S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/08/2017 - 02:23

లండన్, జూన్ 7: బ్రిటన్‌లో గురువారం జరగనున్న మధ్యంతర ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. ప్రచారం చివరి రోజయిన బుధవారం నాడు కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి, ప్రధానమంత్రి థెరిసా మే, ఆమె ప్రదాన ప్రత్యర్థి, లేబర్ పార్టీకి చెందిన జెర్మీ కోర్బిన్‌లు అత్యంత కీలకంగా మారిన పట్టణ ప్రాంత ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని ప్రచారం సాగించారు.

06/08/2017 - 02:23

వాషింగ్టన్, జూన్ 7: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద మహమ్మారిని సమష్టిగా ఎదుర్కోవాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. గల్ప్ ప్రాంత శాంతి, సుస్థిరతకు పాటుపడాలని ఆయన అన్నారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌తో ట్రంప్ ఫోన్‌లో సం భాషించారు.

06/07/2017 - 03:04

వాషింగ్టన్, జూన్ 6:మధ్యప్రాచ్యలో తాను జరిపిన పర్యటన సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఖతర్‌తో గల్ఫ్ దేశాలు తెగతెంపులు చేసుకోవడం ఉగ్రవాదం అంతానికి నాంది పలకడంగా ఆయన అభివర్ణించారు. మిలిటెంట్లకు అందుతున్న నిధులకు అడ్డుకట్ట వేస్తామంటూ ఈ దేశాలు తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాయన్నారు.

06/06/2017 - 01:46

న్యూఢిల్లీ, జూన్ 5: ఉగ్రవాదం, చర్చలు కలిసి ముందుకు సాగలేవు, ఉగ్రవాదం ఆగనంత కాలం పాకిస్తాన్‌తో చర్చలు జరపటం సాధ్యం కాదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీస్తున్న ‘ఒక బెల్ట్, ఒక రోడ్డు’ చైనా పథకాన్ని సమర్థించే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు.

06/06/2017 - 01:45

న్యూఢిల్లీ, జూన్ 5: వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను కొనసాగిస్తే అందుకు తగిన ప్రతీకార చర్యలు తప్పవని భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఎకె భట్ పాకిస్తాన్ డిజిఎంఓ మేజర్ జనరల్ షాహిర్ శంషాద్ మీర్జాకు స్పష్టం చేశారు. సోమవారం ఇద్దరు డిజిఎం ఓలు ఫోన్‌ద్వారా సంభాషించుకున్నారు.

06/06/2017 - 01:44

బీజింగ్, జూన్ 5: అణు ఇంధన సరఫరా బృందంలో భారత్‌కు సభ్యత్వం రావటం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అత్యంత సంక్లిష్టమైనదని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఎన్ ఎస్‌జి లో భారత సభ్యత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న చైనా అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయని దేశాల విషయంలో అనుసరిస్తున్న వైఖరే భారత్‌కు కూడా వర్తిస్తుందని మరోసారి పేర్కొంది.

06/06/2017 - 01:43

బీజింగ్, జూన్ 5: సరిహద్దుల విషయమై భారత్-చైనా మధ్య కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దు వద్ద గత 40 ఏళ్లలో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం రష్యాలో చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. ‘మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేఖరులకు తెలిపారు.

06/06/2017 - 01:42

బీజింగ్, జూన్ 5: చైనా సైనికదళ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) హెలికాప్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించి ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని బారాహోటీ ప్రాంతంపై చక్కర్లు కొట్టడాన్ని ఆ దేశం సమర్ధించుకుంది.

06/06/2017 - 01:38

వాషింగ్టన్, జూన్ 5: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాము గట్టిగా సమర్థిస్తున్నామని, ఈ ఒప్పందం విషయంలో తాము ఏమి చేయాలో భారత్, చైనా, ఫ్రాన్స్ చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న నిక్కీ హేలీ చెప్పారు.

06/06/2017 - 01:37

దుబాయ్, జూన్ 5: అరబ్ దేశాల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు అండగా నిలవడంతోపాటు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగిస్తున్న ఖతార్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోమవారం నాలుగు అరబ్ దేశాలు దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. ఖతార్ నుంచి తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రకటించాయి.

Pages