S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/22/2017 - 02:52

బీజింగ్, అక్టోబర్ 21: బౌద్ధుల మత గురువు దలైలామాపై చైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. దలైలామా ఓ వేర్పాటువాదని, ఆధ్యాత్మికవేత్త ముసుగులో చైనా నుంచి టిబెట్‌ను విడదీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని బీజింగ్ ధ్వజమెత్తింది. ఏ దేశం అయినా లేక విదేశీనేత అయినా దలైలామాతో సమావేశమైనా, కలిసినా ‘తీవ్రమైన నేరం’గానే పరిగణిస్తామని చైనా తీవ్రంగా హెచ్చరించింది.

10/22/2017 - 02:51

లండన్, అక్టోబర్ 21: దీపావళి పండుగ హిందువుల సంస్కృతికి ప్రతీక అని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. జీవితంపై ప్రభావం చూపే ప్రతి అవకాశాన్ని దీపావళి అందిస్తుందని, గతంలో జరిగిన చేదు ఘటనలను మరిచిపోయి భవిష్యత్తులో ఆనందంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్న ఆమె దీపావళి సందర్భంగా హిందువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

10/22/2017 - 02:41

ఇస్లామాబాద్, అక్టోబర్ 21: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కుల్‌భూషణ్ జాదవ్ విషయం చర్చించినట్టు మీడియాలో వచ్చిన కథనాలను పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ‘మా హైకమిషనర్ సొహైల్ మహమూద్ భారత విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారన్న విషయం వాస్తవమే. అయితే ఇద్దరి మధ్య జాదవ్ విషయం చర్చకు వచ్చిందన్న కథనాలు వట్టిదే’ అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.

10/21/2017 - 04:09

వాషింగ్టన్, అక్టోబర్ 20: అమెరికాలో తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లుతున్న తరుణంలో ఆదేశంలో ఏకంగా 30 లక్షల మంది పౌరులు లోడెడ్ హ్యాండ్ గన్స్‌ను నిత్యం కలిగి ఉంటారంటూ తాజాగా విడుదలైన ఓ సర్వే స్పష్టం చేసింది. మరో తొమ్మిది లక్షల మంది నెలవారీగా ఈ తుపాకీలను కలిగి ఉంటారని ఈ సర్వే తెలిపింది.

10/21/2017 - 04:09

దుబాయి, అక్టోబర్ 20: భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఎలాంటి సమస్య లేకుండా అమలుకావడానికి ఇదే కారణమని భారత రాయబారి నవదీప్‌సింగ్ సూరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత్-యుఎఇ మధ్య కుదిరిన అనేక ఒప్పందాల గురించి ఆయన మాట్లాడారు.

10/21/2017 - 03:52

లాహోర్, అక్టోబర్ 20: ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడైన జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ గృహ నిర్బంధ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించారు. పంజాబ్ రాష్ట్రంలోని జుడీషియల్ రివ్యూ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే సరుూద్‌కు చెందిన మరో నలుగురు సహచరులు నిర్బంధాన్ని పొడిగించాలన్న అభ్యర్థనను బోర్డు తిరస్కరించింది.

10/21/2017 - 03:52

ఇస్లామాబాద్, అక్టోబర్ 20: విదేశీ కంపెనీలు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన 3వ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అకౌంటబులిటీ కోర్టు అభిశంసించింది. షరీఫ్‌పై మొత్తం మూడు అవినీతి, మనీలాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. కేసులను జాతీయ అకౌంటబులిటీ బ్యూరో దాఖలు చేసింది. గత నెల 8న షరీఫ్ కుటుంబ సభ్యులపై కూడా అవినీతి కేసులు దాఖలయ్యాయి.

10/19/2017 - 01:03

బెర్లిన్, అక్టోబర్ 18: సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో 95 శాతం చెత్త కేవలం పది నదుల నుంచి చేరుతున్నదేనంటే నమ్ముతారా? ఇది నిజం అంటున్నారు దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్తవ్రేత్తలు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ పది నదుల్లో పవిత్ర గంగా పేరు కూడా ఉండటం. ఈ పది నదుల్లో ఎనిమిది నదులు ఆసియా ఖండంలో ప్రవహిస్తున్నవైతే, మిగిలిన రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నవి.

10/18/2017 - 22:26

వాషింగ్టన్, అక్టోబర్ 18: కొంతకాలంగా అమెరికా అధ్యక్షులు కొనసాగిస్తున్న సంప్రదాయానే్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కొనసాగించారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించి, తన యంత్రాంగంలో కీలక పదవుల్లోవున్న భారతీయ- అమెరికన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

10/18/2017 - 22:23

ద్వైపాక్షిక వివాదాలకు చర్చల పరిష్కారం
నిజాయితీగా చేయి చాపితే ఎవరితోనైనా చెలిమి
తిరుగులేని సైనిక శక్తికి మనమే చిరునామా
19వ సిపిసి కాంగ్రెస్ సమావేశాల్లో జిన్ పింగ్

Pages