S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/12/2019 - 22:48

ఇస్లామాబాద్, జూలై 12: కొన్ని అదృశ్య శక్తుల వత్తిడి కారణంగానే తాను పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ అవినీతి కేసులో ఏడేళ్ళ జైలు శిక్ష విధించానంటూ ఓ వీడియోలో వ్యాఖ్యానించినట్లుగా బయటపడిన అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తిని పాకిస్థాన్ న్యాయ శాఖ తొలగించింది.

07/12/2019 - 22:46

ఐక్యరాజ్యసమితి, జూలై 12: భారత్‌లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయా? అంటే ఐక్యరాజ్యసమితి ఔననే చెబుతోంది. విభిన్న కోణాల్లో నిర్వహించిన పేదరిక సర్వే సూచీ మేరకు భారత్‌లో దాదాపు 271 మిలియన్ల మంది జనాభా పేదరికం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.

07/12/2019 - 22:46

మెల్బోర్న్, జూలై 12: చక్కెర ఉత్పత్తి, వాణిజ్యం విషయంలో భారత్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరింది.

07/12/2019 - 22:45

ఇస్లామాబాద్, జూలై 12: బాలాకోట్‌కు సమీప సరిహద్దుల్లో గగనతలంలో తిరుగుతున్న భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు అక్కడి నుంచి వైదొలగేంత వరకు తమ వాణిజ్య విమానాలకు సంబంధించిన మార్గాన్ని తెరిచేది లేదని శుక్రవారం నాడిక్కడ పాకిస్తాన్ విమాన యాన సంస్థ కార్యదర్శి షారుక్ నుస్రత్ ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి నుస్రత్ సమాచారమిచ్చారు.

07/12/2019 - 03:56

లాహోర్/ఇస్లామాబాద్ : ఆగివున్న ఓ సరుకుల రవాణా రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో 16 ప్రయాణికులు మృత్యువాత పడగా, 80 మంది క్షతగాత్రులయ్యారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

07/12/2019 - 03:41

వాషింగ్టన్, జూలై 11: అమెరికాలో శాశ్వ త నివాసం ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు వలసవాదులకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఒక దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికిమించి గ్రీన్ కార్డులు మంజూరు చేయకూడదన్న నిబంధనలు సడలిస్తూ బిల్లు రూపొందించారు.

07/11/2019 - 23:26

లండన్, జూలై 11: అంతర్జాతీయ పుస్తక ధరల నిర్ణాయక కమిటీలో 2020 సంవత్సరానికి భారత్‌కు చెందిన అవార్డు గ్రహీత, రచయిత జీత్ తాయిల్‌కు చోటు దక్కింది. ఐదుగురు సభ్యుల జడ్జింగ్ ప్యానల్‌లో ఒకరుగా ఆయన వ్యవహరిస్తారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘లిట్రసీ అవార్డ్ ఫర్ ట్రాన్స్‌లేటెడ్ ఫిక్షన్’ గురువారం నాడిక్కడ ప్రకటించింది. ‘నార్కోపోలిస్’ పుస్తక రచయిత తాయిల్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.

07/10/2019 - 22:42

ఏథెన్స్‌లో జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశానికి తన మంత్రివర్గ సహచరులతో కలిసి హాజరైన గ్రీస్ కొత్త ప్రధాని కిరియాకోస్ విట్సోటాకిస్. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు

07/10/2019 - 22:36

సియోల్, జూలై 10: దక్షిణ కొరియా సాంకేతిక రంగంలో కీలకమైన రసాయనాల ఎగుమతులపై నిషేధం విధించాలన్న జపాన్ నిర్ణయాన్ని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జేయిన్ తీవ్రంగా తప్పుపట్టారు. జపాన్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య రంగంలో సంక్షోభాలకు దారి తీస్తుందనీ, ఇటువంటి నిర్ణయాల వల్ల వివాదాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

07/10/2019 - 22:32

సింగపూర్, జూలై 10: బ్రిటన్‌కు చెందిన జేమ్స్ డైసన్ అనే బిలియనీర్ ఒక పెంట్‌హౌస్ కొనుగోలు చేసేందుకు ఏకంగా 54 మిలియన్ డాలర్లు వెచ్చించాడు. సింగపూర్‌లోనే అతి పెద్ద, ఖరీదైనదిగా గుర్తింపు పొందిన పెంట్‌హౌస్ మూడు ఫ్లోర్లు కలిగిన ఇంటి పైభాగాన రూఫ్‌టాప్ టెర్రస్, ప్రైవేట్ పూల్ ఉన్నాయి.

Pages