S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/05/2017 - 04:09

సియోల్, జూన్ 4: ఐక్యరాజ్యసమితి తాజాగా తీవ్ర ఆంక్షలు విధించినప్పటికీ, తమ క్షిపణి అణ్వాయుధాల కార్యక్రమాలను విడనాడే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా ఆదివారం నాడు తెగేసి చెప్పింది. అమెరికా రూపొందించిన తీర్మానాలను ఆమోదిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

06/05/2017 - 02:48

లండన్, జూన్ 4: బ్రిటన్‌లో వచ్చే గురువారం జరగాల్సిన సార్వఅతిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రధాని తెరిసా మే ప్రకటించారు. లండన్‌లో శనివారం ఉగ్రవాద దాడి అనంతరం భద్రతా దళాల ఉన్నతాధికారులతో అత్యవసర ‘కోబ్రా’ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం మే విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియను హింస భగ్నం చేయడానికి ఎప్పటికీ అనుమతించకూడదు’ అని అన్నారు.

06/05/2017 - 02:12

లండన్, జూన్ 4: బ్రిటన్ రాజధాని లండన్ మహానగరం మరోసారి ఉగ్రదాడులతో రక్తసిక్తమయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్యంత వేగంగా వచ్చిన ఒక తెల్లవ్యాన్ ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి దూసుకెళ్లింది.

06/04/2017 - 01:43

పారిస్, జూన్ 3: పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి పారిస్ ఒప్పందానికి మించి తాము కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందంనుంచి వైదొలగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో శనివారం సమావేశమైన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

06/04/2017 - 02:14

కాబూల్, జూన్ 3: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మళ్లీ నెత్తురోడింది. నగరంలోపలుచోట్ల జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నగరంలోని ప్రధాన రోడ్లన్లీ మూసేశారు. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి హింసకు దిగారు. వీధి పోరాటల్లో కనీసం నలుగురు మృతి చెందారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో భారీఎత్తున సాయుధ బలగాలు మోహించాయి. అలాగే వీధుల్లో పెట్రోలింగ్ విస్తృతం చేశారు.

06/04/2017 - 02:15

గపూర్, జూన్ 3: ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని అమెరికా ప్రశంసించింది. దక్షిణ చైనా సముద్ర జలాల వివాదంపై ఆయన కచ్చితమైన వైఖరిని ప్రదర్శించారని, ఒక మార్గనిర్దేశన చేశారని కితాబు ఇచ్చింది.

06/04/2017 - 00:54

ఐక్యరాజ్య సమితి, జూన్ 3: ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమంతో సంబంధం ఉన్న 15 మంది వ్యక్తులు, నాలుగు సంస్థలను ఐక్యరాజ్య సమితి ఆంక్షల బ్లాక్‌లిస్టులో చేర్చే ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లుగా ఉత్తర కొరియాపై మరింత కఠినమైన ఆంక్షలకు సంబంధించిన మరో తీర్మానాన్ని మాత్రం చైనా అడ్డుకొంది.

06/03/2017 - 01:38

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: చారిత్రక ప్యారిస్ ఒప్పందంతో నిమిత్తం లేకుండా భారత్ పర్యావరణ పరిరక్షణకు త్రికరణ శుద్ధిగా పాటుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా ఆయన మాట్లాడారు.

06/03/2017 - 01:36

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దాత్సన్ గుంజెచోయినీ బౌద్ధ ఆలయం ప్రధాన పూజారి జంపా డోనోర్‌కు బౌద్ధులు ఎంతో పవిత్రంగా భావించే ‘శత పిటక’ (ఉర్గా కంజూర్) గ్రంథం టిబెట్ భాష ప్రతిని బహూకరించారు. వంద వాల్యూమ్‌లకు పైగా ఉండే ఈ టిబెటన్ కంజూర్ ఉర్గా ప్రతి గురించి 1955 వరకు కూడా ఎవరికీ తెలియదు.

06/03/2017 - 01:35

పారిస్, జూన్ 2: వాతావరణ మార్పులపై 2015లో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందంనుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు.

Pages