S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/02/2017 - 03:16

లండన్, జనవరి 1: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలకు తాను ఎంతమాత్రం కారణం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ నొక్కి చెప్పారు. ‘నాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న వారికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. నన్ను ఇలా బతకనివ్వండని. నా వల్లే సమాజ్‌వాదీ పార్టీ కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయని అనవసరంగా ఆరోపిస్తున్నారు. అందువల్ల ములాయం సింగ్!

01/02/2017 - 01:27

ఇస్తాంబుల్, జనవరి 1: నూతన సంవత్సర ఉత్సవాలు టర్కీలో రక్తసిక్తమయ్యాయి. దేశంలో ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. శాంటాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన ఆ దుండగుడు ఓ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఇద్దరు భారతీయులు సహా మొత్తం 39 మందిని హతమార్చాడు. ఈ దాడిలో 70 మందికి పైగా గాయపడ్డారు.

01/02/2017 - 00:56

జకార్తా, జనవరి 1: ఇండోనేసియా రాజధాని జకార్తా సమీపంలో ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో మంటలు చెలరేగడంతో కనీసం 23 మంది చనిపోగా, మరో 17 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం సుమారు 200 మంది ప్రయాణికులతో ఈ పడవ జకార్తానుంచి పర్యాటక కేంద్రమైన టిడుంగ్ దీవికి వెళ్తుండగా మంటలు చెలరేగాయని జాతీయ విపత్తుల నిర్వహణ ఏజన్సీ తెలిపింది.

01/02/2017 - 00:53

ఐక్యరాజ్య సమితి, జనవరి 1: శాంతిని తొలి ప్రాధాన్యతగా చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పోర్చుగీస్ మాజీ ప్రధాని, ఐరాస శరణార్థి వ్యవహారాల చీఫ్‌గా కూడా పని చేసిన గుటెరస్ ఆదివారం బాన్ కి-మూన్‌నుంచి ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

01/01/2017 - 03:43

ఇస్లామాబాద్, డిసెంబర్ 31: భారత్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో అమెరికా మద్దతును పాక్ కోరింది. కాగా, ఈ సమస్యను భారత్, పాక్ రెండూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పిలుపునిచ్చారని శనివారం పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

01/01/2017 - 03:40

వాషింగ్టన్, డిసెంబర్ 31: అమెరికా, రష్యాల మధ్య హ్యాకింగ్ అంశంపై తాజాగా చెలరేగుతున్న సంఘర్షణ వాతావరణం త్వరలోనే శే్వతసౌధాన్ని అధిష్ఠించనున్న డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో రసవత్తరంగా మారింది.

12/31/2016 - 02:29

వాషింగ్టన్/మాస్కో, డిసెంబర్ 30: అధ్యక్ష ఎన్నికల సమయంలో హ్యాకింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే 35మంది రష్యా ఏజెంట్లను బహిష్కరించింది. దీనికి ప్రతిగా అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించాలని రష్యా భావించినా చివరి క్షణంలో తన నిర్ణయం మార్చుకుంది.

12/29/2016 - 07:44

లాస్ ఏంజిల్స్, డిసెంబర్ 28: ప్రముఖ హాలీవుడ్ నటి, స్టార్‌వార్స్ సిరీస్ ప్రినె్సస్ లియా క్యారీ ఫిషర్ కన్నుమూశారు. కారెక్టర్ నటిగా అనేక చిత్రాల్లో తనదైన అద్భుత నటనను ప్రదర్శించిన కారీ మంగళవారం చనిపోయారని ఆమె కూతురు బిల్లీ లార్డ్ తెలిపారు.

12/29/2016 - 04:11

వాషింగ్టన్, డిసెంబర్ 28: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి రూపొందించిన ఓ ముసాయిదా ప్రతిపాదన ఆ కూటమిలో భారత్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేస్తోందని, అయితే పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థ ఒకటి అంటోంది.

12/26/2016 - 01:14

మాస్కో, డిసెంబర్ 25: రష్యాకు చెందిన మిలిటరీ విమానం ఒకటి ఆదివారం నల్లసముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 92 మంది ప్రయాణికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సిరియాలోని లటాకియా ప్రావిన్స్ వెళ్లేందుకు సోచీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన టియు-154 విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Pages