S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/30/2016 - 07:55

ఇస్తాంబుల్, జూన్ 29: టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందారు. 239 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది విదేశీయులని నగర గవర్నర్ వెల్లడించారు. వరుసగా మూడు ఆత్మాహుతి బాంబు పేలుళ్లు సంభవించినట్టు టర్కీ అధికారి ఒకరు తెలిపారు.

06/29/2016 - 17:50

దిల్లీ: భవిష్యత్తులో కూడా భారత్‌తో కలిసి ఉగ్రవాదంపై అమెరికా పోరాటం జరుపుతుందని భారత్‌లో అమెరికా దౌత్యాధికారి రిచర్డ్‌ వర్మ పేర్కొన్నారు. ఇస్తాంబుల్‌ దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు తుపాకులు, బాంబుల కన్నా ఎంతో శక్తిమంతమైనవన్నారు.

06/29/2016 - 17:45

టర్కీ: ఇస్తాంబుల్‌ విమానాశ్రయ దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో 13 మంది విదేశీయులున్నారు. 239 మంది గాయపడినట్లు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని టర్కీ ఆరోపిస్తోంది.

06/29/2016 - 17:36

వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ అమెరికాలో ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్‌ ఇమ్మిగ్రంట్స్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది 42 మందిని ఈ అవార్డుకు ఎంపికచేయగా, అందులో పిచాయ్‌ సహా నలుగురు భారత-అమెరికన్లు ఉన్నారు. పిచాయ్‌తో పాటు హరి శ్రీనివాసన్‌, విక్రమ్‌ మల్హోత్రా, భారతీ ముఖర్జీ జూన్‌ 30న న్యూయార్క్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకోనున్నారు.

06/29/2016 - 12:26

దిల్లీ: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 36 మంది మరణించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో తీవ్ర సంతాపం తెలిపారు. సంఘటనలో గాయపడిన 150 మంది త్వరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఐసిసి ఉగ్రవాద సంస్థ పనే అని టర్కీ ప్రధాని అన్నారు.

06/29/2016 - 07:45

లండన్, జూన్ 28:ఐరోపా యూనియన్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ప్రధాని కామెరాన్ స్థానే ఎవరికి బ్రిటీష్ సారథ్యం అప్పగించాలన్న దానిపై తీవ్రస్థాయిలోనే అధికార కన్సర్వేటివ్ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బ్రిటీష్ ప్రధాని పదవికి గట్టిగా పోటీ పడుతున్న వారిలో లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ బుధవారం మొదలై గురువారమే ముగుస్తుంది.

06/29/2016 - 01:03

లండన్, జూన్ 28: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలిగాక ఐరోపా కూటమి ఇంగ్లీషును కూడా తమ అధికారిక కార్యకలాపాలనుంచి తప్పించేయనున్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లోని విద్యా సంస్థలతోపాటు ఇతర సంస్థల్లో ఇంగ్లీషును ప్రధాన భాషగా వాడుతున్నారు.

06/29/2016 - 01:00

లండన్, జూన్ 28: ‘నేనింకా బతికే ఉన్నాను’ అంటూ బ్రిటన్ రాణి ఎలిజబెత్ అన్నారు. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటిష్ ప్రజలు ఓటేసిన అనంతరం తొలిసారి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు తానింకా బతికే ఉన్నానని రాణి చెప్పారు.

06/28/2016 - 15:37

కౌలాలంపూర్‌: కౌలాలంపూర్‌ శివార్లలోని మోవిదా రెస్టారెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన గ్రెనేడ్‌ పేలడంతో ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు యూరోఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ చూస్తుండగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు గ్రెనేడ్‌ విసిరినట్టు పోలీసులు తెలిపారు.

06/28/2016 - 12:53

కొలంబియా: కొలంబియాలో మిలిటరీ హెలికాప్టర్‌ కూలి 17 మంది అధికారులు మృతి చెందారు. ఎమ్‌ఐ-17 ఆర్మీ హెలికాప్టర్‌ ఆదివారం అదృశ్యమైంది. కొలంబియాలో కూలిపోయిందని అధికారులు మంగళవారం వెల్లడించారు. హెలికాప్టర్‌లో ఉన్న వారంతా మిలిటరీ అధికారులేనని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్‌ కూలి ఉండొచ్చని భావిస్తున్నారు.

Pages