S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/09/2016 - 05:54

ప్రిటోరియా, జూలై 8: ఉగ్రవాదంతో అందరికీ ముప్పేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇది ఉమ్మడి సమస్య కాబట్టి కలసికట్టుగానే దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మోదీ ‘ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదంతో రెండు దేశాల ప్రజల భద్రతకు ప్రమాదమే’నని తెలిపారు.

07/09/2016 - 05:37

వాషింగ్టన్, జూలై 8: ఆసక్తికరమైన ఎన్నో ప్రత్యేకతలతో భూమికి దాదాపు 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సరికొత్త గ్రహాన్ని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు.

07/08/2016 - 16:52

బీజింగ్‌: జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో 35 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం నిర్ధారించారు. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అందువల్ల ఇళ్లకు, ప్రజల ప్రాణాలకు తీవ్రనష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. చుట్టూ కొండల మధ్య ఈ గ్రామం ఉండడంతో పెద్దఎత్తున మట్టిపెళ్లలు పడ్డాయి.

07/08/2016 - 11:33

డల్లాస్‌: అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన నిరసన ర్యాలీలో ఆందోళనకారులు కాల్పులు జరపడంతో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. గత రెండు రోజుల్లో మిన్నెసోటా, లూసియానాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నల్లజాతి యువకులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. దీంతో అమెరికాలో పలుచోట్ల నల్లజాతీయులు ఆందోళనలు చేపట్టారు.

07/08/2016 - 11:29

బాగ్దాద్‌ : ఉత్తర బాగ్దాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రార్థనా మందిరం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు వరుస పేలుళ్లు, కాల్పులకు పాల్పడటంతో 30 మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌కి 70 కి.మీలు దూరంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

07/08/2016 - 05:19

మపుటో, జూలై 7: వివిధ దేశాల్లో వరుసగా జరగుతున్న ఉగ్ర దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తీవ్రంగా స్పందించారు. ప్రపంచానికి అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉగ్రవాదం పరిణమించిందన్నారు.

07/08/2016 - 03:00

ఢాకా, జూలై 7: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనను మరువక ముందే గురువారం మరోసారి ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఢాకాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషోర్ గంజ్ జిల్లాలోని షోలాకియా ఈద్గా మైదానం సమీపంలో గురువారం ఉదయం పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. దాడి సమయంలో ఈద్గా మైదానంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేస్తున్నారు.

07/07/2016 - 18:07

సిల్వర్‌స్టోన్‌: బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా తప్పించుకుని వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా శుక్రవారం ఓ ప్రెస్‌మీట్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యా శుక్రవారం ఫార్ములా-1 బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రి టీమ్‌ యజమానుల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. ఫోర్స్‌ ఇండియా బాస్‌ అయిన మాల్యా ఇతర టీం యజమానులతో కలిసి మాట్లాడనున్నారు.

07/07/2016 - 15:44

ఢాకా : కిషోర్‌గంజ్‌ ఈద్గా మైదానం సమీపంలో గురువారం రంజాన్ పర్వదినం రోజున‌ ఉగ్రవాదులు తెగ‌బ‌డ‌డం హేయ‌మైన చ‌ర్య అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. ఈద్గా మైదానం సమీపంలో రెండు లక్షల మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు పాల్పడిన దాడిలో ఒక పోలీసు సహా నలుగురు మృతి చెందారు.

07/07/2016 - 11:50

ఢాకా: ఉగ్రమూకలు మరోసారి ఢాకాలో విరుచుకుపడ్డారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. బంగ్లాదేశ్‌లో ఈద్గా వద్ద గురువారం ఉదయం రంజాన్‌ ప్రార్థనల సమయంలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెంగా, మరో ఐదుగురు గాయపడినట్టు కిషోర్‌గంజ్ కంట్రోల్ రూమ్ పోలీసు అధికారి మహ్‌బూబ్ తెలిపారు. కిశోర్ గంజ్ శివారులోని షోలాకియా ఈద్గా ఎంట్రన్స్ వద్ద ఈ బాంబులు పేలాయి.

Pages