S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/07/2016 - 11:50

ఢాకా: ఉగ్రమూకలు మరోసారి ఢాకాలో విరుచుకుపడ్డారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. బంగ్లాదేశ్‌లో ఈద్గా వద్ద గురువారం ఉదయం రంజాన్‌ ప్రార్థనల సమయంలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెంగా, మరో ఐదుగురు గాయపడినట్టు కిషోర్‌గంజ్ కంట్రోల్ రూమ్ పోలీసు అధికారి మహ్‌బూబ్ తెలిపారు. కిశోర్ గంజ్ శివారులోని షోలాకియా ఈద్గా ఎంట్రన్స్ వద్ద ఈ బాంబులు పేలాయి.

07/07/2016 - 11:47

దిల్లీ: గురువారం ఉదయం మొజాంబిక్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. గత రాత్రి దిల్లీ నుంచి బయలుదేరిన మోదీ ఈరోజు మొజాంబిక్‌ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు మోదీ మొజాంబిక్‌, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్‌లు, తీరప్రాంత రక్షణ, వాణిజ్యం, పర్యటనలో భాగంగా ఆయా దేశాల అధినేతలతో చర్చలు జరుపుతారు.

07/07/2016 - 07:23

లండన్, జూలై 6: తప్పుడు నిఘా సమాచారం ఆధారంగానే అప్పట్లో అమెరికాతో కలిసి బ్రిటన్ ఇరాక్‌పై యుద్ధం చేసిందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి.

07/07/2016 - 07:21

ఢాకా, జూలై 6: ప్రపంచ వ్యాప్తంగా షరియా చట్టాన్ని అమలుచేసే వరకూ దాడులు జరుపుతూనే ఉంటామని, బంగ్లాదేశ్‌లో ఇటీవల తాము జరిపిన ఊచకోత నమూనా మాత్రమేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. బంగ్లాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంతకుమించిన తీవ్రతతోనే భయానక దాడులు జరుపుతామని ఓ వీడియో సందేశంలో పేర్కొంది.

07/06/2016 - 18:16

అటారీ: భారత్‌-పాక్‌ సరిహద్దులోని సైనికులు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అటారీ-వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ జేఎస్‌ ఒబెరాయ్‌, పాకిస్థాన్‌ రేంజర్స్‌ వింగ్‌ కమాండర్‌ బిలాల్‌లు సైనికుల సమక్షంలో మిఠాయిలు పంచుకున్నారు.

07/06/2016 - 18:14

దుబాయి: ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ)లో చేరవద్దని అడ్డుకున్నందుకు- కవల సోదరులు కన్నతల్లినే చంపేశారు రియాద్‌కు చెందిన ఖలీద్‌, సాహెల్‌ అల్‌ ఒరైనీ కవలసోదరులు. వీరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదానికి ప్రభావితమై అందులో చేరేందుకు సిరియా వెళ్లబోయారు. వీరిని అడ్డుకోవడంతో తల్లి హలియా, తండ్రి, సోదరుడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో హలియా మృతిచెందగా, తండ్రి, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

07/06/2016 - 17:59

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చి, రాజ్యాంగ సవరణలు చేస్తే- అధిక సంఖ్యలో ఈవీఎంలు, తాత్కాలిక సిబ్బంది వంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

07/06/2016 - 17:56

డమాస్కస్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 6 వేకువజామున ఒంటి గంట నుంచి జూలై 8 అర్ధరాత్రి వరకు 72 గంటలపాటు కాల్పులు జరపకూడదని సిరియా ఆర్మీ నిర్ణయించుకుంది. రంజాన్ నేపథ్యంలో ఆయుధాలకు ముస్లింలు దూరంగా ఉండాలని ఆర్మీ భావించిందని ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై కాల్పులకు ఈ నిషేధ ఆజ్ఞలు వర్తిస్తాయా అనే అంశంపై స్పష్టత లేదు.

07/06/2016 - 11:37

ఇస్తాంబుల్‌: టర్కీలో బుధవారం మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఏడుగురు అధికారులు మృతిచెందారు. హెలికాప్టర్‌ గైర్‌సన్‌ ప్రావిన్స్‌కి రాగానే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మిగిలినవారు తీవ్రగాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/06/2016 - 11:35

యెమెన్‌: ఎడెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో బుధవారం కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మిలిటరీ బేస్‌ను టార్గెట్‌ చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

Pages