S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/31/2017 - 08:38

బెర్లిన్, మే 30: భారత్, జర్మనీల మధ్య ఫలితాలు సాధించే విధంగా పరస్పర సహకారం విస్తృతం కావల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉందని జర్మనీ చాన్సలర్ ఎంజీలా మెర్కెల్‌తో విస్తృత స్థాయి చర్చల సందర్భంగా స్పష్టం చేశారు. వాణిజ్యం, నైపుణ్య అభివృద్ధి, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధన వంటి అనేక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

05/25/2017 - 07:20

ఇస్లామాబాద్: సియాచిన్ మంచుదిబ్బ సమీపంలోని గగనతలంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు బుధవారం చక్కర్లు కొట్టాయని మీడియా కథనం వెల్లడించింది. అయితే భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని భారత వాయుసేన (ఐఎఎఫ్) వర్గాలు బుధవారం ఢిల్లీలో తెలిపాయి. పాకిస్తాన్ వాయు సేన (పిఎఎఫ్) యుద్ధ విమానాలు బుధవారం ఉదయం సియాచిన్ మంచుదిబ్బ సమీపంలో చక్కర్లు కొట్టాయని సమత టివి ఒక కథనం ప్రసారం చేసింది.

05/25/2017 - 07:11

వాటికన్ సిటీ, మే 24: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి అమెరికా అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించాలని ట్రంప్‌ను కోరారు. తమ మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని ట్రంప్ అన్నారు.

05/24/2017 - 05:16

పాప్ స్టార్ ఆరియానా గ్రాండే కచేరి వద్ద ఘటన
22మంది మృతి, 59 మందికి గాయాలు
దాడి మా పనే: ఐసిస్

05/20/2017 - 00:12

స్టాక్‌హోమ్, మే 19: అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి న్యాయపోరాటంలో పెద్ద విజయం లభించింది. 2012 నుంచి అతను లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం విదితమే. ఈ కేసులో అతనిపై ఏడేళ్ల నుంచి జరుపుతున్న దర్యాప్తును స్వీడిష్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం విరమించుకున్నారు.

05/17/2017 - 03:32

వాషింగ్టన్, మే 16: ప్రపంచాన్ని చుట్టుముట్టిన సైబర్ దాడికి అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలను నిందిస్తున్న వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హోంలాండ్ సెక్యూరిటీ సలహాదారయిన టామ్ బాస్సెర్ట్ జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఎస్‌ఏ)ని నిందించవద్దని, హ్యాకర్లను మాత్రమే నిందించండంటూ సలహా ఇచ్చారు.

05/17/2017 - 02:05

వాషింగ్టన్, మే 16:అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని రష్యాతో పంచుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అభియోగాలు వచ్చాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్‌రోవ్, ఆ దేశ రాయబారి సెర్గే కిస్‌లాక్‌లతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారంటూ వాషింగ్టన్ పోస్టులో సంచలన కథనాలు వెలువడ్డాయి.

05/17/2017 - 01:07

బీజింగ్, మే 16: ‘వన్‌బెల్ట్-వన్ రోడ్’ ప్రాజెక్టు విషయంలో భారత్ వైఖరిని చైనా మంగళవారం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మెగా ప్రాజెక్టులో భారత్ పాలుపంచుకుంటే తాము సంతోషిస్తామని, అయితే దీనికి సంబంధించి తమతో ఎలాంటి అర్థవంతమైన చర్చలను భారత్ కోరుకొంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది.

05/16/2017 - 05:27

సియోల్, మే 15: అగ్రరాజ్యం అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం ఉన్న కొత్త క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో ఉత్తర కొరియా సోమవారం వేడుకలు జరుపుకుంది. అవసరమైతే అమెరికా ప్రధాన భూభాగంపై దాడి చేయగలగాలనే లక్ష్యంతోనే ఉత్తర కొరియా ఈ దూరగామి ఉపరితల క్షిపణిని ఆదివారం పరీక్షించింది. ఈ కొత్త క్షిపణికి భారీ అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉందని కూడా ప్రకటించింది.

05/16/2017 - 01:41

ది హేగ్, మే 15: తమ పౌరుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణ శిక్షను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానంలో భారత్ సోమవారం తన వాదనను మరింత గట్టిగా వినిపించింది. లేని పక్షంలో విచారణ పూర్తి కావడానికి ముందే జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్తాన్ అమలు చేసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

Pages