S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/25/2016 - 23:57

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: క్రైస్తవుల పవిత్రమైన పండుగ క్రిస్మస్‌ను పురస్కరించుకొని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలో చేసిన ప్రసంగంలో ఉగ్రవాద బాధితుల కుటుంబాలను గురించి ప్రస్తావించారు.

12/25/2016 - 03:25

ఇస్లామాబాద్, డిసెంబర్ 24: పాకిస్తాన్ అధ్యక్షుడు మెమ్నూన్ హుస్సేన్‌పై ఓ చిత్రమైన కేసు దాఖలైంది. దేశాధ్యక్షుడు తన ప్రసంగాన్ని కాపీ కొట్టారంటూ 11 ఏళ్ల బాలుడు కోర్టును ఆశ్రయించాడు. ఆరో తరగతి విద్యార్థి మహ్మద్ సబీల్ హైదర్ తరఫున అతడి తండ్రి నసీం అబ్బాస్ నజీర్ ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు.

12/25/2016 - 03:23

వాషింగ్టన్, డిసెంబర్ 24: అమెరికా వచ్చే సంవత్సరానికి రూపొందించిన రక్షణ బడ్జెట్ భారత్‌తో భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. 618 బిలియన్ డాలర్లతో కూడిన అమెరికా రక్షణ బడ్జెట్ బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం సంతకం చేశారు. ఈ జాతీయ రక్షణ ధ్రువీకరణ చట్టం (ఎన్‌డిఎఎ) 2017లో పాకిస్తాన్‌కు చేసే ఆర్థిక సాయంపై దాదాపు సగం నిధులకు అమెరికా నాలుగు షరతులు విధించింది.

12/25/2016 - 02:58

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులు శాంటా టోపీలను ధరించి
ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర చర్చి వద్ద ప్రార్థనల కోసం బారులు తీరిన దృశ్యం

12/24/2016 - 04:29

వలెట్టా, డిసెంబర్ 23: కొన్ని గంటల పాటు తీవ్ర స్థాయిలో ఉత్కంఠ రేకెత్తించిన లిబియా వాణిజ్య విమానం హైజాక్ ఉదంతం చివరికి సుఖాంతం అయింది.

12/24/2016 - 02:48

వాషింగ్టన్, డిసెంబర్ 23: అణ్వస్త్రాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఈ విషయంలో అమెరికా విధానం తీవ్రంగా మారబోతోందన్న సంకేతాలను సూచిస్తోంది. అణ్వస్త్రాలను తగ్గిస్తూ చివరకు నిర్మూలించాలన్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా పాలనా యంత్రాంగం అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా ట్రంప్ వైఖరి ఉన్నట్లు ఈ ట్వీట్ వెల్లడిస్తోంది.

12/22/2016 - 07:43

టుట్లెపెక్, డిసెంబర్ 21: మెక్సికో సిటీ శివార్లలోని టుట్లెపెక్‌లో దేశంలోనే అతిపెద్ద బాణాసంచా మార్కెట్‌లో సోమవారం జరిగిన భారీ పేలుడులో కనీసం 29 మంది చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకోసం బాణాసంచా కొనుగోలు చేయడానికి పెద్దసంఖ్యలో జనం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఈ పేలుడు సంభవించింది.

12/22/2016 - 07:40

ఇస్లామాబాద్, డిసెంబర్ 21: భారతదేశం పాకిస్తాన్ పట్ల శత్రుత్వానికి స్వస్తిచెప్పి వందలాది కోట్ల డాలర్ల వ్యయంతో చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో చేరడంద్వారా తమతో కలిసి దాని ప్రయోజనాలను పొందాలని పాకిస్తాన్‌కు చెందిన ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పిలుపునిచ్చారు.

12/21/2016 - 02:28

వాషింగ్టన్, డిసెంబర్ 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ధ్రువీకృతమైంది. అత్యంత కీలకమైన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆయన సంపాదించుగోలిగారు. రిపబ్లికన్ సభ్యులను రెచ్చగొట్టి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

12/21/2016 - 02:20

బెర్లిన్, డిసెంబర్ 20: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేయడానికి మార్కెట్‌కు వచ్చిన వారిని మృత్యువు ఓ ట్రక్కు రూపంలో కబళించింది. నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లోకి ఓ ట్రక్కు దూసుకు రావడంతో కనీసం 12 మంది చనిపోగా, మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Pages