెలుస్తోంది.

10/28/2019 - 22:57

*చిత్రం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో జ్యోతి వెలిగించి మరీ దీపావళి సంబరాన్ని సిబ్బందితో కలిసి జరుపుకుంటున్న దృశ్యం

10/26/2019 - 23:40

బాకు (అజెహర్‌బైజాన్), అక్టోబర్ 26: భారత్-అజెహర్‌బైజన్ దేశాలు సంస్కృతి సంప్రదాయాలు పరస్పరం మార్పు చేసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. అజెహర్‌బైజన్‌లోని అత్యంత ప్రాచీన అగ్ని ఆలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. అటెష్‌గహ ఆలయంలో సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెంకయ్య నాయు డు అన్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

10/26/2019 - 23:32

వాషింగ్టన్, అక్టోబర్ 26: కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి భారత్ ప్రభుత్వం చెబుతున్న దానికీ, తమకు అందుతున్న సమాచారానికీ ఏ రకమైన పొంతనా లేదని అమెరికా కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర స్థితిగతుల గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు విదేశీ పాత్రికేయులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు ఓ లేఖ రాశారు.

Pages