S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/03/2017 - 01:00

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: ఉగ్రవాదం అంతర్జాతీయ పెను సవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ జాడ్యాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఏవిధంగానూ నిధులను గానీ, ఆయుధాలను గానీ అందజేయడానికి వీల్లేదని పాకిస్తాన్‌కు పరోక్షంగా చురక వేశారు.

06/02/2017 - 01:18

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 1: ఏడు దశాబ్దాల భారత్-రష్యా అనుబంధం కొత్త పుంతలు తొక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ముక్తకంఠంతో ఉగ్రవాదంపై నిప్పులు చెరిగాయి. తమిళనాడులోని అణు ఇంధన కర్మాగారానికి సంబంధించి మరో రెండు విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించడంతో పాటు పరస్పర సైనిక బంధానికీ కొత్త శక్తి నివ్వాలనీ సంకల్పించాయి.

06/02/2017 - 01:15

శ్రీనగర్, జూన్ 1: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పదేపదే కవ్వింపుచర్యలకు దిగుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌కు భారత్ సరైన బుద్ధిచెప్పింది. ఎల్‌ఓసి వద్ద భారత్ సైన్యం కాల్పులు జరిపి ఐదుగురు పాక్ రేంజర్లను మట్టుబెట్టింది. రాజౌరీ,పూంచ్ జిల్లాల్లో నౌషేరా, కృష్ణఘాటీ సెక్టార్‌లో గురువారం హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఆరుగురు పాక్ రేంజర్లు గాయపడ్డారు.

06/02/2017 - 01:14

ఇస్లామాబాద్, జూన్ 1: క్షమాభిక్ష కోసం భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ పిటిషన్లపై తుది నిర్ణయం తేలేవరకూ ఆయనను ఉరితీసేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చేవరకూ జాధవ్ జోలికెళ్లడానికి వీల్లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పాక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

06/01/2017 - 04:30

మాడ్రిడ్, మే 31: భారత్, స్పెయిన్‌లు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పర సహకారాన్ని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పెయిన్ ప్రధానమంత్రి మారియానోరజోయితో బుధవారం జరిగిన చర్చల సందర్భంగా మాట్లాడిన మోదీ ఉగ్రవాదాన్ని సంయుక్త ప్రయత్నాలతో ఎదుర్కోవల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

06/01/2017 - 04:20

మరావి, మే 31: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మరావి పట్టణంలో ముస్లిం మిలిటెంట్ల చేతుల్లో బందీలుగా ఉన్న 200 మందిని క్షేమంగా విడిపించి తీరుతామని ఫిలిప్పీన్స్ అధికారులు అంటున్నారు. వీరిని బందీలుగా పట్టుకున్న మిలిటెంట్ నాయకులతో చర్చలు జరపగలిగిన పక్షాలతో తాము చర్చలు జరుపుతున్నామని కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

06/01/2017 - 04:31

ఐక్యరాజ్య సమితి, మే 31: వాతావరణ మార్పు లు ఆహార ఉత్పత్తి, నీటి భద్రత, కెనడానుంచి భారత దేశం దాకా వాతావరణాల తీరు తెన్నులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రపంచ దేశాల నేతలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

06/01/2017 - 02:56

కాబూల్, మే 31: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భయంకరమైన ఉగ్రదాడి జరిగింది. విదేశీ దౌత్యకార్యాలయాలు ఉండే వీధిలో ఉగ్రవాదులు అతి తీవ్రమైన ట్రక్ బాంబును పేల్చటంతో దాదాపు 80మంది మృత్యువాత పడ్డారు. మూడు వందల ఇరవై మందికి పైగా గాయపడ్డారు. ఉదయం 8.30గంటలకు జాన్‌బాఖ్ స్వేర్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఒక ట్రక్‌తో ఆత్మాహుతి దళ సభ్యుడు వచ్చి తనను తాను పేల్చుకున్నాడు.

05/31/2017 - 08:39

ఢాకా, మే 30: పెను తుపాను మోరా మంగళవారం బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటింది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 130-150 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచడంతో వందలాది ఇళ్లు దెబ్బ తినడంతో అధికారులు తీరప్రాంతాలనుంచి 3 లక్షల మందిని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో మోరా తుపాను కాక్స్‌బజార్- చిట్టగాంగ్ మధ్య తీరాన్ని దాటిందని బంగ్లాదేశ్ వాతావరణ విభాగం తెలిపింది.

05/31/2017 - 08:39

కొలంబో, మే 30: శ్రీలంకలో వరద తాకిడికి గురయిన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో శ్రీలంక అధికారులతో భారత నౌకాదళానికి చెందిన గజఈతగాళ్లు, వైద్య బృందాలు తోడ్పాటునందిస్తున్నాయి. కాగా, దేశంలో దాదాపు 15 ఏళ్లలో కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 200కు చేరుకుంది.

Pages