S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/15/2016 - 07:30

వాషింగ్టన్, అక్టోబర్ 14: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓ వైపు మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు, మరో పక్క లైంగికపరమైన ఆరోపణలు ముప్పిరిగొనడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు మాట మార్చేశారు. తనను బలి పశువును చేస్తున్నారని, ఇదంతా తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పన్నిన కుట్రని వాపోయారు.

10/15/2016 - 07:29

బీజింగ్, అక్టోబర్ 14: అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వం, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చూడడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చైనా శుక్రవారం స్పష్టం చేసింది.

10/14/2016 - 01:22

స్టాక్‌హోమ్, అక్టోబర్ 13: అమెరికాకు చెందిన ప్రముఖ గేయ రచయిత బామ్ డైలాన్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య అవార్డును దక్కించుకున్నారు. ఒక గేయ రచయితకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించడం ఇదే మొదటిసారి. అమెరికా గేయ సంప్రదాయంలో నూతన భావజాలాన్ని ప్రవేశపెట్టినందుకుగాను 75 ఏళ్ల డైలాన్‌ను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

10/14/2016 - 01:16

లండన్, అక్టోబర్ 13: రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ది సన్ రిపోర్ట్ చేసింది. విదేశాల్లో ఉన్న తన పౌరులందరినీ వీలైనంత త్వరగా స్వదేశానికి రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మూడో ప్రపంచ యుద్ధం జరిగే వదంతులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని పేర్కొంది.

10/14/2016 - 01:14

న్యూయార్క్, అక్టోబర్ 13: మరో నెల రోజుల్లోగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించే 2005 నాటి వీడియో బయటకు రావటంతో ఇప్పటికే అభాసుపాలైన ట్రంప్‌పై తాజాగా అయిదుగురు మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ట్రంప్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని, వేధించారని వారు ఆరోపించారు.

10/14/2016 - 01:12

బాంకాక్, అక్టోబర్ 13: థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ (88) గురువారం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏడు దశాబ్దాలుగా థాయ్‌లాండ్ రాజుగా పరిపాలించిన భూమిబోల్ మధ్యాహ్నం 3.52 గంటలకు సిరిరాజ్ ఆసుపత్రిలో ప్రశాంతంగా అస్తమించినట్లు రాజభవనం ఒక ప్రకటనలో ప్రకటించింది.

10/13/2016 - 06:48

జెనీవా, అక్టోబర్ 12:అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే ప్రపంచానికే ముప్పని ఐక్యరాజ్య సమితి హక్కుల విభాగం అధినేత జీద్ రాద్ అల్ హుస్సేన్ హెచ్చరించారు. జెనీవాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అమెరికా రాజకీయ ప్రచారంలో పాల్గొనాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించి ఈ అభిప్రాయం కలుగుతోందని చెప్పారు.

10/13/2016 - 06:47

వాషింగ్టన్, అక్టోబర్ 12: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు శరవేగంగా సమీపిస్తుండటంతో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ వాతావరణం పెరిగిపోయింది. ఇప్పటివరకు ఓ మోస్తరుగా సాగిన ప్రచారం వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి, ఇరు పార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు దారితీసింది.

10/11/2016 - 05:59

సెయింట్ లూయిస్, అక్టోబర్ 10: రెండో బిగ్ డిబేట్‌లోనూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే పైచేయి అయింది. అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలు అత్యంత నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో జరిగిన తాజా డిబేట్‌లో ఇటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో హిల్లరీ ముఖాముఖీ ఢీకొన్నారు. రోజురోజుకూ దిగజారుతున్న తన ప్రాభవాన్ని కాపాడుకునేందుకు ట్రంప్ తీవ్రస్థాయిలోనే హిల్లరీపై రెచ్చిపోయారు.

10/10/2016 - 06:59

షికాగో, అక్టోబర్ 9: తప్పుల మీద తప్పులు చేస్తూ సొంత కూతుర్ని కూడా వదలకుండా మహిళలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇక చావోరేవో లాంటి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. అమెరికా రాజకీయ చరిత్రలో అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తున్న రెండో బిగ్ డిబేట్‌కు రంగం సిద్ధమైంది.

Pages