S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/20/2016 - 07:33

వాషింగ్టన్, అక్టోబర్ 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలు మరో మూడు వారాలు ఉండగా తాజాగా ఫాక్స్ న్యూస్ పోల్‌లో హిల్లరీ ప్రత్యర్థికంటే ముందుకు దూసుకుపోతున్నారు. గత వారం సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ ఏడు పాయింట్ల ముందంజలో ఉండేవారు.

10/20/2016 - 07:32

దుబాయ్, అక్టోబర్ 19: తాను వలచింది రంభ... తాను మునిగింది గంగ - ఇది తెలుగు సామెతే అయినా, ఈ నవ అరబ్ జంటకు అక్షరాలా అతికిపోతుంది. తాను పెళ్లాడింది అప్సరస అనుకున్నాడు, ఆమె అందాల్ని చూసి మైమరచిపోయి వివాహమాడాడు. తీరా పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఆమె అందాన్ని చూసి ఖిన్నుడయ్యాడు. స్విమ్మింగ్ పూల్‌లో దిగి బయటకొచ్చిన తర్వాత గానీ ఆమె అసలు రూపం బయటపడలేదు. అంతే, విడాకులు కోరాడు.

10/20/2016 - 07:28

రియాద్, అక్టోబర్ 19: సౌదీ చరిత్రలో ఓ అరుదైన ఉరిశిక్ష అమలుచేశారు. ఒక వ్యక్తి మృతికి కారణమైన సౌదీ రాజ కుటుంబానికి చెందిన ఓ యువరాజుకే ఏకంగా మరణశిక్ష అమలు చేశారు. సౌదీ యువరాజు తుర్కీ బిన్ సౌద్ అల్ అబీర్‌ను బుధవారం ఉరితీసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2012 డిసెంబర్‌లో రియాద్‌లోని డిజెర్ట్ క్యాంపులో జరిగిన ఘర్షణ సందర్భంగా యువరాజు అబీర్ కాల్పులు జరిపాడు.

10/19/2016 - 00:06

వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ తీవ్రమవుతోంది. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు వ్యూహాత్మక రీతిలో తమ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

10/18/2016 - 07:51

బీజింగ్, అక్టోబర్ 17: చైనా మరోసారి తన పాకిస్తాన్ అనుకూల వైఖరిని చాటుకుంది. ఉగ్రవాదం విషయంలో భారత్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ ఎల్లవేళలా తనకు మిత్ర దేశమైన పాకిస్తాన్‌కు గట్టిగా మద్దతునిచ్చింది. ఒక దేశంతో కాని, ఒక మతంతో కాని ఉగ్రవాదానికి ముట్టిపెట్టడానికి తాను వ్యతిరేకమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ చేసిన గొప్ప త్యాగాలను గుర్తించాలని ప్రపంచ సమాజాన్ని కోరింది.

10/18/2016 - 06:48

బీజింగ్, అక్టోబర్ 17: ఇద్దరు వ్యోమగాములతో కూడిన అంతరిక్షనౌకను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఉత్తర చైనాలోని జిఖ్వియన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు నౌకను కక్ష్యలోకి పంపింది. జింగ్ హైపెంగ్ (50), చెన్ డాంగ్ (37)లతో కూడిన షెంఝూ-11 అంతరిక్ష నౌకను ప్రయోగించినట్టు చైనా ప్రకటించింది.

10/18/2016 - 05:21

బాగ్దాద్, అక్టోబర్ 17: ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో ఉన్న అత్యంత కీలక పట్టణం మోసుల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ఇరాక్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రపంచానికే పెనుముప్పుగా మారిన ఐసిస్ జిహాదీ గ్రూపును అణచివేయటానికి నిర్ణయాత్మక యుద్ధమవుతుందని దీన్ని భావిస్తున్నారు. మోసుల్‌లో దాదాపు పదిహేను లక్షల జనాభా ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

10/18/2016 - 05:19

న్యూయార్క్, అక్టోబర్ 17: అమెరికా పర్యటనకు వచ్చిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండుసార్లు తనిఖీ చేశారు. దీంతో రెండు గంటలపాటు ఆయన విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఒమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్వీట్ చేశారు.

10/18/2016 - 05:18

లాహోర్, అక్టోబర్ 17: పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో 30 మంది చనిపోగా, 55 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫైసలాబాద్ నుంచి బహవాల్‌పూర్, కరాచి నుంచి రహీమ్ యార్ ఖాన్ వెళ్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

10/18/2016 - 05:17

యాంగాన్, అక్టోబర్ 17: మైన్మార్‌లో శనివారం తెల్లవారు జామున ఒక బోటు మునిగిపోవడంతో దాదాపు వందమంది గల్లంతయ్యారు. బోటులో 250 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బోటు సామర్థ్యానికి మించి దాదాపు వందమంది వరకూ ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 25 మృతదేహాలను వెలికితీసినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.

Pages