S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/31/2016 - 05:14

పెషావర్, జూలై 30: పాకిస్తాన్‌లో శనివారం ఆకస్మికంగా ముంచెత్తిన వరదల్లో ఒక వ్యాన్ కొట్టుకుపోయి, అందులో ప్రయాణిస్తున్న 20 మంది మృతి చెందారు. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో బారానుంచి బజార్ జాఖా ఖేల్‌కు పెళ్లి బృందాన్ని తీసుకొని వెళ్తున్న వ్యాన్ తబాయి ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయింది.

07/31/2016 - 05:11

సియాటిల్, జూలై 30: అమెరికాలో కాల్పుల సంస్కృతి బెంబేలిస్తూనే వుంది. తాజాగా సియాటిల్ నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని నగర పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని హార్బోవ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. కాల్పులకు పాల్పడ్డాడని భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

07/31/2016 - 02:59

వాషింగ్టన్, జూలై 30: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామినీ అయిన డొనాల్ట్ ట్రంప్ ఉద్యోగాలు, పన్నులు, జాతీయ భద్రత అంశాలపై తన డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యూహాలను ఎండగట్టారు. నిలకడయిన నాయకత్వాన్ని అందిస్తానని హిల్లరీ క్లింటన్ పార్టీ కనె్వన్షన్‌లో హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత ట్రంప్ తాజా వీడియోలో ఆమె విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.

07/30/2016 - 14:23

టర్కీ : టర్కీలోని హక్కారీ ప్రావిన్స్‌లోన ఓ ఆర్మీ బేస్‌ను కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన మిలిటెంట్లు ముట్టడించేందుకు యత్నించారు. ఈ ఘటనలో 35 మంది ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ మిలిటరీ అధికారులు వెల్లడించారు. హక్కారీ ప్రావిన్స్‌లో కూడా కుర్దిష్‌ మిలిటెంట్లు, ఆర్మీ జవాన్ల మధ్య ఘర్షణ లో ఎనిమిది మంది సైనికులు మృతిచెందగా, 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

07/30/2016 - 07:42

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ మరోసారి తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మత దురభిమానం, శబ్దాడంబరం గల ట్రంప్‌కు అధ్యక్ష పదవి వంటి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించడం అమెరికాకు క్షేమం కాదని ఆమె ఓటర్లను హెచ్చరించారు.

07/30/2016 - 07:37

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికాలో అధికార పక్షమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కనె్వన్షన్‌లో అతి చిన్న వయసు గల డెలిగేట్‌గా భారత సంతతికి చెందిన 18 ఏళ్ల యువతి శ్రుతి పలనియప్పన్ అందరి దృష్టిని ఆకర్షించారు. సెడార్ రాపిడ్స్ నుంచి ఈ కనె్వన్షన్‌కు వచ్చిన శ్రుతి హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. హిల్లరీ క్లింటన్‌కు ఆమె గట్టి మద్దతుదారు.

07/29/2016 - 03:51

ఇస్లామాబాద్, జూలై 28: కాశ్మీర్ అల్లర్ల వెనుక భారత్ చేస్తున్న వాదనే నిజమైంది. అదే నిజమంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ కూడా ధ్రువీకరించాడు! ఈ సంచలన ప్రకటన ద్వారా ఏకంగా నవాజ్ షరీఫ్‌ను ఇరకాటంలో పడేశాడు.

07/28/2016 - 17:03

కొలంబియా: సెస్నా310 అనే ప్రైవేట్‌ విమానం ఉత్తర కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూండగా పక్కకు ఒరిగిపోవడంతో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. విమానంలోని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోపే విమానం పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు.

07/28/2016 - 05:27

ఫిలడల్ఫియా, జూలై 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇదో సరికొత్త శకం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళ హిల్లరీ. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో వీరిద్దరి మధ్యే దేశాధ్యక్ష పదవికి తీవ్ర పోటీ జరుగబోతోంది.

07/28/2016 - 03:26

మనీలా, జూలై 27: ఇద్దరు భారతీయులను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు వరించింది. కర్నాటక సంగీత విద్వాంసుడు టిఎమ్ కృష్ణ (40), జాతీయ సఫారీ కర్మచారి ఆందోళన కన్వీనర్ బెజవాడ విల్సన్ (50)లను 2016 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేశారు.

Pages