S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/04/2016 - 18:23

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని పాకిస్థాన్ సర్కారు అడ్డుకుంది. ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్నపుడు భారత మీడియాను, అంతర్జాతీయ మీడియాను అనుమతించలేదు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ దేశ హోం మంత్రి ప్రసంగాలను మాత్రమే పాక్ మీడియా ప్రసారం చేసింది.

08/04/2016 - 18:22

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు, దేశాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో గురువారం సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు చేశారు. ఉగ్రవాదంలో మంచిది, చెడ్డది అనేవి ఉండవన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అరికట్టాలన్నారు.

08/04/2016 - 08:30

దుబాయి, ఆగస్టు 3: కేరళలోని తిరువనంతపురంనుంచి దుబాయి వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. 282 మంది ప్రయాణికులు, 18మంది సిబ్బంది మొత్తం 300 మందితో తిరువనంతపురం నుంచి దుబాయి వస్తున్న ఈ విమానం దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయింది. ఆ వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి.

08/04/2016 - 08:20

లండన్, ఆగస్టు 3: హిందూ సంప్రదాయం బలవంతపు మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, వ్య క్తుల మానవ హక్కులను హరించే విధంగా మార్పిళ్లను ఒప్పుకోదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘హిందూయిజం ఒక మతం కాదు. ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్రాన్నిచ్చింది. మతం, విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది. వారి ఇష్టానుసారం ఇష్టమైన ధర్మాన్ని అనుసరించవచ్చు.

08/04/2016 - 08:19

సియోల్, ఆగస్టు 3: ఉత్తర కొరియా బుధవారం తొలిసారి నేరుగా జపాన్ సముద్ర జలాల్లోకి ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు.. ఉత్తర కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలకు ఇది కారణమైంది.

08/03/2016 - 17:41

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాకను నిరసిస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. హురియత్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సలాహుద్దీన్ పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సమావేశానికి భారత ప్రతినిధిగా రాజ్‌నాథ్ హాజరవుతున్నారు.

08/03/2016 - 15:38

దుబాయ్‌: తిరువనంతపురం- దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానం దుబాయ్‌లో బుధవారం అత్యవసరంగా దిగింది. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో మొత్తం 275మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

08/03/2016 - 14:34

సియోల్‌: ఉత్తరకొరియా తొలిసారిగా నేరుగా జపాన్‌ జలాల్లోకి ఖండాంతర క్షిపణిని జపాన్‌ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొరియా రెండు ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో పడిందని.. జపాన్‌ ఉత్తర తీరానికి 250కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోందని జపాన్‌ వెల్లడించింది.

08/03/2016 - 11:44

న్యూజెర్సీ: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న అభియోగంపై విశాఖకు చెందిన కూనం వీరభద్రరావును అమెరికాలోని న్యూజేర్సీలో పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30న ఆయన లాస్‌ఏంజిలెస్ నుంచి న్యూజెర్సీకి విమానంలో వెళుతూ ఓ ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఆ ఫిర్యాదుపై వీరభద్రరావును పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

08/03/2016 - 08:03

వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే తీరుపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యమైన ఆరోపణ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. ‘‘నాకు భయంగా ఉంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని. నేను నిజాయితీగా ఉండాలి’’ అని కొలంబస్ టౌన్‌హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు.

Pages