S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/05/2016 - 01:07

హవానా, డిసెంబర్ 4: విప్లవ యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన అంతిమ యాత్ర ఆదివారం క్యూబాకు ఆగ్నేయంగా ఉన్న శాంటియాగో డి నగరంలోని శాంటా ఫిజెనియా స్మశాన వాటికలో క్యాస్ట్రో అంత్యక్రియలు జరిగాయి. గంట పాటు జరిగిన కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగిందని క్యూబా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

12/05/2016 - 00:39

ఇస్లామాబాద్, డిసెంబర్ 4: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరచాలనం చేశారు.

12/04/2016 - 05:10

జకార్తా, డిసెంబర్ 3: ఇండోనేసియా పోలీసు విమానం గల్లంతైంది. 16 మందితో వెళ్తున్న విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఇండోనేసియాలో ఇది చోటుచేసుకుంది. ఎం28 స్కైట్రక్ చిన్న విమానం శనివారం మధ్యాహ్నం 1.50 గంటల నుంచి ఎయిల్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)తో సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కూలిపోయి ఉంటుందన్న భయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

12/03/2016 - 03:31

వాషింగ్టన్, డిసెంబర్ 2: అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. మతదురభిమానం, దురభిప్రాయాలను తిప్పికొట్టి దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన ట్రంప్ కీలక రాష్టమ్రైన ఓహియో నుంచి తన తొలి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు.

12/03/2016 - 01:42

దుబాయి, డిసెంబర్ 2: ప్రపంచ వ్యాప్తంగా 55 వారసత్వ ప్రదేశాలు ప్రమాదపుఅంచున ఉన్నాయని ఐరాస సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ప్రపంచంలో 1,052 వారసత్వ ప్రాంతాలున్నాయి. వీటిలో 55 వారసత్వ సంపదలను ప్రమాదపుజాబితాలో చేర్చారు. వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు యునెస్కో చర్యలు చేపట్టింది. 2016 జూలై నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన యునెస్కో 40వ వార్షిక సమావేశంలో మాలి, ఉజ్‌బెకిస్తాన్‌లు వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.

12/02/2016 - 02:39

లండన్, డిసెంబర్ 1: అసలు మనం నివసిస్తున్న భూమి బరువెంతో తెలుసుకుంటే నిజంగా గుండె బరువెక్కిపోతుంది. కోటానుకోట్ల జంతు, వృక్ష జాతులు, లక్షలాది ఆకాశహర్మ్యాలు, భవనాలు, వంతెనలు, నిర్మాణాలు ఉన్న ఈ పుడమి బరువును అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం దాదాపుగా అంచనా వేయగలిగింది. దీని మొత్తం బరువు ఊహకైనా అందనంత రీతిలో 30 ట్రిలియన్ టన్నులపైనే ఉంటుందని లెక్కలు గట్టింది.

12/02/2016 - 02:39

వాషింగ్టన్, డిసెంబర్ 1: భారత్‌తో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ దేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కమిటీ తన నివేదికలో రక్షణ మంత్రికి, విదేశాంగ మంత్రికి సూచించింది.

11/30/2016 - 03:04

బొగోటా, నవంబర్ 29: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ఒకటి మంగళవారం కొలంబియాలోని పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో కనీసం 75 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.

11/30/2016 - 00:53

న్యూయార్క్, నవంబర్ 29: టైమ్ మ్యాగజైన్ ఏటా నిర్వహించే ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పాఠకుల పోల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా నాలుగో సంవత్సరం ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిపోనున్న బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పాటు నరేంద్రమోదీ అగ్రస్థానంలో ఉన్నారు.

11/28/2016 - 08:23

వాషింగ్టన్, నవంబర్ 27: అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయరాదని, ఆ ఫలితాలను ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలని ఆ ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. స్వింగ్ స్టేట్‌గా పరిగణించే విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలన్న నిర్ణయాన్ని ‘కుంభకోణం’గా ఆయన అభివర్ణించారు.

Pages