S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/15/2017 - 02:16

వాషింగ్టన్, జూలై 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే. ఈ మధ్య ఓ టీవీ యాంకర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేయడమే కాక చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ట్రంప్ వార్తల్లోకి ఎక్కారు.. అది కూడా ఓ దేశ ప్రథమ పౌరురాలిపై వ్యాఖ్యలతో. విషయం ఏమిటంటే..

07/15/2017 - 01:58

బ్రసెల్స్, జూలై 14: డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్‌పెర్లిలోని భూటాన్ సైనిక శిబిరం వైపు రోడ్డు నిర్మాణం విషయంలో దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరించిన చైనా భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ గట్టిగా రంగంలోకి దిగుతుందని ఊహించలేక పోయిందని ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్డ్ జార్నెస్కీ అభిప్రాయ పడ్డారు.

07/15/2017 - 01:57

వాషింగ్టన్, జూలై 14: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)పై యుద్ధం ఇంకా ముగియ లేదని అమెరికా పేర్కొంది. ఇరాక్‌లోని మోసుల్ పట్టణం నుంచి ఐసిస్‌ను పూర్తిగా నిర్మూలించినా ఇంకా చేయవల్సింది చాలా ఉందని తెలిపింది.

07/15/2017 - 01:55

ఐక్యరాజ్యసమితి, జూలై 14: కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సూచించింది. ఈ మేరకు ఐరాస చీఫ్ ఆంతోనియో గటెరెస్ పేర్కొన్నట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.

07/14/2017 - 02:20

వాషింగ్టన్, జూలై 13: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు బ్రాడ్ షెర్‌మాన్ అభిశంసన తీర్మానాన్ని ప్రేవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి తొలి అడుగు వేశారు.

07/14/2017 - 02:07

సియోల్, జూలై 13: ఉత్తర కొరియాతీరానికి దూరంగా సముద్రం అడుగున గురువారం రిక్టర్ స్కేలుపై 5.9 పాయింట్ల తీవ్రవతో భూకంపం సంభవించింది. అయితే ఇది అణు పరీక్ష వల్ల సంభవించింది కాదని నిపుణులు అంటున్నారు. ఈ నెల 4న ఉత్తర కొరియా ప్రభుత్వం తన తొలి ఖండాంతర క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియా గతంలో జరిపిన అయిదు అణు పరీక్షల్లో కూడా కృత్రిమ భూకంపం లక్షణాలు కనిపించాయి.

07/14/2017 - 02:21

ఇస్లామాబాద్, జూలై 13: పనామా కేసులో ప్రతికూల వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తిరస్కరించారు. పనామా కేసును దర్యాప్తు చేసిన ప్యానెల్ నవాజ్‌షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసును నమోదు చేయాలని సిఫార్సు చేసింది.

07/14/2017 - 01:58

ప్యారిస్, జూలై 13: పర్యావరణ మార్పుల నిరోధానికి ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పంపై వైదొలగడంపై ప్రపంచ దేశాల విమర్శలకు గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకోకపోతున్నారా? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రమ్‌తో సమావేశం అనంతరం ట్రంప్ ఈ మేరకు సంకేతాలు అందించారు. మాక్రమ్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలోమాట్లాడిన ట్రంప్‌‘ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే ఏదో జరగవచ్చు.

07/14/2017 - 01:17

లాహోర్, జూలై 13: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కుదిపేసిన 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది సుఫయాన్ జాఫర్‌ను తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు బెయిలుపై విడుదల చేసినట్లు కోర్టు అధికారి ఒకరు గురువారం తెలిపారు.

07/14/2017 - 01:16

బీజింగ్, జూలై 13: చైనా ప్రజాస్వామ్య ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి శాంతి బహుమతి గ్రహీత లియు జియాబో(61) గురువారం తుది శ్వాస విడిచారు. కేన్సర్‌తో బాధడుతున్న ఆయనను నెల రోజుల క్రితమే చికిత్స నిమిత్తం చైనా ప్రభుత్వం ఓ ఆసుపత్రికి తరలించింది. లియును విడుదల చేసి కేన్సర్ చికిత్సకు విదేశాలకు పంపాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని చైనా తిరస్కరించింది.

Pages