S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/14/2017 - 02:14

ఇస్లామాబాద్, ఏప్రిల్ 13: భారతీయుడయిన కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్ష విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని పాకిస్తాన్‌కు చెందిన ఉన్నత స్థాయి మిలిటరీ జనరల్‌లు గురువారం నిర్ణయించారు.

04/12/2017 - 04:07

ఐరాస, ఏప్రిల్ 11: ‘మహిళల రెక్కలను పురుషులు కట్టిపడేయొద్దు. వారిని స్వేచ్ఛగా ఎగరనిద్దాం’ అంటూ బాలల హక్కుల ఉద్యమ కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ పిలుపునిచ్చారు. బాలల విద్య కోసం అవిరళ పోరాటం చేస్తున్న మలాలాకు ఐరాస శాంతిదూత బహుమతి ప్రకటించింది. ఆమె ఈ అవార్డులు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు.

04/12/2017 - 02:04

ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: పాకిస్తాన్ అన్ని దేశాలతోను ముఖ్యంగా తన పొరుగు దఏశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం అన్నారు. భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను ఉరి తీయాలని పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమైన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

04/11/2017 - 01:48

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: గూఢచర్యం, కుట్రపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న అభియోగాలపై భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన భారత్ పాక్ సైనిక కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. జాధవ్‌ను ఉరితీస్తే అది ఓ పథకం ప్రకారం జరుగుతున్న హత్యే అవుతుందంటూ నిప్పులు చెరిగింది.

04/10/2017 - 00:32

కైరో, ఏప్రిల్ 9: ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాలలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ఆదివారం జరిపిన జంట పేలుళ్లలో 45 మంది మృతి చెందారు. సుమారు 119 మంది గాయపడ్డారు. క్రైస్తవులకు ‘పామ్ సండే’ పవిత్ర దినం కావడంతో ప్రార్థనలు చేయడానికి పెద్ద ఎత్తున చర్చీలకు వచ్చిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు.

04/09/2017 - 04:22

వాషింగ్టన్/ పామ్ బీచ్, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తమ తొలి సమావేశంలో ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి వంద రోజుల ప్రణాళికను ప్రకటించారు.

04/09/2017 - 03:35

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 8: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయి అతి పిన్న వయస్కురాలయిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి దూత (మెసెంజర్ ఆఫ్ పీస్)గా అవతరించడానికి రంగం సిద్ధమయింది. ఐరాస ప్రదానం చేసే ఈ అత్యున్నత గౌరవానికి మలాలాను ఆ సంస్థ సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెర్స్ ఎంపిక చేశారు. మలాలాను ఐరాస శాంతి దూతగా ప్రకటించే కార్యక్రమం వచ్చే వారం ఇక్కడి ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది.

04/09/2017 - 01:35

వాషింగ్టన్, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనాయంత్రాంగంలోని రెండు కీలక పోస్టులలో ఇద్దరు భారత సంతతికి చెందిన అమెరికన్లను నియమించారు. కాపీరైట్, పేటెంట్స్, ట్రేడ్‌మార్క్‌లకు సంబంధించి అమెరికా చట్టాల అమలును సమన్వయం చేసే పోస్టులలో వీరిని నియమించారు. 75 శాతం ఫెడరల్ నియంత్రణలను తొలగించాలనే ట్రంప్ ప్రణాళిక అమలును కూడా వీరు పర్యవేక్షిస్తారు.

04/09/2017 - 01:34

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 8: రసాయన దాడులు నిర్వహిస్తోందని సిరియాపై ఆరోపణలు చేస్తున్న అమెరికా ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ చర్యలను నిరోధించటానికి త్వరలోనే ఆంక్షలను ప్రకటించనున్నట్లు ట్రంప్ అధికార వర్గాలు తెలిపాయి.

04/09/2017 - 01:34

యాంగాన్ (మయన్మార్), ఏప్రిల్ 8: మయన్మార్‌లో ఒక పడవ మరో పడవను ఢీకొనడంతో 20 మంది జల సమాధి అయ్యారు. మృతుల్లో 16 మంది మహిళలు, మరో నలుగురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు.

Pages