S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/01/2017 - 23:48

లండన్, నవంబర్ 1: హాలీవుడ్ సినిమాలు, కాల్పనిక సైన్స్ సాహిత్యంలో గ్రహాంతర వాసులంటే వేరే ప్రపంచానికి చెందిన వారని, వికృతరూపంతో ఉంటారన్న వాదనలో నిజం లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. మనం భావిస్తున్న దానికి భిన్నంగా- గ్రహాంతర వాసులు మనుషులనే పోలి ఉంటారని పరిశోధకులు ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీ’లో పేర్కొన్నారు.

11/01/2017 - 23:15

న్యూయార్క్, నవంబర్ 1:అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సమీపంలో ఉగ్రవాద దాడి జరిగింది. ‘గాడ్ ఈజ్ గ్రేట్’అంటూ ఓ ఉన్మాది పాల్పడ్డ ఘాతుకానికి ఎనిమిది మంది బలయ్యారు. ఉజ్బెక్‌కు చెందిన సైఫుల్లా సైపోవ్‌గా గుర్తించిన ఈ ఉగ్రవాది అత్యంత వేగంగా ట్రక్కును నడుపుకుంటూ వెళ్లి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

11/01/2017 - 22:02

వాషింగ్టన్, నవంబర్ 1: భారత్‌తో మైత్రి మరింత బలోపేతం కావాలని, ఇందుకు భారత-అమెరికన్ సమాజం కొత్త అవకాశాలను అనే్వషించాలని అమెరికాలో అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన ఎంపీలు సూచించారు. భారత్‌తో స్నేహం చాలా ముఖ్యమైన అంశమని, ఇది మరింతగా వృద్ధి చెందేలా రెండు దేశాల ప్రజలు కీలకపాత్ర వహించాలని వారు అన్నారు.

11/01/2017 - 22:01

హ్యూస్టన్, నవంబర్ 1: డల్లాస్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మూడేళ్ల చిన్నారి షెరిన్ మాథ్యూస్‌కు ఆమె పెంపుడు తండ్రి రహస్యంగా అంత్యక్రియలు జరిపించాడు. మీడియా కంటపడకుండా నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని ఖనం చేశారు. అక్టోబర్ 7న అదృశ్యమైన మాథ్యూస్ 11 రోజుల తరువాత ఓ కల్వర్ట్ వద్ద శవమై కనిపించింది. ఆమె నివాసానికి కిలోమీటర్ దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.

11/01/2017 - 02:50

టోక్యో, అక్టోబర్ 31: ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.

10/30/2017 - 02:03

కరాచీ, అక్టోబర్ 29: పాకిస్తాన్ ఆదివారం 68 మంది మత్స్యకారులను కరాచీలోని లాంధి జైలు నుంచి విడుదల చేసింది. తన పరిధిలోని జలాల్లోకి ప్రవేశించారనే అభియోగంపై వీరిని అరెస్టు చేసి జైలులో పెట్టిన పాకిస్తాన్ చివరకు వారిని సానుభూతితో వదలిపెట్టినట్టుగా అభినయించింది.

10/30/2017 - 02:02

పెషావర్, అక్టోబర్ 29: పాకిస్తాన్‌లోని ఖైబర్ పంఖ్తున్‌క్వా రాష్ట్రంలో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒక డిప్యూటి ప్రొవిన్షియల్ గవర్నర్ కిడ్నాప్‌కు గురయ్యారు.

10/29/2017 - 02:39

పలొంగ్‌ఖలీ (బంగ్లాదేశ్), అక్టోబర్ 28: మైన్మార్ నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న రోహింగ్యా శరణార్థులకు సౌకర్యాలు కల్పించడంలో తలమునకలై ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిలో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నదానిపై దృష్టిపెట్టింది. మైన్మార్‌లో ఆగస్టులో తలెత్తిన సైనిక చర్య తరువాత 6 లక్షల మందికి పైగా రొహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చేశారు. ఇప్పటికి రఖీనే రాష్ట్రం నుంచి శరణార్థులు వస్తునే ఉన్నారు.

10/28/2017 - 02:55

వాషింగ్టన్, అక్టోబర్ 27: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనె్నడి దారుణ హత్యకు సంబంధించిన సుమారు మూడు వేల రహస్య ఫైళ్లను విడుదల చేయడానికి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. అయితే మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లను పరిరక్షించడం కోసం కొన్ని సున్నితమైన రికార్డులను మాత్రం విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించారు.

10/28/2017 - 03:17

బీజింగ్, అక్టోబర్ 27: ‘అధికార కమ్యూనిస్టు పార్టీకి సంపూర్ణ స్థాయిలో విధేయతగా ఉండండి. యుద్ధాలలో నెగ్గడం ఎలా అనే అంశంపై కేంద్రీకరించడం ద్వారా యుద్ధ సన్నద్ధతను తీవ్రం చేయండి..’ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా, 2.3 మిలియన్ల మంది సిబ్బందితో కూడిన పటిష్ఠమైన మిలిటరీగా ఉన్న చైనా సాయుధ బలగాలను ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇలా ఆదేశించారు.

Pages