S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/16/2016 - 04:35

ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్తాన్ కాశ్మీర్ అంశంపై మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యకు దిగింది. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం ‘అమరవీరుడి’గా ప్రకటించారు. కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి జూలై 19ని ‘బ్లాక్ డే’గా పాటిస్తామని తెలిపారు.

07/15/2016 - 17:31

ఫ్రాన్స్ : రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఫ్రాన్స్ క్రీడాకారులపై ఉగ్రకుట్రను ఫ్రాన్స్ ప్రభుత్వం భగ్నం చేసింది. బ్రెజిల్‌ భద్రతాదళాల సాయంతో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఫ్రాన్స్ మిలిటరీ ఇంటిలిజెన్స్ ప్రకటించింది. బ్రెజిల్‌ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సకాలంలో ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఉగ్రకుట్రను ఫ్రాన్స్ ప్రభుత్వం భగ్నం చేసింది.

07/15/2016 - 17:23

ఫ్రాన్స్: పలుదేశాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులు తమకెంతో ఆనందం కలిగించాయని, ఫ్రాన్స్‌లో ట్రక్కు దాడిలో ఆ దేశ పౌరులు మరణించడం సంతోషం కలిగించిందని ఐసిస్ మద్దతుదారులు సామాజిక మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఐరోపా దేశాల్లో మరిన్ని ఉగ్రదాడులు ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో 80 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

07/15/2016 - 15:16

తిరువనంతపురం: సూడాన్‌లోని జుబా నుంచి 156 మంది భారతీయులను తీసుకువచ్చిన విమానం శుక్రవారం ఉదయం తిరువనంతపురం చేరుకుంది. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులు తిరువనంతపురంలో దిగగా, మిగిలిన ప్రయాణికులతో విమానం ఢిల్లీ చేరుకుంది. మరి కొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. రాజకీయ అనిశ్చితి, యుద్ధంలో చిక్కుకున్న దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారు.

07/15/2016 - 12:33

వాషింగ్టన్: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదం క్యాన్సర్ వ్యాధిలా దాపురించిందని, తానే అమెరికా అధ్యక్షుడినైతే దాని అంతాన్నా చూస్తానని అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో గురువారం రాత్రి ఓ ట్రక్కు దూసుకుపోయిన ఘటనలో 80 మంది మరణించడంపై ఆయన శుక్రవారం స్పందించారు.

07/15/2016 - 11:36

దిల్లీ: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 80 మంది మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గాయపడిన వారంత త్వరలోనే కోలుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

07/15/2016 - 11:41

పారిస్‌: బాస్టిల్‌ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో గురువారం రాత్రి నీస్‌ నగరంలో ఓ ట్రక్కు ప్రజల పైకి దూసుకెళ్లిన ఘటనలో 80 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. బాస్టిల్‌ డేలో భాగంగా బాణాసంచాను వీక్షిస్తున్న సమయంలోనే ట్రక్కు అధిక వేగంగా పాదచారుల వంతెనపై నుంచి దూసుకెళ్లింది.

07/15/2016 - 03:47

చిత్రం.. న్యూఢిల్లీలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతానీ

07/15/2016 - 03:37

న్యూఢిల్లీ, జూలై 14: ఘర్షణలతో యుద్ధ్భూమిలా మారిన దక్షిణ సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ రెండు సైనిక విమానాలను పంపింది. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో చిక్కుకున్న 300మంది భారతీయులను అక్కడినుంచి తరలించేందుకు రెండు సైనిక విమానాలను పంపినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.

07/15/2016 - 03:34

న్యూయార్క్, జూలై 14: హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పాక్ అభివర్ణించటం, ఇది రాజ్యాంగం ముసుగులో భారత ప్రభుత్వం చేసిన హత్యగా అంతర్జాతీయ వేదికలపే ప్రేలాపనలు చేయటంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. దాయాది దేశం కాశ్మీర్‌లో విద్వేషాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడే ఎలాంటి అర్హతా పాకిస్తాన్‌కు లేదని భారత్ స్పష్టం చేసింది.

Pages