S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/09/2016 - 02:39

కరాచీ, ఆగస్టు 8: భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య అణు తప్పదని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ వెల్లడించాడు. కాశ్మీర్ అంశమే ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసుకుందని సోమవారం ఇక్కడ తెలిపాడు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కాశ్మీర్ ప్రజలను పోరాడుతునే ఉంటారని హెచ్చరించాడు.

08/09/2016 - 02:35

ఖాట్మండు, ఆగస్టు 8: సెంట్రల్ నేపాల్‌లోని అటవీ ప్రాంతంలో సోమవారం ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో నవజాత శిశువు సహా అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఏడుగురూ దుర్మరణం చెందారు. ఫిష్‌టెయిల్ ఎయిర్ సంస్థకు చెందిన 9ఎన్-ఎకెఎ హెలికాప్టర్ చికిత్స నిమిత్తం తల్లీ, శిశువును ఖాట్మండుకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

08/08/2016 - 18:07

ఖాట్మండు: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయి పైలట్‌తో పాటు ఏడుగురు మరణించారు. మృతుల్లో ఓ శిశువు కూడా ఉంది. శిశువును నేపాల్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆమె తల్లి, బంధువులు హెలికాప్టర్ ఎక్కారు. బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయి.

08/08/2016 - 18:05

ఇస్లామాబాద్: కాశ్మీర్ విషయమై భారత్, పాకిస్థాన్‌ల మధ్య చిరకాలంగా ఘర్షణ నెలకొన్నందున భవిష్యత్‌లో ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని పాక్‌లోని హిజ్బుల్ ముజాహుద్దీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఆయన సోమవారం కరాచీలో మీడియాతో మాట్లాడుతూ, కాశ్మీర్ కోసం ఇప్పటికే భారత్, పాక్‌ల మధ్య పలుసార్లు పోరాటాలు జరిగాయని, ఇక అణుయుద్ధం తప్పేలా లేదని వ్యాఖ్యానించాడు.

08/08/2016 - 16:02

కాఠ్‌మాండూ: కాఠ్‌మాండూ వెళ్లే మార్గంలోని నువాకోట్‌ సమీపంలో సోమవారం ఉదయం ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో పైలట్‌ సహా ఆరుగురు ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.

08/08/2016 - 08:07

లండన్, ఆగస్టు 7: ఉగ్రవాదుల దాడులను ముందస్తుగా గ్రహించి, నిరోధించటానికి బ్రిటన్ నిఘా వ్యవస్థ ఎంఐ5 ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. బిహేవియిరల్ సైన్స్ యూనిట్ (బిఎస్‌యు) పేరుతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ థేమ్స్‌హౌస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది.

08/07/2016 - 01:22

రోవన్, ఆగస్టు 6: ఫ్రాన్స్‌లోని రోవన్ నగరంలో ఓ బార్‌లో బర్త్‌డే పార్టీ పెను విషాదాన్ని మిగిల్చింది. బర్త్‌డే పార్టీలో కేక్ వద్ద వెలిగించిన కొవ్వొత్తులు పడి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మద్యం బాటిళ్లపై పడి మంటలు చెలరేగాయి. అంతే అక్కడున్న డెకరేషన్‌కు మంటలు వ్యాపించి 13 మంది దుర్మరణం చెందారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారంతా 18-25 మధ్య వయస్కులే.

08/07/2016 - 01:20

న్యూయార్క్, ఆగస్టు 6: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఈసారి మహిళను ఎన్నుకోవాలన్న సభ్య దేశాల ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. ఈ పదవికోసం పోటీపడుతున్న 11 అభ్యర్థులకు శుక్రవారం భద్రతా మండలి నిర్వహించిన రెండో విడత సాధారణ ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి అంటానియో గటెర్రెస్ మరోసారి తన ఆధిక్యతను చాటుకున్నారు.

08/07/2016 - 01:07

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 6: దక్షిణాఫ్రికాలోని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎఎన్‌సి)కి ఎన్నికల రీత్యా గతంలో ఎన్నడూ లేని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మైనారిటీలయిన శే్వతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సలిపి 1994 ఎన్నికల్లో విస్త్రృత ప్రజాబాహుళ్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఎఎన్‌సికి ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి.

08/07/2016 - 01:06

ఇస్లామాబాద్, ఆగస్టు 6: భారత్‌లో దాడులకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ మరోసారి బాహాటంగా తన నైజాన్ని చాటుకుంది. కాశ్మీరు అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చేందుకు పదేపదే విఫలయత్నాలు చేస్తున్న పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, కాశ్మీరు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి వైద్య సహాయాన్ని అందజేస్తామని శనివారం ప్రకటించారు. కాశ్మీరు సమస్యను ‘మానవతా సంక్షోభం’గా ఆయన అభివర్ణించారు.

Pages