S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/06/2017 - 01:58

స్టాక్‌హోమ్, అక్టోబర్ 5: భౌతిక ప్రపంచంతో మనిషి భావోద్వేగ సంబంధాల లోతులను ఆవిష్కరించి, భ్రమలను తొలగించిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత కజువో ఇషిగ్గురోకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’ నవలతో ప్రపంచ సాహితీ ప్రియులను విశేషంగా ఆకర్షించిన 62 సంవత్సరాల ఇషిగ్గురోకు ఇప్పటికే బుకర్ ప్రైజ్ లభించింది.

10/05/2017 - 21:23

స్టాక్‌హోం, అక్టోబర్ 4: ప్రపంచ దేశాలను గడగడలాడించిన జికా వైరస్, అల్జిమీర్స్‌లకు దారితీసే జీవకణాలను అత్యంత సూక్ష్మ రీతిలో పరిశీలించేందుకు దోహదం చేసిన జాక్వెస్ డుబోషెట్, జావోచిమ్ ఫ్రాంక్ (జర్మనీ), రిచర్డ్ హెండర్‌సన్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.

10/04/2017 - 23:35

వాషింగ్టన్, అక్టోబర్ 4: చైనా అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఒన్ బెల్ట్-ఒన్ రోడ్ (ఓబిఓఆర్) విషయంలో భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. దాదాపు 50 బిలియన్ల డాలర్ల ఖర్చుతో నిర్మితమవుతున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి కూడా భారత్ వాదననే అమెరికా బలపరిచింది.

10/04/2017 - 23:31

వాషింగ్టన్, అక్టోబర్ 4: భారీగా ద్రవ్యరాశి గల అయిదు జతల కాల బిలాలను (బ్లాక్ హోల్‌లను) శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. తాజాగా కనుగొన్న ఈ బ్లాక్ హోల్‌లలో ఒక్కో బ్లాక్ హోల్ ద్రవ్యరాశి సూర్యుడి ద్రశ్యరాశి కన్నా అనేక లక్షల రెట్లు ఎక్కువగా ఉందని శాస్తజ్ఞ్రులు తమ పరిశీలనలో తేల్చారు. వీటిని కనుగొన్న శాస్తవ్రేత్తలలో భారత సంతతికి చెందిన శాస్తవ్రేత్త కూడా ఒకరు ఉన్నారు.

10/04/2017 - 23:28

ఐరాస, అక్టోబర్ 4: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్నవన్నీ అభూతకల్పనలేనని, అరణ్యరోదన చందమేనని భారత్ తీవ్ర స్వరంతో తిప్పికొట్టింది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని భారత్ ప్రేరేపిస్తుందంటూ పాక్ రాయబారి ఐరాసలో చేసిన ఆరోపణలను భారత ప్రతినిధి ఇనామ్ గంభీర్ తిప్పికొట్టారు.

10/05/2017 - 21:25

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ తాజాగా దౌత్యపరమైన ఔచిత్య పరిధులను అతిక్రమించింది. తాను ఓ దేశానికి విదేశాంగ మంత్రినని, తాను చేస్తున్న ఆరోపణలు అంతర్జాతీయంగా తిరుగులేని ఖ్యాతినార్జించిన ఓ దేశ ప్రధాని పైనేనన్న స్పృహ కూడా లేకుండా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యవహరించారు.

10/05/2017 - 21:26

లాస్‌వెగాస్, అక్టోబర్ 3: లాస్‌వెగాస్‌లో జరిగిన భయానక మారణకాండకు కారణమేమిటనే దానిపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఓ మాజీ ఉద్యోగి ఇంతమందిని బలిపెట్టడానికి కారణం ఏమిటి? అసలు అతడి ఉద్దేశం ఏమిటి అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

10/03/2017 - 02:14

వాషింగ్టన్, అక్టోబర్ 2: లాస్ వెగాస్‌లోని ఓ సంగీత కచేరీపై జరిగిన ఉన్మాద కాల్పుల కృత్యాన్ని దుష్ట, దుర్మార్గ చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఎప్పుడు ఘోరాలు సంభవించినా, దుష్ట చర్యలు జరిగినా అమెరికా ఒక్కటిగా నిలిచిందని వైట్ హౌస్ నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ అన్నారు.

10/03/2017 - 00:49

లాస్‌ఏంజిల్స్, అక్టోబర్ 2: ఆధునిక అమెరికా చరిత్రలోనే మునె్నన్నడూ చూడని నరమేథం సోమవారం చోటుచేసుకుంది. లాస్‌వేగాస్‌లోని ఓ హోటల్‌లో సాగుతోన్న సంగీత విభావరిపైకి ఆగంతకుడు గుళ్లవర్షం కురిపించి 58మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఏకధాటిగా కురిసిన గుళ్ల వర్షానికి 58మంది అక్కడికక్కడే చనిపోగా, కనీసం 200మంది తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లాస్‌వేగాస్ ఆస్పత్రికి తరలించారు.

10/03/2017 - 22:10

స్టాక్‌హోం, అక్టోబర్ 2: జీవజాతుల్లో వేకువ-నిద్రకు సంబంధించి శారీరక జీవ పరిణామాలపై కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చినందుకుగాను అమెరికా జీవశాస్త్ర త్రయానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ వైద్య బహుమతి లభించింది. జీవశాస్త్ర నిపుణులు జఫ్రీ సి హాల్, మైఖేల్ రోస్‌బాష్, మైఖేల్ డబ్ల్యు యంగ్ సంయుక్తంగా ఈ అవార్డును పొందారు.

Pages