S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/13/2017 - 02:33

న్యూయార్క్/వాషింగ్టన్, మార్చి 12: అమెరికాలో ఉన్నత స్థాయి ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు ప్రీత్ భరారాను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా మంచి పేరు తెచ్చుకున్న భరారా (48) తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో ఆయనపై ట్రంప్ సర్కారు వేటు వేసింది.

03/12/2017 - 08:52

వాషింగ్టన్, మార్చి 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాదించిన విజయాలను నరేంద్ర మోదీకి మద్దతుగా ఓటర్లు ఇచ్చిన తీర్పుగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ విశే్లషకుడు అభివర్ణించారు. అంతేకాదు, ప్రధానమంత్రిని ఓటర్లు చేతల మనిషిగా చూస్తున్నారని కూడా ఆయన అన్నారు.

03/11/2017 - 01:44

సీటిల్, మార్చి 10:ఆరు ముస్లిం దేశాలకు చెందిన వలసదారులు, శరణార్థులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. 50వ రాష్ట్రంగా ఉన్న హవాయ్ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ తొలి అడుగు వేస్తే తాజాగా వాషింగ్టన్ రాష్ట్రం కూడా అదే బాటలో ముందుకొచ్చింది.

03/10/2017 - 23:44

ఇస్లామాబాద్, మార్చి 10: పాకిస్తాన్ పార్లమెంట్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గమైన హిందువుల వివాహాలను క్రమబద్దీకరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ఓ మైలురాయిగా చెప్పవచ్చు.

03/11/2017 - 03:13

లండన్, మార్చి 10: సాంకేతిక పురోగమనంలో చోటు చేసుకొంటున్న వేగం మానవాళిని ఎలా నాశనం చేయనుందో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకిన్స్ వివరించారు. అంతేకాదు సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా ఆయన తెలియజేశారు.

03/10/2017 - 01:47

టొరాంటో, మార్చి 9: కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళను అమెరికాలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు. 39 ఏళ్ల మన్‌ప్రీత్ కూనూర్ కెనడా పౌరురాలు. మాంట్రియల్‌లో ఉంటున్న ఆమె అమెరికాలోని వెర్మెంటో వెళాల్లనుకుని గత ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఈ రెండు ప్రదేశాలు కూడా కెనడా-అమెరికా సరిహద్దులోనే ఉన్నాయి.

03/09/2017 - 08:34

కువైట్ సిటీ, మార్చి 8: కువైట్‌లో పురాతన సిల్క్ రోడ్డు వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించేందుకు దేశంలోని మారుమూల సుబియా ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం దాదాపు 36 కిలోమీటర్ల(22 మైళ్ల) పొడవైన వంతెనను నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

03/09/2017 - 08:17

న్యూయార్క్, మార్చి 8: భారత్‌పై ఉగ్రదాడులకు కుట్ర పన్నాడన్న అభియోగంపై 42 ఏళ్ల ఎన్నారైకు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమం సందర్భంగా సహాయ, సహకారాలు అందించినట్టు బల్వీందర్‌సింగ్‌పై అభియోగం. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లారే హీక్స్ 180 నెలలు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారని అటార్నీ డేనియల్ బోగ్డెన్ వెల్లడించారు.

03/09/2017 - 08:16

న్యూయార్క్, మార్చి 8: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం తాత్కాలికంగా ‘వీటో’ అధికారం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రతిపాదించింది. భారత్‌తోపాటు మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్న జి4 కూటమిలోని బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు కూడా ఈ ప్రతిపాదనను ఓకే చేశాయి. ‘్భద్రతామండలిలో వీటో అధికారం చాలా ముఖ్యమైన అంశం.

03/09/2017 - 08:16

వాషింగ్టన్, మార్చి 8: గత నెల తమ రాష్ట్రంలో భారతీయులపై జరిగిన దారుణ హింసాత్మక చర్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అమెరికాలోని కాన్సాస్ రాష్ట్ర గవర్నర్ శాన్ బ్రౌన్‌బ్యాక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో విద్వేషానికి, అసహనానికి తావు లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

Pages