S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/27/2016 - 07:55

న్యూయార్క్, అక్టోబర్ 26: అమెరికా అధ్యక్ష పదవికి సరిగ్గా రెండు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజయానికి చిన్న రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరి పక్షంలో నిలిచినప్పటికీ, పెన్సిల్వేనియా, ఓహియో వంటి రాష్ట్రాలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంతగా రాణించలేకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10/26/2016 - 08:21

క్వెట్టా, అక్టోబర్ 25: కల్లోలిత బలూచిస్తాన్ ప్రాంతంలోని ఓ సైనిక శిక్షణ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 61మంది శిక్షణలో ఉన్న పాక్ సైనికులు మరణించారు. మరో 165మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇంత దారుణమైన రీతిలో పాక్‌లో ఐసిస్ మిలిటెంట్లు ఊచకోతకు పాల్పడటం ఇదే మొదటిసారి. భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డ మిలిటెంట్లు కొన్ని గంటలపాటు ఈ మారణహోమం సాగించారు.

10/26/2016 - 08:17

అబ్దుల్లియాన్ (అంతర్జాతీయ సరిహద్దు), అక్టోబర్ 25: అంతర్జాతీయ సరిహద్దు పొడవునా పాకిస్తాన్ రేంజర్లు పాల్పడుతున్న కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలతో ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నిర్మించిన భూగర్భ కమ్యూనిటీ బంకర్లే రెండో ఇల్లుగా మారాయి.

10/25/2016 - 01:51

మనామా, అక్టోబర్ 24: పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం అని భారత్ బహ్రెయిన్‌కు స్పష్టం చేసింది. జమ్ము కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి, సరిహద్దుకు ఆవలనుంచి ఉగ్రవాదులను ప్రేరేపించటమేనని భారత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహ్రయిన్ దేశ వ్యవహారాల శాఖ మంత్రి రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు వివరించారు.

10/25/2016 - 01:42

బీజింగ్, అక్టోబర్ 24: భారత్‌తో తమకు ఉన్న సరిహద్దు సమస్య విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా గట్టిగా హెచ్చరించింది. ఈ వ్యవహారంలో ఏ విధమైన ప్రమేయం కల్పించుకున్నా సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుందని, సరిహద్దుల్లో ఇప్పటివరకూ కష్టపడి నెలకొల్పుకున్న శాంతియుత పరిస్థితులకూ విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది.

10/24/2016 - 06:06

క్లీవ్‌లాండ్ (అమెరికా), అక్టోబర్ 23: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని ఒకవైపు ప్రధాన స్రవంతి మీడియా, రాజకీయ పండితులు అంచనా వేసినప్పటికీ, ట్రంప్ మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని నొక్కిచెప్పారు.

10/24/2016 - 06:05

బీజింగ్, అక్టోబర్ 23: ప్రస్తుత సవాళ్లను అధిగమించాలంటే చైనాకు మావోలాంటి మరో నాయకుడు అవసరమని ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్ని విధాలుగా సమర్థుడని అధికార కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. మావోకు ఉండాల్సిన లక్షణాలన్నీ జిన్‌పింగ్‌కు ఉన్నాయని వెల్లడించింది. దేశంలో జిన్‌పింగ్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ కీలక భేటీ జరపనున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

10/24/2016 - 06:04

లండన్, అక్టోబర్ 23: యురోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలిజబెత్ రాణికి చెందిన రాజరికపు ఎస్టేట్ తీవ్ర నష్టాలను చవిచూస్తుందని బ్రిటన్ మీడియా రిపోర్ట్ చేసింది. నార్‌ఫోక్‌లోని బ్రిటన్ రాజవంశానికి చెందిన సండ్రింగమ్ ఎస్టేట్‌కు ఈయూ వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోతే సంవత్సరానికి సుమారు 7లక్షల పౌండ్ల వరకు నష్టం వాటిల్లుతుందని సండే టెలిగ్రాఫ్ పేర్కొంది.

10/24/2016 - 06:04

కీవ్‌లాండ్, అక్టోబర్ 23: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పెద్దలు మాత్రమే చూడవలసిన సినిమాలలో నటించే ఒక నటి, డైరెక్టర్ జెస్సికా డ్రేక్ గతంలో ట్రంప్ తనను లైంగికంగా వేధించారని ఆదివారం ఆరోపించారు.

10/24/2016 - 06:03

మోసుల్, అక్టోబర్ 23: ఇరాక్‌లో ఐసిస్ చిట్టచివరి స్థావరమైన మోసుల్‌ను ఇరాక్ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు చుట్టుముట్టినప్పుడు ఐసిస్ దాదాపు 284 మంది మగవారిని, పిల్లలను దారుణంగా కాల్చి చంపేసిందని ఇరాక్ ఇంటెలిజన్స్ వర్గాలు సిఎన్‌ఎన్‌కు తెలియజేశాయి.

Pages