S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/16/2017 - 00:14

బీరట్, మే 15: ఇరాక్ సరిహద్దులో ఐసిస్ మిలిటెంట్ల అధీనంలో ఉన్న ఒక పట్టణంపై అమెరికా విమానాలు జరిపిన దాడిలో 23 మంది సాధారణ పౌరులు మరణించారు. ఆదివారం జరిగిన విమాన దాడుల్లోనూ రాకా ప్రావిన్స్‌లో 12 మంది మహిళలు మృత్యువాత పడినట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. సోమవారం తెల్లవామున అల్బు కమాల్ పట్టణంపై అమెరికా వైమానిక బలగాలు విరుచుకుపడ్డాయి.

05/15/2017 - 03:48

పారిస్, మే 14: ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో 39 ఏళ్ల మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినట్లయింది. వారం రోజుల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత మేక్రాన్ ఫ్రాంకోయిస్ హోలాండేనుంచి అధికార బాధ్యతలు స్వీకరించారు.

05/15/2017 - 02:51

బీజింగ్, ఏప్రిల్ 14: అన్ని దేశాలు కూడా ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను మరొకరు గౌరవించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. చైనా ఎంతో ఉదాత్త ఆశయంతో చేపడుతున్నట్లుగా చెబుతున్న ‘ఒకే ప్రాంతం, ఒకే రోడ్డు’ ప్రాజెక్టుపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఇక్కడ ప్రారంభిస్తూ జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

05/15/2017 - 02:08

లండన్, మే 14: ప్రపంచవ్యాప్తంగా ‘వన్నా క్రై’ మాల్‌వేర్ కలకలం సృష్టిస్తోంది. భారత్ సహా 150కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా బాధితులు దీని బారినపడ్డారు. కేవలం వ్యక్తులనే కాకుండా ఆస్పత్రులు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజన్సీలు తదితర సంస్థల్ని కూడా మాల్‌వేర్ దెబ్బతీసింది. ఈ గొడవ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి సైబర్ దాడి జరిగే అవకాశముందని సాఫ్ట్‌వేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

05/15/2017 - 01:39

వాషింగ్టన్, మే 14: ఉత్తరకొరియా తాజాగా జరిపిన బాలెస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని రెచ్చగొట్టే చర్యగా అమెరికా అభివర్ణించింది. ఉత్తరకొరియా దూకుడు అరికట్టేందుకు బలమైన ఆంక్షలను విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

05/15/2017 - 01:37

లాహోర్, మే 14: ముంబయ దాడి సూత్రదారి జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయాద్‌పై పాక్ నాయకత్వం నిప్పు చెరుగుతోంది. జిహాద్ పేరిట ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారంటూ ఆయనపై తీవ్ర స్థాయలో విరుచుకుపడింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ న్యాయ సమీక్షా బోర్డుకు వివరించింది. అయతే కాశ్మీరీల తరఫున మాట్లాడుతున్నందుకే పాక్ ప్రభుత్వం తనను అరెస్టు చేసిందంటూ సయాద్ చేసిన ఆరోపణలను తిరస్కరించింది.

05/14/2017 - 04:00

లండన్, మే 13: రాన్‌సమ్‌వేర్ వైరస్ కారణంగా దేశంలోని అనేక ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు రావచ్చని ఈ హ్యాంకింగ్ ఉదంతం వెలుగు చూడడానికి కొద్దిరోజుల ముందు బ్రిటిష్ జాతీయ ఆరోగ్య పథకం అధికారులను బ్రిటన్‌లో పని చేస్తున్న ఓ ప్రవాసాంధ్రుడు హెచ్చరించాడు.

05/14/2017 - 02:11

లండన్, మే 13: కంప్యూటర్ హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా మరోసారి పంజా విసిరారు. ఏకంగా అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీ ఉపయోగించే హ్యాకింగ్ టూల్స్‌నే దొంగిలించారు. తద్వారా శుక్రవారం పలు దేశాల్లోని వేలాది కంప్యూటర్లలోకి రాన్సమ్ వేర్ వైరస్‌ను చొప్పించి సమాచారాన్ని చోరీ చేశారు.

05/14/2017 - 01:17

వాషింగ్టన్, మే 13: అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా పగతో రగిలి పోతున్నాడని, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడని అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బిఐకి చెందిన మాజీ ఏజంట్ ఒకరు చెప్తున్నారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌పై అమెరికా జరిపిన నాటకీయ దాడిలో ఒసామా బిన్ లాడెన్ మృతి చెందిన విషయం తెలిసిందే.

05/14/2017 - 01:16

లండన్, మే 13: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం, జమ్మూకాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులకు నిధులు సమకూర్చటం వల్ల దక్షిణాసియాలో శాంతికి పెను సవాలు నెలకొందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అందువల్ల అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఏకాకిని చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Pages