S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/26/2016 - 16:42

లాపాజ్: బొలీవియాలో వారం రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం మౌనం పాటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గని కార్మికులు డిప్యూటీ హోంమంత్రిని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని గని కార్మికుల ఆందోళనలు ఊపందుకున్నాయి.

08/26/2016 - 13:00

ఇస్తాంబుల్‌: టర్కీలోని సిజర్‌ నగర పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం భారీ పేలుడు సంభవించి 9 మంది పోలీసులు మృతి చెందగా 64 మంది గాయపడ్డారు. కుర్దిష్‌ ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసు ప్రధాన కార్యాలయ భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

08/26/2016 - 11:13

కాఠ్‌మాండూ: నేపాల్‌లోని కాఠ్‌మాండూ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపు తప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. మరో 17 మంది గాయాలతో బయటపడ్డారు. మృత దేహాలను వెలికితీసేందుకు సహాయకచర్యలు చేపట్టారు.

08/26/2016 - 02:34

న్యూఢిల్లీ, ఆగస్టు 25: పాకిస్తాన్‌తో చర్చల విషయంలో భారత్ తన వైఖరిని మరింత స్పష్టమైన వైఖరిని కనబరిచింది. కాశ్మీర్ వివాదంపై చర్చించడానికి ఇస్లామాబాద్‌కు రావలసిందిగా పాకిస్తాన్ చేసిన తాజా ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఉగ్రవాద సమస్యే తమకు ముఖ్యమైన అంశమని పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదంపై చర్చలకు తాము సిద్ధమని తెగేసి చెప్పింది.

08/26/2016 - 01:17

అక్యూమోలీ, ఆగస్టు 25: ఇటలీలో భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 274కి చేరుకుంది. మధ్య ఇటలీలో బుధవారం సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని కలగచేసింది. ప్రాణ, ఆస్తినష్టం అపారంగా ఉంది. పర్వత ప్రాంత గ్రామాల్లో భూకంపానికి ప్రాణనష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపునకు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికి చనిపోయినవారి సంఖ్య 247కు చేరుకుంది.

08/25/2016 - 15:56

ఇటలీ : ఇటలీ భూకంపంలో ఇప్పటివరకు 300 మంది మరణించారు. పలువురు ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక అమాత్రిస్‌ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేశాయి. పర్వత ప్రాంతంలోని పలు గ్రామాలు భూకంప తీవ్రతకు తుడుచుపెట్టుకుపోయాయి. అధికారులు, సహాయ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని ఇటలీ ప్రధాని తెలిపారు.

08/25/2016 - 11:19

కాబూల్‌: ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. మృతుల్లో ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు భద్రతా సిబ్బంది, ముగ్గురు పోలీసులు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 35 మంది విద్యార్థులు, 9 తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు.

08/25/2016 - 11:09

రోమ్‌: ఇటలీలో బుధవారం భారీ భూకంపం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 247కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని మాటియో రెన్జీ వెల్లడించారు. 368 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ప్రకంపనలు రావడంతో భవనాలు నేలకొరిగాయి. అమాట్రీస్‌, అక్యుమోలి, పెస్కారా డెల్‌ ట్రోంటో పట్టణాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

08/25/2016 - 06:46

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేర్కొంటున్న 300 అడుగుల ఎయిర్‌లాండర్ టెన్ విమానం బుధవారం జరిగిన రెండో ప్రయోగ పరీక్షలో ప్రమాదానికి గురైంది. దాదాపుగంటన్నర సేపు గాలిలో విహరించిన విమానం తిరిగి వస్తుండగా ఉత్తర లండన్ విమాన క్షేత్రంలో నేలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది.

08/25/2016 - 00:42

అకుమోలి (ఇటలీ)/ యాగోన్, ఆగస్టు 24: ఇటలీ దేశాన్ని బుధవారం తెల్లవారుజామున శక్తిమంతమైన భూకంపం కకావికలం చేసింది. రిక్టర్ స్కేలులుపై 6.0-6.2 పాయింట్ల తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం తాకిడికి ఇప్పటివరకు కనీసం 73 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డమో, కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుపడి పోయారు. మరోపక్క మధ్య మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 6.8 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం సంభవించింది.

Pages