S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/13/2017 - 00:00

బీజింగ్, జూన్ 12: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్తానాలో తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో సమావేశం కాలేదని, బలూచిస్తాన్‌లో ఇటీవల ఇద్దరు చైనీయులు హత్యకు గురికావడమే ఇందుకు కారణమని వస్తున్న వార్తలు అర్థరహితమైనవని చైనా తోసిపుచ్చింది.

06/11/2017 - 23:49

లండన్, జూన్ 11: బ్రిటన్‌లో తాజాగా నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో నష్టపోయింది ఒక్క ప్రధాని థెరిసా మే మాత్రమే కాదు. ఆమె కన్సర్వేటివ్ పార్టీ భారీగా మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మి భారీ మొత్తంలో బెట్టింగ్‌లు కాసినవారు కూడా పెద్దమొత్తాల్లో నష్టపోయారు.

06/11/2017 - 04:58

వాషింగ్టన్, జూన్ 10: కాన్సాస్ నగర శివారులోని బార్‌లో కొద్ది నెలల క్రితం తెలుగు ఐటి నిపుణుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపడంతోపాటు మరో ఇద్దరిని గాయపర్చిన అమెరికా నావికాదళ మాజీ ఉద్యోగి ఆడమ్ పురిన్‌టన్ (51)ను అక్కడి న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.

06/11/2017 - 03:29

వాషింగ్టన్, జూన్ 10: ఇస్లామిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కతార్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు కతార్ నిధులను సమకూర్చడం చరిత్ర చెబుతున్న నిజమని, ఆ దేశంతో పాటు గల్ఫ్‌లోని ఇతర దేశాలు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడాన్ని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

06/11/2017 - 03:26

బన్ను (పాకిస్తాన్), జూన్ 10: పాకిస్తాన్‌లో ముగ్గురు ‘మొనగాళ్లు’. దాదాపు 100 మంది పిల్లలకు వారు తండ్రులు. అయినా సంతాన కాంక్ష ఏమాత్రం తగ్గని వారు ‘ఒకరు లేదా ఇద్దరు చాలు’ అన్న నానుడిని పక్కన పెట్టి తమ ‘పటిమ’ను ఇంకా నిరూపించుకుంటున్నారు. తద్వారా పాక్ జనాభా ఇతోధికంగా పెరగడంలో తమవంతు ‘సేవ’లను కొనసాగిస్తున్నారు.

06/11/2017 - 03:22

దుబాయ్, జూన్ 10: సౌదీ అరేబియాలో దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. టెహ్రాన్‌లో దాడులకు పాల్పడి 17 మంది ప్రాణాలను బలితీసుకున్నది తామేనని ప్రకటించుకున్న ఐసిస్ తాజాగా ఈ హెచ్చరిక చేసిందని ‘సైట్’ అనే ఇంటెలిజెన్స్ గ్రూపు శుక్రవారం వెల్లడించింది.

06/11/2017 - 02:32

వాషింగ్టన్, జూన్ 10: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో నగదు కొరతకు కారణవుతుందనే విషయం ప్రభుత్వానికి ముందే తెలుసునని, అయితే దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా ఇది పెద్ద ముందడుగవుతుందని ఊహించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తాత్కాలికంగా ఒకటి లేదా రెండు త్రైమాసికాల దాకా నగదు కొరతకు దారి తీస్తుందనే విషయం ప్రభుత్వానికి ముందే తెలుసు.

06/10/2017 - 03:01

ఆస్తానా, జూన్ 9: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య సమన్వయంతో కూడిన సహకారం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని భార త ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల సార్వభౌత్వం, ప్రాదేశిక సమగ్రతలకు విఘా తం కలగని రీతిలో వీటిమధ్య సయోధ్య, సహకారం పెంపొందడం ఎంతో అవసరమని ఎస్‌సిఓ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు.

06/10/2017 - 03:00

ఆస్తానా, జూన్ 9: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యా రు.

06/10/2017 - 02:49

లండన్, జూన్ 9: బ్రిటన్ పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు విజయపతాకం ఎగురవేశారు. తొలిసారిగా ఓ సిక్కు మహిళ, సంప్రదాయ తలపాగా ధరించే మరో సిక్కు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాగా, తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతి వారిలో ఏడుగురు గెలుపొందగా, కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసిన అయిదుగురు గెలుపొందారు.

Pages