S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/27/2018 - 03:33

ఊహాన్, ఏప్రిల్ 26: 2014లో మహాత్ముని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన లాంఛనప్రాయ సమావేశం తర్వాత, ఈ ఇద్దరి నేతల మధ్య మళ్లీ రెండు రోజుల పాటు ఊహాన్ నగరంలో ముఖాముఖి జరుగనుంది.

04/27/2018 - 02:47

వాషింగ్టన్, ఏప్రిల్ 26: హెచ్1బీ వీసాల రద్దుచేయాలన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఇండో- అమెరిన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఉంది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు హెచ్ 4 వీసాతో ఉద్యోగం చేస్తుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడా విధానానికి ముగింపుపలకనున్నారు.

04/26/2018 - 04:19

లండన్, ఏప్రిల్ 25: ‘మీడియా స్వేచ్ఛ’కు సంబంధించి భారత్ మరో రెండు ర్యాంకులు దిగజారింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే ఈ పరిస్థితికి కారణమని ఓ సర్వే కథనం స్పష్టం చేస్తోంది. రిపోర్టర్లపై ‘్భతిక హింస’కు పాల్పడిన ఘటనల కారణంగా పత్రికా స్వేచ్ఛ జాబితాలో రెండుస్థానాలు దిగజారి 138వ స్థానంలో భారత్ నిలిచిందని ఆ సర్వే కథనంలో పేర్కొనడం గమనార్హం.

04/26/2018 - 04:18

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు నిధుల కొర త పెద్ద ఆటంకంగా మారిందని భారత్ పేర్కొంది. ఐరాస ప్రపంచ వ్యాప్తంగా చేపట్టే శాంతి పరిరక్షణ చర్యలకు అవసరమైన నిధుల్లో కనీసం ఒక్కశాతం కూడా కేటాయించలేని దుస్థితి నెలకొని ఉన్నదని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది.

04/26/2018 - 04:09

వాషింగ్టన్, ఏప్రిల్ 25: హెచ్-4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్లను ఉపసంహరించాలన్న ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనకు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఫేస్‌బుక్‌తో సహా అమెరికన్ ఐటీ పరిశ్రమ ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాలను జారీ చేస్తారు.

04/26/2018 - 02:11

ఉలాన్‌బాతర్, ఏప్రిల్ 25: ద్వైపాక్షిక వాణి జ్యం, ఆర్థిక సహకారం అందించుకోవాలని భారత్-మంగోలియా నిర్ణయించాయి. వౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, సేవల రంగం, ఐటీ అలాగే ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సౌకర్యం వంటి అంశాలపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మంగోలియా విదేశాంగ మం త్రి డీ తోగ్గాబాతర్ చర్చించారు.

04/25/2018 - 04:27

అమెరికా పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆయన భార్యతో కలిసి అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఎస్టేట్‌ను సందర్శించారు.
చిత్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్.

04/25/2018 - 04:49

బీజింగ్, ఏప్రిల్ 24: మానవ హక్కులకు శత్రువుగా మారిన ఉగ్రవాదంపై పోరాటం చేయాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం ఇక్కడ పిలుపునిచ్చారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరైన సుష్మా వివిధ దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు మద్దతు, ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాలను కట్టడి చేయాలని పాక్‌ను ఉద్దేశించి ఆమె స్పష్టం చేశారు.

04/25/2018 - 00:32

వాషింగ్టన్, ఏప్రిల్ 24: హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు జారీ చేసే వర్క్ పర్మిట్ వీసా (హెచ్4)లను అమెరికా నిలిపివేయనుంది. ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఫెడరల్ రాజ్యాంగంలోని ఉన్నతాధికారి ఒకరు ఒక శాసనకర్తకు లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు.

04/24/2018 - 02:26

చైనా పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన దృశ్యం.

Pages