S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/20/2017 - 00:42

హోనోలులు, మార్చి 19: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన సవరించిన ప్రయాణ నిషేధపుటుత్తర్వులను నిలిపివేస్తూ జారీ చేసిన ఆదేశాలపై వివరణ ఇవ్వాలని హవాయి డిస్ట్రిక్ట్ జడ్జిని అమెరికా ప్రభుత్వం కోరింది.

03/19/2017 - 02:57

వాషింగ్టన్, మార్చి 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో రక్షణ లేదా? అవుననే అంటున్నారు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డాన్ బొంగినో. ట్రంప్ వైట్‌హౌస్‌లో సురక్షితంగా లేరని, వైట్‌హౌస్‌పై ఉగ్రవాద దాడి జరిగితే, ఆ దాడి నుంచి ఆయనను సీక్రెట్ సర్వీస్ కాపాడలేదని ఇంతకుముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జి డబ్ల్యు బుష్‌కు రక్షణ బాధ్యతలు నిర్వహించిన డాన్ పేర్కొన్నారు.

03/19/2017 - 02:53

హ్యూస్టన్, మార్చి 18: అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ప్రజాపనులు, ఇంజనీరింగ్ వ్యవహారాల విభాగానికి ఇండో-అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ అధిపతిగా వ్యవహరించనున్నారు. హ్యూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయనను ఈ పదవిలో నియమించారు. విరివిగా రాజకీయ విరాళాలు ఇచ్చే దాతగా పేరు పొందిన కరుణ్ శ్రీరామ (53) పదవీ విరమణ పొందుతున్న హ్యూస్టన్ నగర పిడబ్ల్యుఇ చీఫ్ డేల్ రుడిక్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు.

03/19/2017 - 01:30

లూధియానా, మార్చి 18: రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయి నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన సంపూరన్ సింగ్ అనే లూధియానా రైతు న్యాయ పోరాటంలో చివరికి అపూర్వ విజయం సాధించాడు. లూధియానా-చండీగఢ్ మధ్య రైల్వే లైన్‌కు సంబంధించిన ఈ వ్యవహారం ఈ వారం అనూహ్య మలుపు తిరగడంతో ఆ రైతు ఏకంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలునే నష్టపరిహారంగా గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

03/18/2017 - 04:49

వాషింగ్టన్, మార్చి 17: అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో మార్చి 16ను ఇకనుంచి ‘ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే’గా పరిగణించనున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జాతి విద్వేషంతో శే్వత జాతీయుడు జరిపిన కాల్పుల్లో మరణించిన భారతీయుడు శ్రీనివాస్ కూచిభొట్ల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాన్సాస్ గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ ప్రకటించారు.

03/18/2017 - 02:40

కరాచీ, మార్చి 17: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైన హోలీ వేడుకల్లో ఓ బాలిక గాయత్రి మంత్రం పఠించి అబ్బురపరిచింది. బుధవారం నాడు కరాచీలో ఉంటున్న హిందువులు హోలీ వేడుకలు నిర్వహించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని పాకిస్తాన్‌లో మైనారిటీల హక్కుల పరిక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

03/18/2017 - 02:37

ఫ్రీటౌన్, మార్చి 17: పశ్చిమ ఆఫ్రికాలోని సియారా లియోన్ దేశంలో 706 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. వజ్రాలు అధికంగా లభించే కోనో ప్రాంతంలో క్రిస్టియన్ పాస్టర్‌గా పని చేస్తున్న ఇమానుయేల్ మోమోహ్ అనే అతనికి ఈ వజ్రం లభించింది. ఇమానుయేల్ ఈ వజ్రాన్ని దేశాధ్యక్షుడు డాక్టర్ ఎర్నెస్ట్ బాయ్ కొరోమోనోకు బహూకరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.

03/18/2017 - 02:07

బీజింగ్, మార్చి 17: భారత్ శక్తివంతమైన అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని అభివృద్ధి చేస్తుండటంతో అందుకు ప్రతిగా చైనా తనకు ఎల్లవేళలా మిత్రదేశమైన పాకిస్తాన్‌తో రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌తో కలిసి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

03/18/2017 - 02:05

బీరూట్, మార్చి 17:ఉత్తర సిరియాలోని అలెప్పో రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన వైమానిక దాడుల్లో 42మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది పౌరులేనని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. గుర్తు తెలియని కొన్ని యుద్ధ విమానాలే ఈ దాడులకు పాల్పడ్డాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అధినేత రామి అబ్దెల్ రహ్‌మాన్ స్పష్టం చేశారు.

03/18/2017 - 00:19

ఐక్యరాజ్య సమితి, మార్చి 17: ఐక్యరాజ్య సమితికి అమెరికా ఇచ్చే నిధుల్లో అర్ధంతరంగా కోత పెట్టవద్దని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ, ఐరాసకు అత్యధికంగా నిధులిచ్చే అమెరికా నిధులను తగ్గించినట్లయితే అది ఐరాస దీర్ఘకాలిక సంస్కరణ కృషిపై ప్రభావం చూపిస్తుందన్నారు.

Pages