S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/12/2016 - 06:01

బీజింగ్: సెంట్రల్ చైనాలోని విద్యుత్ కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో 21 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స జరిపిస్తున్నారు.

08/11/2016 - 12:24

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్జా నగరంలోని అల్‌ఖైర్ ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం పేలుడు సంభవించింగా ఆరుగురు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గత సోమవారం ఇదే ఆస్పత్రిలో పేలుడు కారణంగా 70 మంది మరణించగా, సుమారు వందమంది గాయపడ్డారు. ఈ పేలుళ్లతో పాక్ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలకు లోనయ్యారు.

08/10/2016 - 16:54

మనీలా: ఫిలిప్పీన్స్‌లో జనవరిలో జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలపై దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు ఐసిస్‌ ప్రకటించింది. మిస్‌ యూనివర్స్‌ను చంపడానికి ఓ బాంబు తయారుచేయాలని ఉగ్రవాదులు జిహాదీలకు సలహాలు ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు.

08/10/2016 - 16:44

దిల్లీ: కుడంంకుళం అణు విద్యుత్‌ కేంద్రం ప్రారంభం ద్వారా భారత్‌, రష్యా మధ్య సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో నిర్మించిన ఈ అణువిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ను నరేంద్రమోదీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల కుడంకుళం మొదటి యూనిట్‌ నిర్మాణం 2002లో ప్రారంభమైంది.

08/10/2016 - 14:53

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని యార్‌మౌక్‌ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదంలో 11 మంది పసివారు సజీవదహనమయ్యారు. నెలలు నిండకుండానే పుట్టి ఆసుపత్రి ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతున్న 11 మంది సజీవదహనమయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఏడుగురు చిన్నారులు, 29 మంది మహిళలను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ సరఫరాలో లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

08/10/2016 - 06:37

న్యూయార్క్, ఆగస్టు 9: విశ్వ విఖ్యాత సంగీత విద్వాంసురాలు, భారత రత్న, స్వర్గీయ ఎంఎస్ సుబ్బులక్ష్మికి ఐక్యరాజ్యసమితిలో అరుదైన గౌరవం దక్కనుంది. ఆస్కార్ అవార్డు విజేత ఆధునిక సంగీత రారాజు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనమైన నివాళి సమర్పించనున్నారు.

08/10/2016 - 06:32

వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే దేశ చరిత్రలో అత్యంత నిర్లక్ష్యపు అధ్యక్షుడవుతాడని రిపబ్లికన్ పార్టీకి చెందిన 50మంది అత్యున్నత జాతీయ భద్రతా నిపుణులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్‌కు వ్యక్తిత్వం లేదని, స్వయం నియంత్రణ అసలు లేదని, అత్యంత ప్రమాదకరమైన గుణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

08/09/2016 - 12:16

వాషింగ్టన్‌ : ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో మరో అద్భుతాన్ని చూడొచ్చు. ఆకాశం మరింత ప్రకాశవంతం కానుంది. గంటకు సుమారు 200 వరకూ ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ఒక్కసారిగా భారీ వెలుగును ఉత్పత్తి చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

08/09/2016 - 02:49

వాషింగ్టన్, ఆగస్టు 8: ఈ వారంలో ఆకాశం ఉల్కాపాతంతో కాంతులు విరజిమ్ముతుందని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. గంటకు 200 ఉల్కలు భూవాతావరణాన్ని తాకుతాయని, దాదాపు గంటపాటు కాంతి వర్షాన్ని కురిపిస్తాయని నాసా పేర్కొంది. ఆగస్ట్ 11-12 తేదీలలో ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా శాస్తవ్రేత్త బిల్ కూక్ పేర్కొన్నారు. కచ్చితమైన పరిస్థితుల్లో గంటకు 200 ఉల్కల చొప్పున భూవాతావరణాన్ని తాకుతాయన్నారు.

08/09/2016 - 02:43

కరాచి, ఆగస్టు 8: పాకిస్తాన్‌లో సోమవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. మానవ బాంబు జరిపిన ఈ దాడిలో 70 మంది మృతి చెందారు. ఇందులో చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. బాలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని అయిన క్వెట్టా నగరంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ మానవ బాంబు దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Pages