S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/08/2017 - 07:36

మాస్కో/బీరూట్, ఏప్రిల్ 7: సిరియా వైమానిక స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అమెరికా దాడి తర్వాత సిరియా గగనతల రక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయనున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, తమ వైమానిక స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులను సిరియాలోని బషర్ అసద్ ప్రభుత్వం సైతం తీవ్రంగా ఖండిస్తూ, ఇది అమెరికా తమ దేశంపై జరిపిన దురాక్రమణగా అభివర్ణించింది.

04/08/2017 - 05:31

వాషింగ్టన్, ఏప్రిల్ 7: సిరియాలో మూడు రోజుల క్రితం అమాయక పౌరులపై జరిగిన రసాయనిక దాడికి ప్రతీకారంగా అమెరికా శుక్రవారం తెల్లవారుజామున అక్కడి వైమానిక స్థావరంపై భారీ ఎత్తున క్షిపణులతో దాడి చేసింది. సిరియాలోని బషర్ అల్-అసద్ ప్రభుత్వమే ఈ రసాయనిక దాడికి పాల్పడిందని బలంగా నమ్ముతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ నరమేధాన్ని ఆపడం కోసం ఈ పరిమిత సైనిక చర్యకు ఆదేశించినట్లు అమెరికా అధికారులు చెప్పారు.

04/05/2017 - 02:48

షేఖున్, ఏప్రిల్ 4: సిరియాలో ప్రభుత్వం, తిరుగుబాటు వర్గాల మధ్య సాగుతున్న పోరు సామాన్య ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిపిన విషవాయువు దాడిలో పలువురు చిన్నారులు సహా 58 మంది చనిపోయినట్లు బ్రిటన్‌లోని సిరియా పౌరహక్కుల సంస్థ ఆరోపించింది.

04/04/2017 - 23:45

న్యూయార్క్, ఏప్రిల్ 4: అంతర్జాతీయ టెర్రరిస్టులను నిషేధించే విషయంలో వీటో అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాత్సారం చేసినంత మాత్రాన వారిపై చర్యలు తీసుకోవటంలో అడ్డుకోలేరని మంగళవారం అమెరికా స్పష్టం చేసింది.

04/04/2017 - 23:45

వాషింగ్టన్, ఏప్రిల్ 4: హెచ్1బి వీసాలను ఎట్టి పరిస్థితిలోనూ దుర్వినియోగం చేయరాదని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా స్థానిక ఉద్యోగులపట్ల ఏ రకమైన వివక్ష చూపించినా సహించేది లేదని స్పష్టం చేసింది.

04/04/2017 - 01:29

సెయింట్ పీటర్స్‌బర్గ్, ఏప్రిల్ 3: రష్యా రెండో ప్రధాన నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం పదిమంది మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఉగ్రదాడిని అనుమానిస్తున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే పేలుడుకు గల అన్ని కారణాలనూ దర్యాప్తు అధికారులు విశే్లషణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

04/04/2017 - 00:45

లండన్, ఏప్రిల్ 3: బ్రిటన్‌లో ఒక హిందూ దేవాలయం, గురుద్వారాలలో రక్షణ కోసం ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. నైరుతి ఇగ్లండ్‌లోని ఓ హిందూ దేవాలయం, గురుద్వారాలలో సిసిటివిలు, రక్షణ కోసం లైట్లను, గేట్, ఫెన్సింగ్ కోసం 9,319.20పౌండ్లను కేటాయిస్తున్నట్లు యూకే హోం శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది ఏ దేవాలయం అన్నది వెల్లడించలేదు.

04/04/2017 - 00:45

దుబాయ్, ఏప్రిల్ 3: భారత్‌కు చెందిన ఒక చిన్నపాటి నౌకను సోమాలియా దొంగలు హైజాక్ చేసి అందులోని 11 మంది నావికులను బందీలుగా చేశారు. దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌక యెమన్‌లోని సొకట్రా దీవి వద్ద హైజాక్‌కు గురైనట్లు గుర్తించారు. హైజాక్ చేసిన నౌకను ఉత్తర సోమాలియా ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ నౌక దుబాయ్ నుంచి సోమాలియాలోని బొసాసోకు వెళుతున్నట్లు సమాచారం.

04/04/2017 - 00:44

వాషింగ్టన్, ఏప్రిల్ 3: పారిస్‌లో కుదిరిన చరిత్రాత్మక వాతావరణ ఒప్పందం అమెరికాకు ఏమాత్రం మంచిది కాదని, భారత్, చైనా లాంటి దేశాలకు అనుకూలమైన ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగించేదిగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.

04/03/2017 - 02:24

మొకోవా, ఏప్రిల్ 2: కొలంబియాలో శుక్రవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు మొకోవా పట్టణంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య గంట గంటకు పెరిగి పోతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 250కి పైగా దాటిపోగా, శిథిలాల కింద పెద్ద సంఖ్యలో శవాలు బైటపడుతుండడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా వేలల్లోకి చేరుకుంటోంది.

Pages