S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/15/2016 - 03:15

హైదరాబాద్, జూలై 14: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

07/15/2016 - 02:38

బాగ్దాద్, జూలై 14: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక ఉగ్రవాది ఒమర్ అల్- షిసానీ హతమైనట్లు ఐఎస్ ధ్రువీకరించింది. షిసానీని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ‘యుద్ధ మంత్రి’గా అభివర్ణించేది. ఇరాక్‌లోని మోసుల్ నగరానికి దక్షిణంగా ఖరయత్ పట్టణం సమీపంలో జరిగిన వైమానిక దాడుల్లో ఒమర్ మరణించినట్లు ఉగ్రవాదులకు చెందిన ‘అమక్’ వార్తాసంస్థ ఐసిస్ వర్గాలనుటంకిస్తూ వెల్లడించింది.

07/14/2016 - 07:50

వాషింగ్టన్, జూలై 13: అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం తప్పని సరికాదని అయితే దాని నిబంధనలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని అమెరికాకు చెందిన మేధావుల వేదిక అయిన ‘కార్నిగే ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’లో న్యూక్లియర్ పాలసీ ప్రో గ్రా మ్ సీనియర్ అసోసియేట్ అయిన మార్క్ గిబ్స్ ‘న్యూక్లియర్ ఇంటెలిజన్స్’ వారపత్రికలో రాసిన సంపాదకీయ వ్యాసం లో పేర్

07/14/2016 - 07:49

ఖాట్మండు, జూలై 13: నేపాల్‌లో ప్రధాని కెపి ఓలిపై ప్రతిపక్ష పార్టీలు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టు పార్టీ మద్ద తు ఉపసంహరించుకోవడంతో ప్ర ధాని కెపి ఓలి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడి పోయినప్పటికీ ఆయన పదవినుంచి దిగిపోవడానికి నిరాకరించడంతో ఆయనను గద్దె దించడం కోసం ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.

07/14/2016 - 07:48

డార్జిలింగ్, జూలై 13: భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమని, వీటన్నిటినీ ఒక్కటి చేయడానికి లేదా ఏకరూపం తీసుకు రావడానికి జరిపే ప్రయత్నమేదైనా హానికరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘్భన్న సంస్కృతుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. వీటిన్నినీ ఒక్కటి చేయడానికి ప్రయత్నించరాదు. ఎందుకంటే అది మన సమాజానికి, దాని భిన్నత్వానికి తీవ్రమైన హాని చేస్తుందని మనకు తెలుసు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం.

07/14/2016 - 07:35

లండన్, జూలై 13: థెరిసామే బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న మార్గరేట్ థాచర్ తర్వాత బ్రిటన్‌కు ఒక మహిళ ప్రధానమంత్రి కావడం ఇదే ప్రథమం.

07/14/2016 - 06:58

లండన్, జూలై 13: విశ్వావిర్భావినికి బిగ్‌బ్యాంగ్ మూలమన్నది ఇప్పటి వరకు ఇటు ఖగోళవేత్తలు, అటు భౌతిక వేత్తలు చెప్తూ వస్తున్న విషయం. ఇంతకీ మన విశ్వమే తొలి విశ్వమా? లేక దీనికంటే ముందు మరో విశ్వం ఉందా? అనే కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తొలి విశ్వం కుప్పకూలడం వల్లే దాన్నుంచి బిగ్‌బౌన్స్‌గా మన విశ్వం ఆవిర్భవించిందని తాజా పరిశోధనలో వెల్లడించారు.

07/13/2016 - 08:37

ఇస్లామాబాద్, జూలై 12: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారా? లండన్‌లో జరిగిన ఓ స్వల్ప కార్యక్రమంలో ఆయన మూడోపెళ్లి చేసుకున్నట్లుగా మంగళవారం వెలువడిన మీడియా కథనాల బట్టి స్పష్టమవుతోంది. తాను గతంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడం వల్ల మూడో పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ 63 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

07/13/2016 - 08:37

ఇస్లామాబాద్, జూలై 12: పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి, సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పాక్‌లో ఒక రాజకీయ పార్టీ కొత్త ప్రచారాన్ని లేవదీసింది. ‘మూవ్ ఆన్ పాకిస్తాన్’ అనే రాజకీయ పార్టీ ఈ కొత్త ప్రచారానికి తెరదీసింది. ఈ మేరకు లాహోర్, కరాచీ పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్ తదితర 13 నగరాల్లో మంగళవారం ఏకకాలంలోపెద్ద ఎత్తున పోస్టర్లు ప్రత్యక్షమైనాయి.

07/13/2016 - 08:36

వాషింగ్టన్, జూలై 12: కాశ్మీర్ అంశం భారత దేశ ఆంతరంగిక వ్యవహారమని అమెరికా విస్పష్టంగా తెలియజేసింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలు, హింసాకాండపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి స్పష్టం చేశారు.

Pages