S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/24/2017 - 02:43

బీజింగ్, ఫిబ్రవరి 23: భారత్‌తో జరిగిన వ్యూహాత్మక చర్చలు ద్వైపాక్షిక సంబంధాలపై చెప్పుకోదగ్గ సానుకూల ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని, ఈ చర్చల్లో అనేక అంశాలపై విస్తృతస్థాయిలో అంగీకరాలు కుదిరాయని చైనా పేర్కొంది.

02/24/2017 - 01:49

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: రోదసిలో జీవం అనే్వషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణ జరిగింది. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడిని పోలిన ఒక నక్షత్రం చుట్టూ భూ పరిమాణం కలిగిన ఏడు గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు.

02/23/2017 - 08:20

బీజింగ్, ఫిబ్రవరి 22: జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై ఐరాస నిషేధానికి బలమైన ఆధారాలు కావాలంటూ చైనా చేస్తున్న డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. అజార్ పాల్పడ్డ ఉగ్రవాద కృత్యాలే అతడిపై నిషేధాన్ని విధించాలన్న డిమాండ్‌కు ఆధారాలని, వీటిని రుజువు చేయాల్సిన బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది.

02/23/2017 - 01:47

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: దేశంలో సరయిన పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న దాదాపు కోటీ పది లక్షల మందిని పంపించి వేయడానికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికల కారణంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న దాదాపు 3 లక్షల మంది భారత్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

02/22/2017 - 03:04

మెల్బోర్న్, ఫిబ్రవరి 21: ఇంజన్ వైఫల్యం కారణంగా మెల్బోర్న్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి తేలికపాటి విమానం దూసుకువచ్చి బీభత్సం సృష్టించింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియా పైలట్ మరణించారు.

02/22/2017 - 02:58

లాహోర్, ఫిబ్రవరి 21: జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సరుూద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సరుూద్, అతడి అనుచరులకు చెందిన సంస్థల ఆయుధ లైసెన్సులను పంజాబ్ ప్రభుత్వం రద్దుచేసింది. జమాత్ ఉద్ దవా సంస్థను కట్టడి చేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు పంజాబ్ హోమ్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జమాత్ ఉద్ దవా (జెయుడి), ఫలా ఇ ఇన్సానియెత్ (ఎఫ్‌ఐఎఫ్) సంస్థలపై ఆంక్షలు విధించినట్టు తెలిపింది.

02/22/2017 - 02:49

లండన్, ఫిబ్రవరి 21: బ్రిటన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న వేలాది మంది ఆందోళనకారులు మంగళవారం బ్రిటన్ పార్లమెంటు వెలుపల ప్రదర్శన నిర్వహించారు.

02/21/2017 - 02:36

న్యూయార్క్, ఫిబ్రవరి 20: వలసలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వివిధ మతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఆదివారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద కదం తొక్కారు. మేము కూడా ముస్లింలమే అంటూ వారు ముస్లిం మతస్తులకు సంఘీభావాన్ని ప్రకటించారు.

02/21/2017 - 02:23

వాషింగ్టన్, ఫిబ్రవరి 20: జర్మన్ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణాంతక ఆదేశాలను జారీచేసేందుకు ఉపయోగించిన ఎర్ర రంగు వ్యక్తిగత టెలిఫోన్ ఏకంగా 2.43 లక్షల అమెరికా డాలర్లకు అమ్ముడుపోయింది. అమెరికాలో దీనిని వేలం వేశారు. నిర్ణయించిన కనీస ధరకంటే ఇది రెట్టింపునకుపైగా ధరకు అమ్ముడు పోవడం విశేషం. అయితే ఆ కొనుగోలుదారుడు ఎవరో వేలం నిర్వాహకులు వెల్లడించలేదు.

02/20/2017 - 08:31

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచి వివాదాస్పద నిర్ణయాలతో స్వదేశంలోను, ఇతర దేశాల్లోను విమర్శలను ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీడియా తప్పుడు కథనాల కారణంగానే తన ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతోందంటూ మరోసారి మండిపడ్డారు.

Pages